Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దైవభీతిగల తల్లిదండ్రుల హితవు

    వివాహ ఫలితముగా నెంత గొప్ప బాధ సంభవించుచుండగా యువజనులెందుకు వివేకముగా వర్తించరు? ఎక్కువ అనుభవశాలులైన పెద్దల సలహా మాకవసరము లేదని వారేల తలంచెదరు? వ్యాపారమందు మానవులు జాగరూకత ప్రదర్శించెదరు. ఏదైనా ఒక ముఖ్య వ్యవహారమున ప్రవేశించముందు ఆ కార్యము కొరకు వారు సిద్ధపడెదరు. ఆ కార్యమందు పరాజయము పొందకుండునట్లు సమయమును ద్రవ్యమును వెచ్చించి ఆ యంశమును నిశితముగా పరిశీలించెదరు. CChTel 257.4

    వివాహమును గూర్చి ఇంక ఎంత శ్రద్ద వహించవలెను? ఈ బాంధవ్యము భావి సంతతి వారికి భావి జీవితమునకు సంబంధించినది కాదా? దీనికి బదులు తరచు పరిహాసముతోను, ఆనాలోచితముగాను, ఉద్రేకముతోను, మోహముతోను, గ్రుడ్డితనముతోను , నిలుకడలేని యోచనతోను వివాహ బంధకములో ప్రవేశించుచున్నారు. బాధ నాశనములందు లోకమును బంధించుటకు ఇది సాతానుడు వేయుచున్న వలjైు యున్నది. ఈ లోక మందానందమును, రానైయున్న ప్రపంచమందు తమ గృహమును కోల్పోవుట ఆలోచనలేని యీ వ్యక్తులకు ఆనందదాయకము. CChTel 258.1

    తల్లిదండ్రుల సలహాలు యోచనలు ఏమైయున్నను తమ కోరికలు ఉద్దేశముల ప్రకారము వర్తించుట పిల్లలకు తగునా? కొందరు అనుభవశాలురగు తమ తల్లిదండ్రుల యిష్టాయిష్టములను తెలిసికొననే తెలిసికొనరు. వారి యెన్నికనుగాని యోచనను గాని యోచననుగాని లెక్క చేయరు. వారి హృదయ ద్వారమును స్వార్థ ప్రీతి మూసివేసి మాతా పితృప్రేమను చొరనీయకుండ చేయుచున్నది. ఈ విషమును గూర్చి యువజనులు తీవ్రముగా తలంచవలసిన అగత్యము కలదు. CChTel 258.2

    ఐదవ ఆజ్ఞ వాగ్ధానముతో కూడిన ఆజ్ఞ. కాని ఇది చులకన చేయబడుచున్నది. ప్రేమికుల మూలముకానిది విస్మరించబడుచున్నది కూడా. తల్లి ప్రేమను ఉపేక్షించుట, తండ్రి శ్రద్ధను అగౌరపరుచుట ` ఈ పాపములు చాలామంది యువజనుల పేళ్ళకు నెదరుగా దాఖల చేయబడును. CChTel 258.3

    అనుభవశూన్యులైన యువజనుల వలపులు నెవరును విమర్శించకుండుట, వారి ప్రేమానుభవమందు ఎవరును జోక్యము కలిగించుకొనకుండుట యనునవి యీ యంశమునకు సంబంధించిన పెద్ద తప్పిదములు. ఇది సర్వ విధముల యోచించవలసిన అంశము. ఇతరుల అనుభవ సహాయముతో ఇరు పక్షముల వారును విషయమును ప్రశాంతముగాను, జాగరూకత తోను యోజించుట అత్యవసరము. ఇది బహుళ సంఖ్యాకులచే అలక్ష్యము చేయబడు చున్నది. యౌవన స్నేహితులారా, దేవుని సలహాను, దైవ భీతిగల మీ తల్లిదండ్రుల సలహాను అనుసరించుడి. ఈ విషయమును గూర్చి ప్రార్థించుడి. CChTel 258.4

    కుమార్తె యొక్క గాని కుమారుని యొక్క గాని యిష్టాయిష్టములను లెక్క చేయక తల్లిదండ్రులు భార్యను గాని, భర్తను గాని, యెన్నవచ్చునా? యని మీరడుగవచ్చును. ఈ ప్రశ్నను అడుగవలసిన రీతి యిది. బిడ్డల యెడల ప్రేమగల CChTel 259.1

    తల్లిదండ్రుల ఐహికానందమునకు ప్రతిబంధకము కలుగునపుడు కుమారుడుగాని కూతురు గాని ముందు తన తల్లి దండ్రులతో సంప్రదించకుండా భార్యను గాని భర్తను గాని యెన్నుకొనవచ్చునా? తల్లిదండ్రుల సలహాను విజ్ఞాపనలను త్రోసిపుచ్చి ఆ యువకుడు తన చిత్తమునే జరిగించవచ్చునా? అట్లు చేయరాదని నా నిష్కర్షjైున జవాబు ` అతడెన్నడును వివాహమాడకున్నను, సరే! అట్టి విధానమును ఐదవ ఆజ్ఞ నిషేదించుచున్నది. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తిల్లిని సన్మానించుము. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. దీనిని గైకొనువారి యెడల దేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చును. వివేకవంతులగు తల్లిదండ్రులు తమ పిల్లల యిష్టాయిష్టములను పరిగణించకుండ వారికి భార్యలను భర్తలను ఎన్నరు. CChTel 259.2

    తమ బిడ్డలు యోగ్యులైన వారిని ప్రేమించునట్లు నడిపించు బాధ్యత తల్లిదండ్రులపై గలదని గ్రహించనగును. దైవ CChTel 259.3

    కృప సహాయము వలనను, తమ స్వకీయ ఉపదేశాచరణ వలనను తమ బిడ్డల నడతను, వారి పసితనమునుండియే తీర్చిదిద్ది తద్వారా వారు పవిత్రులుగను, సాధుజనులుగను ఉండి యదార్ధవంతులను, సజ్జనులను ఎన్నుకొనునట్లు నడిపించుట, తమ బాధ్యత తల్లిదండ్రులు గుర్తించవలెను. మంచి మంచి నాకర్షించును, మంచివారు మంచిని అభినందింతురు. సత్యము, పవిత్రత, మంచితనము యెడల ప్రేమను మీ బిడ్డల హృదయములలో రగుల్కొల్పుడి. అప్పుడు యువజనులు ఈ సలక్షణములు కలవారి సాంగత్యమునే యన్వేషించెదరు. CChTel 259.4