Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంస్థల్లో నర్సు పని

    నర్సులు ప్రతినిత్యం ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులతో సహవసించే ఆసుపత్రులు, సేనటోరియాల్లో, ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి, ప్రతీ మాటలో ప్రతీ చర్యలో శ్రద్ధతో కూడిన పరిగణన కనపర్చ టానికి ప్రత్యేకంగా కృషి చెయ్యటం విధాయకం. ఈ సంస్థల్లో నర్సులు తమ పనిని తేలికగా చక్కగా చెయ్యటం మిక్కిలి ప్రాముఖ్యం. తమ దిన వారీ విధుల నిర్వహణలో తాము క్రీస్తుకు సేవ చేస్తున్నామని వారు నిత్యము గుర్తుంచుకోవాలి.MHTel 185.1

    “భయపడకుము నేను నీ దేవుడైనైయున్నాను. దిగులు పడకుము నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను అదుకొందును”. యెషయా 41:10MHTel 185.2

    రోగులతో వివేకంగా మాటలాడం అవసరం. బాధ అనుభవిస్తున్న వారి వికసింపజేసే మాటలు, వారికి సహాయపడే మాటలు చెప్పగలిగేం దుకు నర్సులు ప్రతీరోజు బైబిలు చదవాలి. బాధపడుతున్న వీరికి పరిచర్య జరుగుతున్న గదుల్లో దేవ దూతలున్నారు. చికిత్స చేస్తున్న వ్యక్తి ఆత్మను చుట్టి ఉన్న వాతావరణం స్వచ్చంగాను. మధురంగాను ఉండాలి. వైద్యులు నర్సులు క్రీస్తు సూత్రాల్ని ప్రేమించాలి. వారి జీవితాల్లో ఆయన సద్గుణాలు కనిపించాలి. అప్పుడు తాము చేసే పనులను బట్టి చెప్పే మాటలను బట్టి వారు రోగులను రక్షకుని చెంతకు ఆకర్షించగలుగుతారు.MHTel 185.3

    ఆరోగ్యాన్ని పునరుద్ధరించటానికి చికిత్స నిర్వహిస్తున్నప్పుడు క్రైస్తవ నర్సు ఆత్మను శరారాన్ని స్వస్థపర్చే క్రీస్తు పైకి రోగి మనసును చక్కని మాటలతో జయప్రదంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని మాటల్లో సమర్పించే ఆలోచనలు తమ ప్రభావాన్ని చూపుతాయి. పెద్ద వయస్సు గల నర్సులు రోగుల గమనాన్ని క్రీస్తు పైకి ఆహ్వానించటానికి వచ్చే అవకా శాల్ని జార విడవకూడదు. వారు శారీరక స్వస్థతను ఆధ్యాత్మిక స్వస్థతతో మిళితం చెయ్యాలి.MHTel 185.4

    స్వస్థత పొందనున్న వ్యక్తి దేవుని చట్టాన్ని అతిక్రమించటం మానాలని నర్సులు మిక్కిలి దయగల, సున్నితమైన రీతిలో బోధించాలి. అతడు పాపపు జీవితాన్ని విసర్జించటానికి ఎంపిక చేసుకోవాలని, దేవుని చట్టాలను కావాలని అతిక్రమిస్తూ తన మీదికి వ్యాధి బాధల్ని తెచ్చుకునే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించలేడని బోధించాలి. కాని ఎవరు దుర్మార్గతను మాని మంచి చెయ్యటానికి నేర్చుకుంటారో వారి వద్దకు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు స్వస్థత కూర్చే శక్తిలా వస్తాడని బోధించాలి.MHTel 186.1

    దేవుని పట్ల ప్రేమ లేని వారు నిత్యం ఆత్మ శరీరాల శ్రేయానికి వ్యతిరేకంగా పనులు చేస్తారు. కానీ ఈ ప్రస్తుత దుష్ట ప్రపంచంలో దేవునికి విధేయంగా నివసించటంలోని ప్రాముఖ్యాన్ని గుర్తించేవారు ప్రతి చెడు అలవాటుకి దూరంగా ఉండటానికి సమ్మతంగా ఉంటారు. కృతజ్ఞత ప్రేమ వారి హృదయాల్ని నింపుతాయి. క్రీస్తు తమ మిత్రుడని వారు తెలుసు కుంటారు. తమకు అటువంటి మిత్రడున్నాడన్న గుర్తింపు అనేక సందర్భాల్లో బాధపడుతున్న వారికి ఉత్తమ చికిత్స కన్నా ఎంతో విలువైనదిగా అని పిస్తుంది. కాగా ఈ రెండు సేవా శాఖలూ అతి ముఖ్య మైనవి. అవి కలసి పని చెయ్యా లి.MHTel 186.2

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents