Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆధ్యాయము 65 - యెహోషువ . దేవదూత

    దృశ్యమాన ప్రపంచమునకు అదృశ్య ప్రపంచమునకు మధ్య గల తెరను తొలగించుకొని దైవ ప్రజలు పరిశుద్ద దూతాసమేతుడైన క్రీస్తుకును దుష్ట దూతల సమేతుడైన సాతానుకును మధ్య జరుగుచున్న ఈ పోరాటమును చూడగలిగినచో, పాపదాస్యము నుండి ఆత్మలను రక్షించుటకు దేవుడు చేయుచున్న కృషిని వారు గ్రహించగలిగినచో, ఈ దుర్మార్గుని దుస్తంత్రముల నుండి వారిని రక్షించుట కిల నిత్యము ఆయన ఉపయోగించుచున్న శక్తిని వారు చూడగలిగినచో, సాతాను దుస్తంత్రములకు లొంగకుండునట్లు వారు ఇంతకన్న బాగుగా సిద్ధపడెదరు. రక్షణక్షపాయము యొక్క విస్తృతి, ప్రాముఖ్యతగల దృష్ట్యా క్రీస్తుతో జతపనివారగు తమ ముందున్న కార్య వైశిష్ట్యము దృష్ట్యా వారి మనస్సులు పవిత్రములగును. తమ్మును రక్షించుట యందు పరలోకవాసులెల్లరు ఆసక్తులై యున్నారని గ్రహించిన వారై వారు సాత్వికము కలిగి ధైర్యముగ నుండెదరు. CChTel 519.1

    సాతాను యొక్కయు క్రీస్తు యొక్కయు పనులకును, తన ప్రజలను అభిసంశించు వారిని జయించుటకు మన మధ్యవర్తికున్న శక్తికిని అతి బలమైన సార్థకమైన సాదృశ్యము జెకర్యా ప్రవచనమందు కలదు. పవిత్ర దర్శనమందు ప్రధానయాజకుడగు యెహోషువాను ప్రవక్త “మలిన వస్త్రములు ధరించి” ప్రభువు దూత యెదుట నిలచి గొప్ప శ్రమయందున్న తన ప్రజల పక్షమున దైవ కృప కొరకు విజ్ఞాపన చేయుచున్నట్లు చూచెను. అతనిని ప్రతిఘటించుటకు సాతానుడు తన కుడి ప్రక్క నలిలచి యుండెను. సాతాను ఆరోపణల నుండి తన్ను తాను గాని తన ప్రజలను గాని ప్రధాన యాజకుడు కాపడుకొనజాలడు. ఇశ్రాయేలీయులు పాపము లేనివారని అతడు అనుట లేదు. ప్రజల పాపములను చూపించు తన మలిన వస్త్రములలో వారి పాపములను ఒప్పుకొనుచు పశ్చాత్తాపమునకు సాత్వికమునకు వారిని నడుపుచు పాపమును రక్షకుని కృపపై ఆనుకొని విశ్వాసము ద్వారా దేవుని వాగ్దాన ఫలమును కోరుచు వారి ప్రతినిధిగా అతడు దూత యెదుట నిలచెను. CChTel 519.2

    అప్పుడు క్రీస్తును, పాపుల రక్షకుడు అగు ఆ దూత తన ప్రజల నిందించు వారి నోళ్లను ఈ మాటతో మూయించెను. “సాతానూ, ఇతడు అగ్నిలో నుండి తీసిన కోరని వలెనే యున్నాడుగదా? యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును అని. .. సాతానుతో అనెను.” జెకర్యా 3:2. CChTel 519.3

    యెహోఘవ విజ్ఞాపన అంగీకరించబడగా ఈ ఆజ్ఞ ఇయ్యబడినది. “ఇతని మైల బట్టలు తీసివేయుడ”ను ఆజ్ఞ ఇయ్యబడెను. యెహోఘవాతో దూత ఇట్లనెను. “నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను.” “వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి”. జెకర్యా 3:4, 5. అతని పాపములును తన ప్రజల పాపములును పరిహరించబడినవి. తమకు ఆరోపించబడిన క్రీస్తు, నీతియను “ప్రశస్వమైన వస్త్రమును” వారు ధరించుకొనిరి. CChTel 520.1

    యెహోఘవా పైని, అతని ప్రజల పైని నేరారోపణ చేసినట్లే సాతాను దేవుని కృపను, ఆదరమును అపేక్షించు వారి పైని నేరము మోపుచున్నాడు. ప్రకటనలో నతడు “దివారాత్రము మన దేవుని యెదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు” అని పిలువబడుచున్నాడు. ప్రకటన 12:10. పాప శక్తి నుండి రక్షించబడిన ఆత్మ తన నామము గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన ప్రతి ఆత్మ విషయము పోరాటము జరుగుచున్నది. ఏ ఆత్మయు అపవాది యొక్క ప్రతిఘటనము లేకుండ సాతాను కుటుంబము నుండి దైవ కుటుంబములో చేరదు. ప్రభువు నాశ్రయించువారిపై సాతానుడు ఫిర్యాదు చేయుటకు కారణము వారి పాపముల విషయమైన కోపము వారి దుష్ప్రవర్తన యందాతడానందించును. దైవ ధర్మ శాస్త్రమును వారు అతిక్రమించునట్లు చేయుట ద్వారానే వారి నతడు స్వాధీనపర్చుకొనగలడు. అతని నేరారోపణలు క్రీస్తు నెడల తనకు గల విరోధము మూలముగనే ఉప్పతిల్లు చున్నవి. రక్షణ ఉపాయము ద్వారా మానవ కుటుంబముపై పాతానుకు గల అధీనమును తొలగించి వారిని అతని హస్తముల నుండి క్రీస్తు రక్షించుచున్నాడు. క్రీస్తు సర్వాధిపత్యమును చూచినపుడు ప్రథాన విప్లవకారుని ఏహ్యభావము, దౌష్ట్యము, అధికమగును. అంతట అతడు కుయుక్తిలో వ్యవహరించుచు ప్రభుని రక్షణ నంగీకరించిన, శేషించిన ప్రజలను ప్రభువు నొద్ద నుండి లాగుకొనుటకు యత్నించును. CChTel 520.2

    అతడు మనుష్యులకు సందేహము కలిగించి దేవుని యందు తమకున్న నమ్మకము పోగొట్టి వారిని ఆయన ప్రేమ నుండి దూరపర్చ యత్నించును. ఆయన చట్టము నతిక్రమించుటకు శోధించి ఆ మీదట వారు తన దాసులనియు వారిని క్రీస్తు తన యొద్ద నుండి తీసికొనుట కూడదనియు వాదించుచున్నాడు. యధార్థత కలిగి క్షమాపణ, కృప కొరకు దేవునిని వేడుకొను వారికవి అనుగ్రహించబడునని యతనికి తెలియును. కనుక సాతానుడు వారికి తమ పాపమును చూపి వారి నిరుత్సామ పర్చును. దేవునికి విధేయులైయుండుటకు ప్రయాసపడుచున్న వారికి విరోధముగా పని చేయుట కాతడు నిత్యము తరుణములు వెదకుచున్నాడు. వారు చేయు ఉత్తమమైన, అంగీకృతమైన సేవ కూడ చెడ్డదిగా అగపడునట్లు చేయుట కతడు ప్రయత్నించు చున్నాడు. కుయుక్తి తోను కూృరత్వముతోను కూడిన అనేక విధానముల ద్వారా వారిని శిక్షపాలు చేయుటకతడు తాపత్రయపడుచున్నాడు. CChTel 520.3

    మానవుడు తనంతట తానీ నిందలను ఎదుర్కొనలేడు. పాపపు డాగులు గల తన వస్త్రములతో, తన అపరాధమును ఒప్పుకొనుచు అతడు దేవుని ముందు నిలువబడును. కాని మన ఉత్తరవాది యగు యేసు పశ్చాత్తాప విశ్వాసముల ద్వారా తమ ఆత్మలను ఆయన కప్పగించిన వారి పక్షమున విజ్ఞాపన చేయును. వారి పక్షమున వాదించి తమ ఫిర్యాదును కల్వరివాదనతో ఓడిరచును. దైవ ధర్మశాస్త్రమునకు సిలువ మరణము పొందునంతగా ఆయన చూపిన విదేయత పరలోకమందును భూలోకమందును ఆయనకు శక్తిని ఇచ్చినది. పాపి నిమిత్తము కృపను సమాధానమును ఆయన తండ్రి యొద్ద నుండి పొందుచున్నాడు. తన ప్రజలను అభిసంశించు వానికి ఆయన ఇట్లు చెప్పుచున్నాడు: “సాతానూ.. .. యెహోవా నిన్ను గద్దించును’ వీరు నా రక్తముతో కొనబడిన వారు. వీరు అగ్నిలో నుండి తీసిన కొరవులు. విశ్వాసముతో ఆయనపై ఆధారపడువారు ‘నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను’ అను వాగ్దానమును పొందెదరు. CChTel 521.1

    క్రీస్తు నీతి వస్త్రమును ధరించుకొన్న వారందరు ఎన్నుకొన బడిన, నమ్మకమైన, యధార్థమైన ప్రజలుగా నిలువబడెదరు. క్రీస్తు హస్తము నుండి వారిని లాగుకొనుటకు సాతానుకు శక్తి ఉండదు. పశ్చాత్తాపము నొంది విశ్వాసము ద్వారా తన ఆశ్రయము కోరిన ఒక్క ఆత్మను కూడ క్రీస్తు విరోధి హస్తగతము కానీయడు. ఆయన ఇట్లు వాగ్దానము చేయుచున్నాడు. ఈలాగు జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధానపడవలెను. వారు నాతో సమాధానపడవలెను.” యెషయా 27:5 యెహోషువా కీయబడిన యీ వాగ్దత్తము అందరికి చేయబడును. “నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల. .. ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.” జెకర్యా 3:7. ఈ ప్రపంచమందు సయితము వారి కిరుపార్శ్వముల దేవదూతలు నడచెదరు. చివరగా వారు దైవ సింహాసనమును పరివేష్టించు దేవదూతల మధ్య నిలచెదరు. CChTel 521.2

    దేవుని వలన అంగీకరించబడిన ప్రజలు మలిన వస్త్రములతో ప్రభువు ముందు నిలచి యున్నట్లు చూపబడిన హేతువుచే ఆయన నామము ధరించిన మనము వినయము కలిగి నిశితముగా మన హృదయములను పరీక్షించుకొనవలెను. సత్యమును గైకొనుట ద్వారా తమ ఆత్మలను నిజముగా పరిశుద్ధ పరచుకొను వారు తమ్మును తాము తగ్గించుకొనెదరు. క్రీస్తు నిష్కళంకమైన శీలము పరికించు కొలది ఆయన స్వరూపమునకు మార్పు చెందవలెనను వారి ఆకాంక్ష అధికరించును. తమ యందలి పవిత్రతను లేక పరిశుదద్ధతను గూర్చి వారు చాల తక్కువగా తలంతురు. మనము మన పాపస్థితిని గుర్తించుకొలది మనకు సితియు, పరిశుద్ధతయు, విమోచనయునగు క్రీస్తుపై మనము ఆధారపడవలెను. సాతానుడు మనపై మోపు నిందలన మనకై మనము ఎదుర్కొనలేము. మన పక్షము క్రీస్తేసార్థకముగా వాదించగలడు. మన యోగ్యతలు గాక తన యోగ్యతలు ప్రాతిపదికగా గల వాదనలతో అపవాదిని క్రీస్తు ఓడిరచగలడు. CChTel 522.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents