Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సంఘమందలి బీదల యెడల మన ధర్మము

    మనమధ్య నిత్యము రెండు వర్గముల బీదలున్నారు. తమ స్వకీయ స్వేచ్ఛామార్గము నవలంభించుచు తమ క్రియలచే తమ్మును తామే నాశనము చేసికొనువారు మొదటి వర్గీ యులు. సత్యము విషయము కష్టపరిస్థితులలో పడిన వారు రెండవ వర్గీయులు. మనమున పొరుగువారిని మనవలె ప్రేమించవలెను. ఆమీదట జ్ఞానయుతముగా ఈ రెండు వర్గముల వారికి సరియై న సహాయము చేయవలెను. CChTel 181.4

    ప్రభువు యొక్క బీదలకు చేయవలసిన సహాయము విషయము సందేహము లేదు. వారికి సహాయకరముగా నుండు ప్రతి సందర్భమందును సహాయము చేయవలెను. CChTel 182.1

    పేదలు నశింప జేయబడుటకు విడిచి పెట్టబడలేదని దేవుని ప్రజలు పాప ప్రపంచమునకు తెలియజేయవలెనని దేవుడు కోరుచున్నాడు. సత్యవిషయము తమ గృహముల నుండి బహిష్కరించబడి బాధలకు గురియై న వారి నిమిత్తము ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. విశాలమైన, నిష్కపటమైన ఔదార్యముతో నిండిన హృదయములు గల ప్రజలయొక్క ఆవశ్యకత రానురాను పెరుగుచున్నది. తమ్మును తాను ఉపేక్షించుకొని ప్రభువు ప్రేమించు వీరి పక్షము వహించు వారి యావశ్యకత పెరుగుచున్నది. దైవ ప్రజలలోని బీదలు తమ అవసరముల విషయము నిరాధారులుగా విడువబడరాదు. వారికి ఏదో ఒక బ్రతుకు దెరవు కల్పించవలెను. కొందరికి పనిచేయు నేర్పవలెను. తమ కుటుంబ పోషణ నిమిత్తము కష్టించి పనిచేసి ఇక నేమియు చేయజాలని పరిస్థియందున్నవారికి ప్రత్యేక సహాయము అవసరము. వీరి విషయము మనము శ్రద్ధ వహించి జీవనోపాధి సంపాదించుటల వీరికి సహాయము చేయవలెను. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొను బీదల కుటుంబముల సహాయార్థ కొంత నిధి యుండవలెను. CChTel 182.2

    కొన్ని పరిస్థితుల వలన దేవుని ప్రేమించి ఆయనకు విధేయులైన వారు బీదలగుదురు. కొందరు జాగ్రత్తగా నుండరు. ఎట్లు గడుపుకొనవలెనో వారెరుగరు. మరికొందరు వ్యాధివలనను, కార్యసాధన రాహిత్యమువలనను బీదలగుదురు. కారణమేదైనను వారు అవసరములో నున్నారు. వారికి సహాయము చేయుట యనునది సువార్త సేవలో నొక ప్రధాన భాగము. CChTel 182.3

    ఒక సంఘము నెలకొల్పబడినప్పుడు అందలి సభ్యులు అవసరతలోనున్న విశ్వాసుల కొరకు నమ్మకముగా పనిచేయవలెను. వారేసంఘమునకు చెందిన వరైనను సహాయము చేయవలెను. అట్టి కృషి ఫలితముగా వీరిలో కొందరు ప్రస్తుత కాల ప్రత్యేక సత్యములను అంగీకరించెదరు. 7269-271;CChTel 182.4