Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆధ్యాత్మిక ఉజ్జీవావశ్యకత

    మనము క్రీస్తుననుసరించెదము అని మన ప్రజలకు చెప్పవలసినదిగా నేను ఉపదేశించబడితిని. ఆయన మనకు అన్ని విషయములో మాదిరిగ నుండవలెనను విషయమును మరవకుడి. ఆయన బోధలలో లేని ఉద్దేశ్యములను మనము విసర్జింపవచ్చును. నిత్య సత్యవేదికపై తమ పాదములున్నవో లేవో నిర్ధారించుకొనవలెనని మన బోధకులకు నేను విజ్ఞప్పి చేయుచున్నాను. ఉద్దేశ్యమును పరిశుద్ధాత్మయని భావించకుండ మీరు జాగ్రత్తగా నుండుడి. ఈ విషయములో కొందరు అపాయమందున్నారు. తమకున్న నిరీక్షణకు హేతువు చూపవలసినదిగా కోరు ప్రతి వ్యక్తికి ప్రత్యుత్తరమిచ్చుటకు సామర్థ్యము కలిగియుండుటకు గాను విశ్వాసమునందు బలముగా నుండవలెనని నేను కోరుచున్నాను. CChTel 485.1

    ఈ కడవరి దినములలో నిలువబడుటకు ఒక ప్రజను సిద్ధము చేయు పని నుండి మన సహోదరుల యొక్కయు, సహోదరీల యొక్కయు మనస్సులను త్రిప్పుటకు సాతానుడు ప్రయాసపడుచున్నాడు. ప్రస్తుత అపాయముల నుండి, బాధ్యతలనుండి మానవుల మనస్సులను తొలగించుటకే యాతని మాయలు ఏర్పాటు చేయబడినవి. క్రీస్తు యోహాను ద్వారా ప్రవచన సంబంధమైన వెలుగును వారు కొరగానిదిగా భావించుచున్నారు. మన ముందున్న సన్నివేశములు మనము ప్రత్యేకముగా గమనించవలసి నంత ప్రాముఖ్యమైనవి కావని అవి బోధించుచున్నవి. పర సంబంధమైన సత్యమును అవి నిరర్థకము చేయుచు దైవ ప్రజల గతానుభవమును దోచుకొని దానికి ప్రతిగా తప్పుడు శాస్త్రము నిచ్చుచున్నవి. CChTel 485.2

    “యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు ` మార్గములలో నిలిచి చూడుడి “పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేదియని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు ` మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.” యిర్మియా 6:16. CChTel 485.3

    అనేక సంవత్సరముల క్రిందట చెప్పబడిన తిన్నని సాక్ష్యమును తిరిగి చెప్పవలెనని దేవుడు కోరుచున్నాడు. నూతన ఆధ్యాత్మిక జీవితము జీవించవలెనని ఆయన కోరు తన ప్రజల ఆధ్యాత్మిక శక్తులు ఎన్నడో మందగిల్లినవి. మరణమగా అగపడు ఈ స్థితినుండి పునరుత్థానము అవసరము. CChTel 485.4

    ప్రార్థన ద్వారాను, పాపము నొప్పుకొనుట ద్వారాను మనము దేవుని మార్గమును సరాళము చేయవలెను. దీనిని మనము చేయుటకు ఉపక్రమించినపుడు మనకు దైవాత్మ వచ్చును. మనకు పెంతుకోస్తునాటి బలము అవసరము ఇది తప్పక లభించును. ఏలయనగా తన ఆత్మను సర్వము జయించు శక్తిగా పంపెదనని ప్రభువు వాగ్దానము చేసెను. CChTel 486.1

    మనముందు అపాయకరమైన కాలమున్నది. సత్యము నెరిగిన ప్రతి వ్యక్తి మేల్గోని దైవ శిక్షణకు త్రికరణశుద్దితా లోంగవలెను. శత్రువు మనవెంట బడినాడు. మనము మేల్కోని అతనిని గుర్తించి జాగరూ కులము కావలెను. మనము దేవుని సర్వాంగ కవచమును ధరింవలెను. ప్రస్తుత కాల సత్యమును మనము ప్రేమించి దానిని అనుసరించవలెను. బలమైన మెసములను అంగీకరించ కుండ ఇది ననలను కాపాడును. ఆయన వాక్యము ద్వారా దేవుడు మనతో మాటటాడెను. సంఘ సాక్ష్యములద్వారను మన ప్రస్తుత బాధ్యతను మన మాక్రమించ వలసిన స్ధానమును వెశదముచేయుటకు తోడ్పడు గ్రంధములద్వారాను, ఆయన మనతో మాటటాలడు చున్నాడు. వాక్యము వెంబడి వాక్యము, ఉపదేశము వెంబడి ఉపదేశముగా నీయబడిన హెచ్చరికలు అనుసరించ బడవలెను. వీటిని మనము ఆలక్ష్యము చేసినచో మనమేమి సాకు చెప్పగలము?CChTel 486.2

    దేవుని సేవ చేయుచున్న వారు యదార్ధమైన వాటికి బదులు కృత్రిమమైన వాని అంగీకరించ వలదని వారిని బ్రతిమాల చున్నాను. పరిశుద్ధమైన దైవ సత్యముడవలసిన తావులో మానవ ఊహాభావములను ఉంచకుడి. తన ప్రజల హృదయములలో విశ్వాసమును ప్రేమన రగుల్కొల్పవలెనని క్రీస్తు వేచియున్నాడు. నిత్య సత్య వేదికపై బలముగా నిలువవలసిన వ్యక్తులు అసత్య సిద్ధాతములను అంగీకరించ కుందురుగాక. సంశయమునకు అతీతమైన గ్రంధముపై నాధారపడిన ప్రాతిపదిక సూత్రములను బలవత్తరముగా నమ్మవలసినదని దేవుడు మనలను కోరుచన్నాడు. 78T 296-298;CChTel 486.3