Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 16 - లేమిడి యందును, బాధయందును ఉన్న వారి పట్ల క్రైస్తవుని వైఖరి

    మానువులు తమ పొరుగు వారిని ప్రేమించు చున్నారో లేదో చూపించుటకు దేవుడే ఈనాడు వారి కొక తరుణమిచ్చు చున్నాడు. దేవునిని, తన సహచరులను ప్రేమించువాడు నిజముగా దిక్కులేనివారికి, బాధితులకు, క్షతగాత్రులకు, మరణించ సిద్దముగా నున్నవారికి దయచూపువాడే. మానవాళిలో సృష్టికర్త యొక్క నైతిక రూపమును తిరిగి స్థాపించుటయను నిర్లక్ష్యము చేయబడిన తన కార్యమును నిర్వహించుటకు దేవుడు ప్రతి మానవుని ఆహ్వానించుచున్నాడు. 1WM 49;CChTel 180.1

    ఇతరులకొరకుద్దేశింపబడిన ఈ కార్యమును నిర్వహించుటకు కృషి, ఆత్మోపేక్ష, ఆత్మత్యాగము అవసరము. తన అద్వితాయ కుమారుని వరదానము ద్వారా దేవుడు చేసిన త్యాగముతో మన స్వల్ప త్యాగమేమి సాటి? 26T 283;CChTel 180.2

    నిత్యజీవము స్వతంత్రించుకొనుటకు గల షరతులను మన రక్షకుడి స్పష్టముగా వ్యక్తీకరించెను. గాయపడి, దోచుకొనబడిన మనుష్యుడు (లూకా 10:30`37) మన శ్రద్దకు, సానుభూతికి, ధాతృత్వమునకు అర్హులైన వారిని సూచించు చున్నాడు. మన యొద్దకు తేబడిన అభాగ్యులు, శరణార్థులు ఎవరైనను నిశ్చయత లేదు. కారణమేమనగా దేవుడు మనపై పెట్టిన విధులను మనము నెరవేర్చుట లేదు. మన చుట్టములు కాని కారణముగా వారి యెడల మనము కనికరము, దయ చూపకున్నాము. మీరు తుది ఆరు ఆజ్ఞలకు ఆలంబనమైన రెండవ మహత్తరాజ్ఞన అతిక్రమించునట్లు తేలినది. ఒక విషయమందు దోషియై నవాడు అన్నిటి యందును దోషి యగును. CChTel 180.3

    మానవ లేమిడియందున్న, బాధల యందునున్న వారి యెడల జాలి చూపని వారు దేవుని ధర్మశాస్త్రము నందున్న మొదటి నాలుగు ఆజ్ఞల యందున్న దేవుని హక్కులను పాటించరు. విగ్రహములు తమ హృదయ్ఛేలను ఆకర్షించినపుడు దేవుడు గౌరవింపబడడు. ఆయన ఆధిపత్యము సహించబడదు. 33T 524;CChTel 180.4

    కృపను, కనికరమును, నీతిని లెక్కచేయని వాడు, బీదలను కనికరింపని వాడు, బాధపడుచున్న మానవాళి యవసరములను లెక్కచేయనివాడు సౌశీల్యసాధనలో దైవ సహాయమును పొందజాలడని రాతిపై ఇనుపఘంటముతో వ్రాయబడురీతిగా మనస్సాక్షిపై లిఖించబడవలెను. సానుభూతి కలిగి ఇతరుల అవసరములను తీర్చుటకు మన లాభములను, తరుణములను వినియోగించినప్పుడు మనకు మానసిక నైతిక సంస్క ృతి సాధ్యమగును. సాధ్యమైన దంతయు సంపాదించి నిల్వచేసికొనుటద్వారా మనకు ఆత్మ దౌర్భాగ్యమ ప్రాప్తించును. దేవుడు తమకు నియమించిన కార్యమును చేయువారికి ` అనగా క్రీస్తు విధానముల ననుసరించి పనిచేయువారికి ` క్రీస్తు గుణములన్నియు అనుగ్రహింపబడును. 46T 262;CChTel 181.1

    రక్షకుడు హోదాను, కులమును, లోక ప్రతిష్ఠను, భాగ్యమును సరకు చేయడు. శీలము, కార్యదీక్ష ఆయనకు మిక్కిలి విలువైనవి. బలిమి గలవారి పక్షమున, ప్రజాభిమానమును చూరగొన్నవారి పక్షమున ఆయన చేరడు. సజీవ దేవకుమారుడగు ఆయన పడిపోయిన వారిని లేవనెత్తుటకు తన్నుతాను ఉపేక్షించుకొనెను. దారితప్పి నశించుచున్న ఆత్మను వాగ్దానములద్వారాను, హమీలద్వారాను రక్షించుట కాయన సమకట్టెను. ఆయన అనుచరులలో నెవరు దయ, సానుభూతులను ప్రదర్శించురా యని దేవదూతలు ఆశక్తితో చూచుచున్నారు. యేసు ప్రేమను కనపర్చు దైవజనులెవరాయని వారు వేచియున్నారు. 56T 268;CChTel 181.2

    దేవుడు దాతృత్వమునేకాక ఆనందముతో నిండిన మీ ముఖసీమను, నిరీక్షణ గల మీ మాటను ఉత్సాహ పూరితమైన మీ ఆలింగనమును వాంఛించుచున్నాడు. బాధలలో నున్న వారిని మీరు సందర్శించు నప్పుడు నిరాశులైన వారిని కలిసి కొందురు; ఆశా కిరణమును వారికి అందజేయుడి. జీవాహారము కావలిసిన వారు కొందరుందురు. వారికి దైవవాక్యము చదివి వినిపించుడి. లోకౌషధము గాని, లోక వైద్యులుగాని స్వస్థపర్చలేని ఆత్మ రుగ్మత గలవారు కొందరుందురు. వారి కొరకు ప్రార్థించి వారిని యేసు చెంతకు చేర్చుడి. 66T 277;CChTel 181.3