Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుతురా?

    అవిశ్వాసి మతము పట్ల మక్కువ కలిగి యున్నాడనియు, క్రైస్తవుడు కాడను ఆ విషయము తప్ప సాటిjైున సహాయకుని యందుండవలసిన కడమ గుణములన్నియు కలవనియు కొన్నిసార్లు చెప్పుట కద్దు. అవిశ్వాసితో వివాహమాడకూడదని సద్వివేచన విశ్వాసికి చెప్పినను పదింట తొమ్మిది పాళ్ళు ఇష్టమే జయము పొందును. వేదిక యొద్ద ప్రమాణము చేసిన ఘడియ నుండియే ఆధ్యాత్మిక క్షీణదశ ప్రారంభమగును. మతాశక్తి సన్నగిల్లును. ఒకదాని తర్వాత ఒకటిగా కట్టడలు శిథిలమై తుదకు సతీపతులిద్దరును సాతాను నల్లజెండా క్రింద నిలిచెదరు. వివాహ మహోత్సవములందు కూడా మనస్సాక్షి, విశ్వాసము, సత్యములపై లౌకిక స్వభావమే జయము సాధించుచున్నది. నూతన గృహమందు ఉదయ సాయంకాలముల ప్రార్థనలుండవు. వధూవరులిలు వురును ఒకరినొకరు ఎన్నుకొని యేసుని విసర్జించిన వారగుచున్నారు. CChTel 265.1

    వివాహమైన మొదటిలో అవిశ్వాసికి ప్రతిఘటించినట్లు కనిపించక పోవచ్చును. కాని బైబిలు సత్యమును అంశము ప్రసక్తికి పరిగణనకు రాగానే ఉద్రేకము రెచ్చిపోవును. నా స్థితి నెరిగియే నీవు నన్నుపెండ్లి ఆడితివి. నన్ను ఈ విషయములలో బలవంతము చేయవద్దు. ఇక నుండి నీ వింత దృక్పధములపై సంభాషణ పనికిరాదు. అను నంత వరకు వచ్చు. విశ్వాసి తన విశ్వాస సందర్భముగా ప్రత్యేక శ్రద్ధ చూపినపుడు క్రైస్తవానుభూతి యందు ససేమిరా ఇష్టము లేని వ్యక్తి పట్ల నిర్థయగా నున్నట్లు కాన్పించును. CChTel 265.2

    క్రొత్తగా ఏర్పడిన సంబంధమును బట్టి తన భార్యతో కొంత వరకు ఏకీభవించుట మంచిదని విశ్వాసి తలంచును. లోక సంబంధమయిన వినోదనముల యందు సత్యాసక్తి నానాటికి క్షీణించును. విశ్వాసమును ప్రతిగా సంశయము, అవిశ్వాసములు హృదయము నావహించును. ఒకప్పుడు బలముగాను, మనస్సాక్షితోను క్రీస్తును వెంబడిరచిన యీ విశ్వాసి సందేహించి యిటునటుగా నుండు వ్యక్తిగా మారునని యెవరును అనుకొనరు. అవివేకమైన ఆ వివాహము వలన కలిగిన మార్పేగదాయిది!CChTel 265.3

    లోక సంబంధము కుదుర్చుకొనుట చాలా అపాయకరము, అనేక యువతీ యువకుల వివాహసంబంధము తమ క్రైస్తవానుభవమును ప్రయోజకత్వమును నాశనము చేయునని సాతానుకు విస్పష్టముగా తెలియును. వారు క్రీస్తు నుండి వేరగుచున్నారు. క్రైస్తవ జీవితము జీవించుటకు వారు కొంతకాలము ప్రయత్నించవచ్చును. కాని తమశక్తిని మించి వారిని ప్రతికూల మార్గమున ఈడ్చుకొనుపోవు ప్రభావమును ప్రతిఘటింప జాలరు. తమ ఆనందమును నిరీక్షణను గూర్చి ప్రస్తావించుట ఒకప్పుడు వారికి ఆనందమును, ఆదిక్యత అయి యుండెను, అయితే తమ సహధర్మ చారిణికి ఆసక్తి లేని కారణముగా ఆ విషయమును, ఆధిక్యత తమ ఆనందమును నిరీక్షణను గూర్చి ప్రస్తావించుట ఒకప్పుడు వారికి ఆనందమును, ఆధిక్యత అయి యుండెను. అయితే తమ సహధర్మ చారిణికి ఆసక్తి లేని కారణముగా ఆ విషయమును గూర్చి ప్రస్తావించుటకు వారు ఇష్టపడరు. దీని ఫలితముగా ప్రశస్త సత్యమునందలి విశ్వాసము అంతరించును. వారి చుట్టును సాతానుడు అవిశాస్వమును గూడును కపటముగా కట్టును. ‘సమ్మతించకుండ ఇద్దరు కూడి నడుతురా’ మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను ఏ సంగతిని గూర్చిjైునను భూమి మీద ఏకీభవించిన పక్షమున అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎంతో సన్నిహితముగా నున్న వీరిద్దరిలో నొకవ్యక్తి భక్తి తాత్పర్యములు కలిగి యుండగా మరియొక వ్యక్తి అలక్ష్యముగాను, ప్రమత్తతతోను ఉండుటయు, ఒక వ్యక్తి నిత్యజీవమార్గమున అన్వేషించు చుండగా, కడమ వ్యక్తి మరణమునకు నడుపు విశాల మార్గమందుండుటయు ఎంత వింత దృశ్యము. !CChTel 266.1

    నూతన జన్మ పొందని వారిని పెండ్లి చేసికొనుట వలన వందలాది జనులు క్రీస్తును, పరలోకమును పోగొట్టుకొని యున్నారు. వారు మానవ మాతృల స్నేహము నపేక్షించుటకు కారణము క్రీస్తు ప్రేమ సహనములు కొరగాని వనియా? పరలోకము లెక్కలేనదగుటచే అందలి యానందములను ప్రశస్తరక్షకుని ప్రేమించని వ్యక్తిని సంపాదించుటకు వారు తృణీకరించుచున్నారు? CChTel 266.2