Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సద్గుణసాధనలో మాతృ శక్తి

    తల్లియొక్క కార్య రంగము చిన్నదై ఉండవచ్చును. కాని భర్త యొక్క పలుకుబడితో నేకమైన ఆమె పలుకుబడి శాశ్వతముగును. సద్గుణసాధనలో దేవుని తరువాత తల్లియొక్క శక్తి ప్రపంచములో బలవత్తరమైనది. CChTel 297.1

    క్రైస్తవ మాత తన పిల్లలను ఆవరించిన అపాయములను గ్రహించుటకు నిత్యము మెలకువగా నుండును. ఆమె తన ఆత్మను పవిత్ర వాతావరణములో నుంచుకొనును. తన నియమములను చిత్తవృత్తిని ఆమె దైవ వాక్యమునకు అనుగుణముగా నుంచుకొని నిత్యము తన్ను బాధించు చిన్న చిన్న శోధనలను జయించుచు తన కర్తవ్యమును నమ్మకముగా నిర్వర్తించును. CChTel 297.2

    పిల్లల అవగాహన శక్తి వాడియైనది. ప్రేమతోను సహనముతోను కూడిన స్వరములకును, తమ హృదయములలోని ప్రేమను చల్లార్చగల రౌద్రముతో కూడిన ఆజ్ఞాప్తులకునుగల వ్యత్యాసమును వారు గుర్తించగలరు. యధార్థ క్రైస్తవ మాత తన కోపము వలన ఆ ప్రేమాదారములు లేమి వలన తన బిడ్డలను తన యొద్ద నుండి తరిమివేయదు. CChTel 297.3

    తల్లులారా, మీ పలుకుబడి, మీ మాదిరి మీ బిడ్డల గుణశీలములను, గతిని తీర్చి దిద్దునను సత్యమును గుర్తించుడి. మీకున్న బాధ్యత దృష్ట్యా సత్యమైన మేలైన, హృదయ రంజకములైన గుణములను ప్రతిఫలింపజేయు మంచిమనసును నిర్థుష్ట శీలమును వృద్ధి పరుచుకొనుడి. CChTel 297.4

    గృహమందు ఆకర్షణ కనుగొనలేని భర్తలు, పిల్లలు నిత్యము తిట్టులు, సాధింపులకు గురియగుట వలన ఆదరణ, ఆనందముల కొరకు బయటకు పోయెదరు. వారి పాన గృహములకు, నిషిద్ధ వినోద మందిరములకు పోయెదరు. CChTel 297.5

    కుటుంబ కార్యకలాపములందు మునిగి గృహిణి వారి ముందు తన కష్ట సుఖములను గూర్చి ప్రస్తావించక పోయినను తరచు గృహమును భర్తకును, పిల్లలకును ఆనందకరముగా చేయగల స్వల్ప మర్యాదల విషయము మరచిపోవచ్చును. భోజనము సిద్ధము చేయుట యందు ఆమె నిమగ్నురాలై యుండగా తన భర్త, కుమారులు పరాయివారివలె లోనికి వచ్చి వెళ్ళిపోయెదరు. CChTel 297.6

    ఇంటి దగ్గర తల్లులు మాసిన దుస్తులు ధరించినచో వారు తమ బిడ్డలకు కూడా నట్టి యలవాటులనే నేర్పించుచున్నారు. మాసి అసహ్యముగా కనబడు వస్త్రమైనను అది ఇంటి దగ్గర ధరించవచ్చునని చాలామంది తల్లులు తలంచెదరు. కాని కుటుంబమందు వారు తమ పరపతి పోగొట్టుకొనెదరు. శుభ్రమైన దుస్తులు ధరించు వారికిని తమ తల్లికిని మధ్యగల వ్యత్యాసములను పిల్లలు నిత్యము చూచెదరు. ఆమె పట్ల వారి కున్న గౌరవము సన్నగిల్లును. క్రమబద్దమైన గృహమందు నిర్వహించబడవలసిన కార్యములను తాను చేయుట నీచమని తలంచక నిజాయితీ గల భార్య తన బాధ్యతలను సంతసముతోను మరియాదగాను నిర్వర్తించును. 2AH 231—254;CChTel 298.1