Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఐకమత్యమందు బలము కలదు.

    ఐకమత్యము కొరకు పట్టుదలతో ప్రయత్నించుడి. దాని కొరకు ప్రార్థించుడి; కృషి చేయుడి. అది ఆధ్యాత్మికారోగ్యమును ఔన్నత్య తలపులను, సౌశీల్యమును, పరసంబంధమైన మనస్సును కలుగజేసి, స్వార్థప్రీతిని, అపోహలను జయించుటకు శక్తినిచ్చి, మిమ్మును ప్రేమించి మీ కొరకు మరణించిన ప్రభువుద్వారా అత్యధిక విజయులుగా మిమ్మును చేయును. స్వార్థమును సిలువ నేయుడి. ఇతరులు మీకన్న ఉత్తములని భావించుడి. ఈ విధముగా మీరు క్రీస్తుతో ఐక్యపర్చబడగలరు. సర్వ విశ్వము యెదుటను, సంఘము యెదుటను, ప్రపంచము యెదుటను దైవ కుమారులు కుమార్తెలునై యున్నారని మీరు రూఢీపర్చుకొనెదరు. మీరు చూపు మాదిరి వలన దేవుడు మహిమ ఏర్పడును. CChTel 191.3

    దైవ ప్రజల హృదయములను క్రైస్తవ ప్రేమతో బంధించుటయను అద్భుతమును ప్రపంచము చూడవలెను. దైవ ప్రజలు క్రీస్తునందు దేవాలయములలో సమావేశమగుట ప్రపంచం చూడవలసియున్నది. ఆయనను ప్రేమించి ఆయన సేవజేయు వారితో దైవ సత్యము ఎట్టి మార్పు కలిగించగలదో మీ బ్రతుకుల ద్వారా నిదర్శనమీయరా? మీకేమి కాగలదో దేవునికి తెలియును. మీరు దైవ స్వభావమందు పాలివారైనచో మీ కొరకు దైవ కృప ఎట్టి కార్యసాధన చేయగలదో ఆయనకు ఆకళింపే. 59T1S8;CChTel 192.1

    “సహోదరులారా, మీరందరు ఏక స్వభావముతో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోను యేక తాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.” (1 కొరింథి. 1:10)CChTel 192.2

    ఐక్యత బలము, అనైక్యత దుర్భలము, ప్రస్తుత కాల సత్యమును నమ్ము విశ్వాసుల ఐక్యత కలిగి యున్నపుడు, వారి పలుకుబడి బలవత్తరముగా నుండును. ఇది సాతానుకు సుస్పష్టముగా తెలియును. దైవ ప్రజలలో వైషమ్యమును భిన్నాభిప్రాయములను కలిగించుట ద్వారా దైవ సత్యము యొక్క ప్రభావమును పోగొట్టుటకు సైతానుడిప్పుడు ఎక్కువ పట్టుదలగా కృషి చేయుచున్నాడు. 65T 236CChTel 192.3