Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పరిశుద్దపర్చబడిన జీవితమునకు దానియేలొక సాదృశ్యము

    నిజమైన పరిశుద్ధ జీవితమునకు దానియేలొక ఆవేశపూరితమగు సాదృశ్యము. ఇందు అందరికి పాఠమున్నది. దైవ విధులను నిష్కర్షగా జరిగించుట మానసిక, శారీరక ఆరోగ్యమునకు లాభకరము. నైతికముగాను బుద్ది బల సంబంధముగాను ఉన్నత ప్రమాణములు చేరుటకు, దేవుని యొద్దనుండి జ్ఞానము, బలము పొందుటయు, జీవిత వ్యవహారములన్నింటియందును ఆశానిగ్రహము కలిగియుండుటయు నవసరము. 8SL 23;CChTel 140.1

    దానియేలు జీవితము నిందరహితమగు కొలది అతనిపై తన శత్రువులకు గల విద్వేషము పెచ్చు పెరుగు చుండెను. వారు వెర్రితనముతో నిండుకొనిరి. ఏంయనగా ఆయన ప్రవర్తనయందుగాని, బాధ్యతా నిర్వహణ మందుగాని తప్పు పట్టుటకు వారికి తావులేక పోయెను. “అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరే విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనిరి.” (దానియేలు 6:5)CChTel 140.2

    ఇక్కడ క్రైస్తవులకు గల గుణపాఠమెంత మహత్తరమైనది! దినదినము ఈర్షానేత్రములు దానియేలుపై దృష్టి సారించినవి. ద్వేషము వాని ద్రుక్కులకు పదునుపట్టెను. అయినను ఆయన జీవితమందొక మాట గాని క్రియగాని దోషభరితమనీ వారు వ్రేలెత్తి చూపజాలకుండిరి. అయినప్పటికిని తాను పరిశుద్ధుడనని అతడు చెప్పలేదు. ఉత్తమమైన దానినతడు చేసెను. నమ్మకముతోను, త్యాగముతోను కూడిన జీవితమనతడు జీవించెను. CChTel 140.3

    రాజు యొద్ద నుండి ఉత్తర్వు బయలుదేరెను. తనను చంపుట తన శత్రువుల ఉద్ధేశ్యమని దానియేలు ముందే గుర్తించెను. అయితే యే చిన్న విషయమందైనను తన వైఖరి నతడు మార్చుకొనలేదు. తన యథావిధులను ప్రశాంతముగా నిర్వహించెను. ప్రార్థనకు సమయము కాగానే తన గదికి వెళ్లి యెరూషలేమువైపునున్న కిటికీ తలుపులుతెరచి పరలోకమందున్న దేవునికి తర మానవులను తెలియపరచుకొనెను. ఏ ప్రాపంచిక అధినాయకుడును తనకును తన దేవునికిని మధ్య అడ్డుబండగా నిలిచి యెవరికి చేయరాదో చెప్పజాలడను విషయమును ఆయన బ్రతుకు నిర్భయముగా వెల్లడి చేసెను. ఈయన ఎంత ఉన్నత నియమబద్ధుడు! క్రైస్తవ సాహసమునకును, విశ్వాసమునకును ప్రపంచము నెదుట స్తుతింపదగు మాదిరిగా ఆయన నిలిచెను. తన భక్తికి దండనగా మరణము సంభవమని యెరిగియు హృదయపూర్తిగా నతడు దేవుని తట్టు తిరిగెను. CChTel 140.4

    “అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సంహహుల గుహలో పడద్రోసిరి, పడద్రోయగా రాజు`నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను”. (16 వచనము)CChTel 141.1

    తెల్లవారుజామున రాజు లేచి సింహముల గుహ యొద్దకు హుటాహుటిగా వెళ్లి “జీవముగల దేవుని సేవకుడైన దానియేలూ నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింప గలిగెనా?” యని అడిగెను. CChTel 141.2

    “నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండ వాటి నోళ్ళు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా” అని యీ ప్రవక్త ఉత్తరమిచ్చెను. CChTel 141.3

    “రాజా ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు.” (22, 23 వచనములు) దైవ సేవకుడీరీతిగా రక్షింపబడెను. తననాశనము కొరకు తన శత్రువులు పన్నిన పన్నుగడ వారినే నాశనమొనర్చెను. రాజు నాజ్ఞ వలన వారు సింహముల గుహలోనికి నెట్టబడిరి. మా మృగములు వారిని వెంటనే కబళించెను. CChTel 141.4

    డెబ్బది సంవత్సరముల దాస్యకాలపరిసమాప్తికి సమయమాసన్నమగు కొలది ఇర్మియా ప్రవచన పఠనముపై దానియేలు అధికాసక్తి చూపెను. CChTel 141.5

    దేవుని యెదుట తన యాధార్థ్యమును దానియేలు ప్రశంసించుకొనలేదు. పరిశుద్దుడనని చెప్పుకొనుటకు బదులు గౌరవనీయుడగు ఈ ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఘోర పాపు లలో నొకనిగా తన్ను తాను ఎంచుకొనెను. కాంతి విహీనమైన నక్షత్రముకన్న మధ్యాహ్నిక సూర్యతేజము ఎంతో అధికమైన రీతిగా, లోకములో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల జ్ఞానమున్న దేవుడు దానియేలు కనుగ్రహించిన జ్ఞానము అత్యధికముగా నుండెను. అయినను దైవానుగ్రహము పొందిన ఈ మనుష్యుని పెదవులనుండి పెదవులనుండి వచ్చెడి ప్రార్థనను గూర్చి యోచించుడి. దీన మనస్సుతోను, కన్నీటితోను, బ్రద్దలగుచున్న హృదయముతోను తన నిమిత్తము, తన ప్రజలనిమిత్తము ఆయన దేవునితో విజ్ఞాపన చేయుచున్నాడు. తన యాత్మను దేవుని ముందు విప్పిపెట్టి తన అయోగ్యతను ఒప్పుకొనుచు ప్రభుని ఘనతను, ప్రభావమును అంగీకరించుచున్నాడు. CChTel 141.6

    దానియేలు ప్రార్థన పైకి వెళ్లగానే తన మనవి ఆలింపబడి కామితఫలమీయబడినదని తెల్పుటకు గబ్రియేలు దూత హుటాహుటిఆ దిగివచ్చెను. దానియేలుకు భావియుగములను గూర్చిన మర్మములను గ్రహించు నిమిత్తము నేర్పును, గ్రహింపుశక్తిని అనుగ్రహింపవలెనని యీ మహాదూత ఆదేశింపబడెను. సత్యము తెలిసికొని గ్రహించుటకు ప్రయత్నించగా ఇట్లు దానియేలుకు పంపిన రాయబారితో సంబంధము కలిగెను. CChTel 142.1

    దానియేలు తాను చేసిన మనవికి ప్రత్యుత్తరముగా తనకును తన ప్రజలకును అత్యవసరమైన వెలుగు, సత్యములను పొందుటయేగాక భవిష్యత్సంఘటనలను తుదకు లోక రక్షకుని ద్వితీయాగమనము వరకును చూడగలిగెను. మేము పరిశుద్ధపర్చబడిన వారమని చెప్పుకొనుచు లేఖనములను పరిశోధించుటకు లేక బైబిలు సత్యములను స్పష్టముగా గ్రహించుటకు, ప్రార్థనయందు దేవునిలో పోరాడుటకు, ఇచ్‌చయింపకున్నవారు యథార్థ పవిత్రీకరణయననేమో యెరుగరు. CChTel 142.2

    దానియేలు దేవునితో మాటలాడెను. పరలోకము అతని యెదుట విప్పబడెను. అతని పరము చేయబడిన గొప్ప సన్మానములు తన నమ్రతకును ఆసక్తితో కూడిన అన్వేషణమునకును, ప్రతిఫలములు. దేవుని వాక్యమును హృదయ పూర్వకముగా నమ్మువారందరు ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానము కొరకు ఆకలిదప్పులు గొందురు. సత్యమునకు కర్త దేవుడే. చీకటిమయమైన గ్రహింపును వెలుగుతోనింపి తాను బయలుపరచిన సత్యములను ఆకళించుకొనుటకు ఆయన మానవ మనస్సులకు అవగాహనశక్తినిచ్చును. CChTel 142.3

    లోకరక్షకుడు బయలుపరచిన సత్యములు సత్యాన్వేషణ సల్పువారికి దాచబడిన ధనమైయున్నవి. దానియేలు వృద్ధుడయ్యెను. ఒక అన్యరాజు భవనపు ఆకర్షణమధ్య తన జీవితము గడచెను. రాజకీయ విషయములతో నాతని భారముగా నుండెను. అయినను దేవుని ముందు తన ఆత్మను నలుగగొట్టుకొని మహోన్నతుని ఏర్పాటులను గూర్చిన జ్ఞానము వెదకుటకు ఈ కార్యములన్నింటిని దూరముగా పెట్టెను. అతని విజ్ఞాపనలకు ప్రత్యుత్తరముగా పరలోకమునుండి అంత్యకాలమందు నివసించు వారి కొరకు వెలుగు పంపబడెను. పరలోకమునుండి మనకు వచ్చిన సత్యమును గ్రహింపశక్తి ననుగ్రహించుమని యెంత ఆసక్తితో మనము దేవునికి ప్రార్థించవలెను!CChTel 142.4

    మహోన్నతునకి దానియేలు నమ్మకమైన సేవకుడు. తన దీర్ఘజీవితమునందు ప్రభువుకు ఉదాత్తకార్యములతో కూడిన సేవ చేసెను. తన పవిత్ర శీలము, అసందిగ్ద విశ్వాసము ` వీరికి తన హృదయ సాత్వీకము, దేవుని యెదుట తన పశ్చాత్తాపములేపాటి. యథార్థ పరిశుద్ధీకరణకు దానియేలు జీవితము ఒక ఆవేశపూరితమైన సాదృశ్యమని పునరుద్ఘాటించనగును. 9SL 42-52; CChTel 143.1