Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆత్మలోని దైవ. జీవితము మానవుని ఒకేయ నిరీక్షణ

    శరీరముయొక్కగాని మనస్సుయొక్కగాని ఆరోగ్యమునకు బైబిలు మతము హానికరము కాదు. రోగమునకు దైవాత్మ ప్రభావము ఉత్తమౌషథము. పరలోకము ఆరోగ్యముతో తులదూగుచుండును. పరలోక ప్రభావము ప్రగా ` ముగా పొందు కొలది విశ్వసించు వ్యాదిగ్రస్తుడు బాగుపడుట నిశ్చయమగును. క్రైస్తవ మతముయొక్క వాస్తవిక సూత్రములు ఎల్లరకు అమితానందమును ప్రసాదించును. మతము ఇక అవిచ్చిన్నమయిన జలధార. ఈ జలధార నుండి క్రైస్తవుడు యచ్చేగా జలమును గ్రోలవచ్చును. ఆ జలమెన్నటికిని తరుగదు. CChTel 402.1

    మానసిక స్థితి ఆరోగ్యమును మార్చును. మంచి కార్యము చేసితినను మనస్సాక్షి ఇతరులకు అనందము కలిగించుట ద్వారా కలుగు సంతృప్తి వలన మనస్సు స్వేచ్ఛగాను ఆనందముగాను ఉన్నచో సంతసమును కలుగ జేయును. ఆ సంతోషము యావచ్ఛరీరముపై పని చేసి రక్త ప్రసారమునకు దోహదము చేసి సర్వశరీరమునకు బలము నిచ్చును. దైవా శీర్వాదము స్వస్థ తనిచ్చు శక్తియై యున్నది. ఇతరులకు మేలు చేయు వారికి ఆ యద్చు తకరమైన ఆశీర్వాదము హృదయమందును జీవితమందును లభ్యమగును. CChTel 402.2

    చెడ్డ అలవాటును పాపపు అభ్యాసములకు లోనైన వ్యక్తులు సత్యమునంగీకరించినచో హృదయమందు ప్రవేశించిన ఆ సత్యము మొద్దు బారినట్లగపడు నైతిక శక్తులను పునరుజ్జీనింప జేయును. సత్యముయొక్క శక్తి సంగీకరించిన వ్యక్తి నిత్యుడగు క్రీస్తుతో సంబంధపడిన పిదప పూర్వము కంటె ఎక్కువ బలమైన స్పష్టమయిన జ్ఞానమును పొందును. క్రీస్తునందు తాను సురక్షితముగా నున్నానని గుర్తించుటద్వారా అతని భౌతికారోగ్యముకూడ వృద్ది చెందును. 6CH 28;CChTel 402.3

    క్రీస్తు కృపను పొందునపుడే విధేయత వలని దీవెనెలు సంపూర్ణముగా తమకు లభించునని మనుజులు గ్రహించవలెను. దైవధర్మశాస్త్రములను గైకొనుటకు మానవునికి ఆయన కృపయే శక్తినిచ్చును. దురభ్యాసదాస్యమును పటాపంచలు చేయులకు ఇదియే అతనికి శక్తి నిచ్చును. అతనిని సన్మార్గమున ఉంచి అతనికి బలము నొసంగు శక్తి యిదే. CChTel 403.1

    పరిశుద్దత శక్తిగల సువార్తను యథాతథముగ అంగీకరించినచో పాపముతో ప్రారంభమైన వ్యాదులకది దివ్యొషదము కాగలదు. “నీతి సూర్యుడు తన రెక్కల యందు స్వస్థతతో” ఉదయించును. ఈ ప్రపంచమిచ్చునదేదియు విరిగిన హృదయమును స్వస్థపరచి దానికి మనశ్శాంతి ప్రసాదించి వ్యాదిని అరికట్టలేదు. కీర్తి, ప్రతిభ, సామర్థ్యము ఇవన్నియు వ్యాకులి. హృదయమునకు ఆనంధము నీయజాలవు లేక వ్యర్థపుచ్చబడిన జీవితమును తిరిగి సంపాదించలేవు. ఆత్మ యెందు దైవ నివాజమే మానవుని యేకైక నిరీక్షణ. CChTel 403.2

    సర్వశరీరము లోనికి క్రీస్తు విస్తరింపజేయు ప్రేమయే బలవర్థక శక్తియై యున్నది. ముఖ్యమైన ప్రతి అవయవమునకు అనగా మస్తిష్కమునకు, హృదయమునకు, నరములకు నది స్వస్థత కలిగించును. దానిద్వారా శరీరమహత్తర శక్తులు చైతన్యవంతములగును. జీవ శక్తులను అణగద్రిక్కు దోషము, విచారము, ఆతురత చింతలనుండి యది ఆత్మను విడిపించేయలేని పరిశుద్దాత్మయందలి ఆనందమును, ఆరోగ్యమును. జీవమును ఇచ్చు ఆనందమును అది మనస్సులో నెలకొల్పును. CChTel 403.3

    “నా యొద్దకు రండి. .. మీకు విశ్రాంతి కలుగ జేసెదను” అను మన రక్షకుని మాటలు శారీరక, మానసిక ఆధ్యాత్మిక రుగ్మతలనను బాగుచేయుటకు ఔషదము. మానవులు తమ స్వకీయ దుష్కృతముల వలన వ్యాదిబాధలను తెచ్చుకొన్నప్పటికిని దేవుడు వారిని దయతో చూచుచున్నాడు. వారి కాయన సాయము చేయును. ఆయనయందు విశ్వసించువారికి ఆయన మహత్కార్యము చేయును. 7MH 115;CChTel 403.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents