Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పాఠశాలను బలపరచుటలో విద్యార్థి బాధ్యత

    దేవుని ప్రేమించి సత్యముననుసరించుచున్నామని చెప్పుకొను విద్యార్థులు శోధనలు వచ్చినను అచంచలముగా నుండి తమ కళాశాలలోను వసతి గృహములతోను లేక వారుండు ఏ స్థలమందైనను క్రీస్తు కొరకు నిలువబడుటకు సాయపడు ఆత్మ నిగ్రహమును మత సిద్ధాంత దార్థ్యమును కలిగి యుండవలెను. మతము కేవలం దైవమందిరమందు ధరించుకొను ఒక వస్త్రముగా నుండరాదు. కాని జీవితమంతటియందును మత నియమములు కనిపించవలెను. CChTel 396.1

    జీవజాలపు ఊటలను గ్రోలువారు లోక ప్రజాళివలె మార్పు, వినోదముల కొరకు తహతహలాడరు. దినదినము తమ చిక్కులను భారమును యేసు పదాబ్జిముపై నిడుట వలన కలుగు విశ్రాంతి, సమాధానము ఆనందము వారి ప్రవర్తనయందును శీలము నందును గోచరించును. విధేయత, బాధ్యత మార్గమందు సంతృప్తి ఆనందములుకూడ కలవని వారు చూపెదరు. పాఠశాలనంతటిని మార్చగల పలుకుబడిని ఇట్టివారు తమ తోడి విద్యార్థులపై నిలిపెదరు. CChTel 396.2

    పాఠశాల నిబంధనలను అలక్ష్యము చేయుట, మీరుట, అపనమ్మకముగా నుండుట మున్నగువారిని అరికట్టుటకు ఆపాధ్యాయులు చేయు కృషిని ఈ సమూహమునకు చెందువారు బలపరచెదరు. వారి పలుకుబడి రక్షణకరమైనది. దేవుని గడియయందు వారు చేసిన కార్యములు వ్యర్థములు కాబోవు అని వారితో పాటు భావి ప్రపంచంలో ప్రవేంచును. వారిక్కడ జీవించిన జీవితపు పలుకుబడి నిత్యము నిలుచును. CChTel 396.3

    యధార్థత, మనస్సాక్షి, నమ్మకముకు ఒక యువకుడు పాఠశాలయందున్నచో నతడు అమూల్యమైన సంపద యనవచ్చును. అతనిని దేవదూతలు ప్రేమతో పరిశీలింతురు. ప్రియ రక్షకుడు కూడా అతని ప్రేమించును. పరలోక గ్రంథమందు ప్రతి నీతి కార్యము, ప్రతిఘటించబడిన ప్రతి శోధన, జయింపబడిన ప్రతి పాపము లిఖించబడును. నిత్య జీవమును సంపాదించుటకుగాను ఇట్లు అతడు మంచి పునాది వేయును. CChTel 397.1

    తన సేవను వృద్ధి చేయుటకు దేవుడు ఎన్నుకొనిన సంస్థలను భద్రపరచి చిరస్థాయి చేయు బాధ్యత ఎక్కువ భాగము క్రైస్తవ యువకులపై పెట్టబడినది. కార్యరంగమున ప్రవేశించుచున్ననేటి యువకులపై ఈ గురుతర బాధ్యత పెట్టబడినది. మానవ సంతతిపై ఇంత ప్రాముఖ్యమైన ఫలితములు ఆధారపడియున్న కాలము మరియొకటిలేదు. దేవుడు వారిని తన సాధనములుగా ఉపయోగించుకొనుటకు గాను యువజనులు ఈ మహత్తర కర్తవ్య సాధనకు అర్హులగుటకు శిక్షణ పొందుట ఎంత ప్రామ్యుము! ఏ యితర హక్కులకన్న తమ్మును సృజించిన దేవునికి వారిపై గల హక్కులు సమధికములు. CChTel 397.2

    వారికి జీవమును, ప్రతివిధమైన శారీరక మానసిక వరమును ఇచ్చినవాడు దేవుడే. నిత్యకాలమువలె శాశ్వతమైన పనిని చేయుటకు వారు సమర్తులగుటకుగాను వృద్ధి చేసికొను నిమిత్తము వారికాయన కొన్ని సమర్థతల నిచ్చెను. తానిచ్చిన వరములకు బదులుగా తను మానసిక నైతిక శక్తులను వృద్దిచేసి ఉపయోగించవలెనని వారికాయన కోరుచున్నాడు. వారి వినోదము కొరకు లేక ఆయన చిత్తమునకు ఏర్పాటుకు విరుద్ధముగా దుర్వినియోగము చేయుటకు శక్తులను వారికాయన ఇయ్యలేదు. కాని ప్రపంచమందు సత్యము, పరిశుద్ధతలయొక్క జ్ఞానమును వృద్ధి చేయవలెనని వానిని వానికిచ్చెను. తాను నిత్యము చూపిన దయ, అపారమైన కృప నిమిత్తము తిరిగి వారి కృతజ్ఞతను, భక్తిని, ప్రేమను ఆయన కోరుచు సాతాను పన్నుగడలకు లొంగకుండ తమ్మును అదుపుచేసి శాంతికరమైన మార్గములలో తమ్మును నడిపించు తన చట్టమును నిబంధనలను యువజనులు గైకొనవలెనని ఆయన కోరుట సమంజసమే. CChTel 397.3

    మన సంస్థల చట్టములను నిబంధనలను గైకొనుట వలన సంఘములో తమ ప్రతిష్ట అధికమగునని గ్రహించగలిగినచో వారు న్యామైన కట్టడల నిమిత్తము ఎదురు తిరుగరు. ఈ సంస్థల యెడల అనుమానము విద్వేషము జనింపజేయురు. తమ విధులను నెరవేర్చుటకు మన యువజనులు శక్తీ,విశ్వాసములు కలిగియుండనవలెను. ఇది వారి జయమునకు హామీయగును. నేటి ప్రపంచమందున్న అనేక యువజనులను అనాగరక ,నిర్లక్ష్య వర్తనము భాధకరము. తల్లి దండ్రులే యీ నిందకు అర్హులు. దైవభీతిలేని వారికి నిజమైన ఆనందము చీకూరదు. 434T 432—435. CChTel 397.4