Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వైపరీత్యములు ఆరోగ్య సంస్కరణకు హానికరములు

    కొందరు అనారోగ్యదాయకమగు ఆహారమును భుజించుట మానెదరు. అట్లు చేయుచు శరీరమునకు అవసరమగు బలప్రదాయకాహారయును భుజించరు. ఆరోగ్య సంస్కరణమును గూర్చి విపరీత దృక్పథముగలవారు రుచిలేని వంటకములు. తృప్తిలేని వంటకములు చేయు అపాయమందున్నారు. ఆహారము రుచికరముగను, బలవరథకముటను ఉండునట్లు తయారు చేయబడవలెను. శరీరమునకు అవసరమగు పోషణ పదార్థములు మనము తిను ఆహారమునందు లోపించరాదు. నేను ఉప్పును ఉపయోగించచెదను. ఉప్పు హానికరమైనది కారు. రక్తమునకు అది అవసరము. కొద్దిగా పాలనుగిని, మీగడనుగాని లేక వీని వంటి పదార్థములతో గాని గూరగాయలను రుచికరముగా వండవలెను. CChTel 431.2

    చిన్న పిల్లలు వెన్ననుపయోగించుద్వారా వచ్చు జబ్బులను గూర్చి, గ్రుడ్లను తరచు ఉపయోగించుటర్వారా కలుగు అనర్థములను గూర్చి హెచ్చరిక చేయబడినను బాగుగా పెంచిన కోడి పెట్టలు గ్రుడ్లనుపయోగించుట ఆరోగ్య సూత్రముల నుల్లంఘించిఉటయని మనము భావించరాదు. కొన్ని విషపదార్థములను ప్రతిఘటించు పదార్థముతలు గ్రుడ్లలో కలవు. CChTel 431.3

    పాలు, గ్రుడ్లు, వెన్న ఉపయోగించుట మానిన వారు కొందరు శరీరమునకు పోషణ నిచ్చు ఆహారమును భుజించనందున పని చేయజాలనంత బలహీనులైరి. ఇట్లు ఆరోగ్య సంస్కరణకు చెడ్డ పేరు కలిగినది. మేము బలముగా నిర్మించిన పనికి దేవుడు కోరని వింత వింత విషయములను చేర్చి దానిని గలిబిలి చేసిరి. సంఘముయొక్క శక్తి కుంటుబడినది. కాని యిట్టి ఉద్దేశముల ఫలితము తొలగించుటకు దేవుడు కలుగజేసికొనును. పాప మానవాళిని సువార్త సమన్వయపర్చవలసి యున్నది. అది ధనికులను దరిద్రులను ఒకే విధముగ క్రీస్తు పాదముల కడకు చేర్చవలసియున్నది. CChTel 431.4

    ప్రస్తుతము మనము వాడుచున్న పాలు, మీగడ, గ్రుడ్డు ఇట్టి కొన్ని ఆహార పదార్థములను విసర్జించవలసిన కాలము వచ్చును. కాని ఆ కాలమునకు ముందే తత్తరచేయు విపరీత ఆంక్షలను మనము ఏర్పరచుకొనవలసిన అవసరము లేదు. అట్టి పరిస్థితులు వచ్చువరకు ఆగుడి. అప్పుడు ప్రభువు మీకు మార్గమును సిద్ధము చేయును. CChTel 432.1

    ఆరోగ్య సంస్కరణ సూత్రములను జయప్రదముగా ప్రబోధించువారు దైవవాక్యమును తమ మార్గదర్శిగాను, హితసరిగాను గైకొనవలెను. ఆరోగ్య సంస్కరణ ప్రబోధకులు ఇది చేసినపుడే శ్రేయస్సును పొందగలరు. మనము విసర్జించిన హానికరమగు ఆహార పదార్థముల స్థానే పోషణకరమును, రుచికరమును అగు ఆహారమును భుజింపకుండుట ద్వారా ఆరోగ్య సంస్కరణమునకు వ్యతిరేకముగా సాక్ష్యమీయకుందుముగాక. ఉద్రేక పదార్థముల నెన్నడును ఉపయోగించకుడి. సామాన్యమైన ఆరోగ్యదాయకమైన ఆహారమునే భుజించుడి. ఆరోగ్య సంస్కరణ నిమిత్తము సర్వదా దేవునికి కృతజ్ఞత చూపుడి. అన్ని విషయములయందును. యధార్థత, సత్యములు కలిగి యుండుడి. అప్పుడు మీకు మహా విజయము చేకూరును. CChTel 432.2