Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఇశ్రాయేలు నిమిత్తం దేవుని ప్రణాళిక

    ఇశ్రాయేలు విషయంలో దేవుని ప్రణాళిక ప్రతీ కుటుంబానికీ దున్నటానికి సరిపోయేంత నేల అందులో ఓ ఇల్లు ఉండాలి. ఇలాఉ పయోగకరమైన, శారీరక శ్రమ చెయ్యాల్సిన, స్వయం సహాయక జీవితానికి వనరులు ప్రోత్సాహం ఏర్పాటు చేసాడు. ఆ ప్రణాళికకు ఏ మానవ ఆలోచనలూ మెరుగులు దిద్దలేకపోయాయి. ప్రపంచం దీని నుండి తొలగిపోయినందుకే నేడు మన మధ్య పేదరికం. దౌర్భగ్య స్థితి ఉన్నాయి. కనానులో ఇశ్రాయేలీయులు స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నప్పుడు భూమిని ప్రజలందరికీ పంపిణీ చేసారు. గుడార పరిచారకులైన లేవీయులు మాత్రం సమాన భాగం పొందలేదు. గోత్రాల ప్రకారం కుటుంబాల్ని లెక్కించారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి వారసత్వాన్ని ఇవ్వటం జరిగింది.MHTel 149.4

    ఒకరు తన ఆధిపత్యాన్ని కొంతకాలం వరకు అమ్ముకోవటం సాధ్యపడినా అతడు తన పిల్లల వారసత్వాన్ని బదలాయించటానికి లేదు. తన భూమిని విడిపించుకోగలినప్పుడు దాన్ని ఎప్పుడైనా విడపించుకోవచ్చు. ప్రతీ ఏడో సంవత్సరము అప్పులు చెల్లించటం జరిగేది. ఏబయ్యో సంవత్సరము లేక సునాద సంవత్సరములో చిరాస్తి అయిన భూమి మొదటి హక్కుదారుడికి తిరిగి వెళ్ళేది.MHTel 150.1

    “భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపించబడునట్లుగా దాని అమ్ముకోవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన యెడల... తన స్వాస్థ్యమును పొందును అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాత సంవత్సరము వరకు కొననివాని వశములో ఉండవలెను”. లేవియకాండము 25:23-28MHTel 150.2

    “మీరు ఆ సంవత్సరమునకు, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశావాసులందరికి విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును, అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.” 10వ వచనం.MHTel 150.3

    ఇలా ప్రతీ కుటుంబానికి దాని స్వాస్థ్యాన్ని భద్రపర్చటం జరిగింది. అధిక ధనం సమకూర్చుకోవటం గాని లేక లేమికి రావటం గాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది.MHTel 150.4