Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 49 - మనము భుజించు ఆహారము

    మన శరీరములు మనము భుజించు ఆహారముద్వారా నిర్మించబడును. శరీరమందలి స్నాయువులు నిత్యము శిథిలమగును. ప్రతి అవయవము కదలినప్పుడు కొంత పదార్థము వ్యర్థమగును. ఈ కొరతను ఆహారము తీర్చును. శరీరమందలి ప్రతి అవయమునకు తన వంతు పోషక పదార్థము అవసరము. మెరదడుకు దాని వంతు సరఫరా కావలెను. ఎముకలకు, కండరములకు, నరములకు వాని వాని వంతు అవసరము. ఆహారమును రక్తముగా మార్చి యీ రక్తమును శరీర వివిధావయవముల పోషణ కొరకు ఉపయోగించు ప్రక్రియ అద్భుతకరమైనవి. ఈ ప్రక్రియ నిత్యము సాగుచునే యున్నది. ఇది ప్రతి నరమునకు, కండరమునకు, స్నామువునకు జీవమును బలమును సరఫరా చేయుచున్నది. CChTel 409.1

    శరీరమునకు బలమునిచ్చుటకు అవసరమగు ఆహార పదార్థములచే మనము ఎన్నుకొనవలెను. వీనిని ఎన్నుకొనుటలో రుచి క్షేమరకమైన మార్గదర్శికాదు. భోజన విషయక దురభ్యాసముల వలన రుచిచెడిపోయినది. తరుచు ఆరోగ్యమున చెరచి బలమునకు బదులు దుర్బలమును కలిగించు ఆహార పదార్థముల నది కోరును. సాంఘికాచారముల వలన మనము నడిపించుబడుట క్షేమము కాదు. అన్నిచోట్ల వ్యాధి బాధలు చాలమట్టుకు భోజన విషయక దోషముల వలన కలిగినవే. CChTel 409.2

    అన్ని పరిస్థితులలోను ఆరోగ్యదాయమైన ఆహార పదార్థములన్నియు మన అవసరమునకు సరిపడకపోవచ్చును. ఆహారమును ఎన్నుకొనుటలో జాగ్రత్తగా నుండవలెను. మనము నిరసించు కాలమునకు శోతోష్టస్థితికి, మనమవలంబించు వృత్తికి మన ఆహారము సరిపోవలెను. ఒక కాలములో లేక శీతోష్టస్థితిలో సరిపడు భోజనము మరియొక్క కాలములో పనికిరాదు. కనుక వివిధ వృత్తుల నవలంభించు వ్యక్తుల సరిపడు వివిధాహార పదార్థములు కలవు. తరచుగా కాయకష్టము చేయువారికి తగిన భోజనము మెదడుతో పనిచేయువారికి లేక ఎల్లప్పుడు కూర్చుండి పనిచేయువారికి పనికిరాదు. మనకు దేవుడు పుష్కలముగా వివిధారోగ్యకరమైన ఆహారములను అనుగ్రహించెను. ప్రతి వ్యక్తి తన అనుభూతిని వివేచనను వినియోగించి తనకు బాగుగా సరిపడు ఆహారమునే ఎన్నుకొనవలెను. 1MH 295-297;CChTel 409.3