Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సువార్త సేవకు నారిది

    మనము పంపబడిన యే దేశమందైనను నైతిక ప్రమాణమును పెంచవలెనని మనము కోరినచో ఆదేశ ప్రజలు శరీరకమైన అభ్యాసములను సరిదిద్దుటతో మనము దీనిని ప్రారంభించవలెను. 4CH 505;CChTel 460.1

    వైద్య సేవ మానవాళికి బాధను తొలగించు సువార్త నందించును. ఇది సువార్త సేవకు నాంది. ఇది క్రియా రూపముదాల్చిన సువార్త, ప్రత్యక్షపర్చబడిన క్రీస్తు ప్రేమ. ఈ పనియొక్క అవసరత చాల కలదు. ఈ సేవ చేయుటకు విశాల ప్రపంచమున్నది. వైద్య సువార్త సేవా ప్రాముఖ్యతను గుర్తించి నూతన స్థలములలో తక్షణమే యీ సేవను ప్రారంభించుటకు దేవుడు సాయము చేయును గాక. అప్పుడు సువార్త సేవ ప్రభువు కోరిన ప్రకారము జరుగును. రోగులు బాగుపడెదరు. బాధలకు గురి jైున మానవాళికి మేలు కలుగును. 5MM 239;CChTel 460.2

    మీకు విద్వేషము, అనగా కృత్రిమ ఆసక్తి, కృత్రిమ భక్తి ఎదురగును. కాని స్వదేశమందును విదేశమందును సత్యబీజముల కొరకు దేవుడు సిద్దము చేయుచున్న హృదయములు మీ యూహకు మించి యుండును. దైవవర్తమానము వారికందించబడినపుడు దానిని సంతోషముతో నంగీకరించెదరు. 6CH 502;CChTel 460.3

    శరీరమునకు హస్తమునకును ఎట్టి సంబంధమున్నదో అట్టి సంబంధమే వైద్యసేవకును సువార్త సేవకును ఉన్నదని నాకు చూపబడెను. సత్యమును ప్రకటించి రోగులకును ఆరోగ్యవంతులకును సువార్త నందించు నిమత్తము సువార్త సేవ వ్యవస్థీకరించబడినది. ఇది శరీరము. వైద్యసేవ హస్తము. క్రీస్తు అన్నింటికిని శిరస్సు. ఇట్లు ఈ విషయము నాకు చూబడెను. CChTel 460.4

    మీ ముందున్న సదుపాయములనుపయోగించుకొనుచు వైద్యసేవను ప్రారంభించుడి ఇట్లు మీరు వేదపాఠమునిచ్చుటకు మార్గమును కనుగొందురు. రోగులకెట్లు చికిత్స చేయవలెనో తెలిసికొనవలసిన వారితో మీకు ప్రభువు సంబంధము కుదురును. రోగ నివారణను గూర్చి మీకున్న జ్ఞానమును ప్రయోగించుడి. బాధపడుచున్న వారి బాధ ఉపశమించును. ఆకలిగొనియున్న ఆత్మలకు మీరు జీవాహారము నిచ్చుట కవకాశము కలగును. 7MM 237, 239;CChTel 460.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents