Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మానసికావసరతలను అలక్ష్యము చేయకుడి

    దైవ భీతిగల తల్లిదండ్రులు తమ బిడ్డలను అదుపు చేయునపుడు వారి మనస్తత్వములను చ్తివృత్తులను పరిశీలించి వారి యక్కరలను తీర్చుటకు యత్నించవలెనని నాకు చూపబడెను. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల శారీరకావసరతలను జాగ్రత్తగా తీర్చెదరు. వారికి జబ్బు చేసినపుడు దయగాను, విశ్వాసముతోను వారికి సేవ చేసి తమ నిధిని నెరవేర్చితిమని తలంచెదరు. ఇక్కడనే వారు పొరబడుచున్నారు. వారి పని అప్పుడే ప్రారంభమయినది. మానసికావసరతలను తీర్చవలెను. గాయపర్చబడిన మనస్సును బాగు చేయుటకు సరియై న మందులు వేయుటకు నైపుణ్యము అవసరము. CChTel 373.1

    చిన్న పిల్లలకు కూడా కష్టములుండును. పెద్దవారి కష్టములవలెనని భరింపరానివి. విచారకరమైనవియై యుండవచ్చును. తల్లిదండ్రులు కూడా ఎపల్లప్పుడు ఒకే విధముగా నుండలేరు. వారి మనస్సులలో తికమకలు లేచును. తప్పుడు దృక్పథములతోను ఊహల తోను వారు పని చేసెదరు. సాతాను వారిని చేజిక్కించుకొనుచు వారాతని శోధనలకు లొంగి పోయెదరు. వారు కోపోద్రికులై తమ బిడ్డలకు కోపము పుట్టించునట్లు మాటలాడుదురు. కొన్నిసార్లు వారు కఠినముగా నుండి చిరచిరలాడెదరు. పాపము పిల్లలకు కూడా అదే స్వభావము అబ్బును. వారికి సహాయము చేయుటకు తల్లిదండ్రులు సిద్ధముగా లేరు. ఆ యాసదకు కారకులు వారే. కొన్ని మారులు అంతయు తప్పుగానే యున్నట్లుగనపడును. ఎక్కడ చూచినను చిర చిరలే. అందరు విచారముగను వ్యాకులత చెందినట్లుగను ఉందురు. తల్లిదండ్రులు దానికి తమ బిడ్డలను నిందించుచు వారు చాల అవిధేయులనియు, క్రమములేని వారనియు ప్రపంచమంతటిలో వారే చెడ్డ పిల్లలనియు తలంతురు. వారి అవిధేయతకు కారకులు తల్లిదండ్రులే. CChTel 373.2

    కొందరు తల్లిదండ్రులు తమ ఆత్మ నిగ్రహరామిత్య వర్తన వల్ల చాల అల్లకల్లోలములను రేపెదరు. ఇది చేయుడి అది చేయుడి అని దయగా అడుగుటకు బదులు కోప స్వరముతో తల్లిదండ్రులు పిల్లలపై అధికారము చెలాయించుచు పిల్లలను అన్యాయముగా విమర్శింతురు. లేక గద్దింతురు. తల్లిదండ్రులారా, మీ పిల్లల యెడల ఇట్టి వైఖరి వారి యానందమును ఆశయమును నాశనము చేయును. ప్రేమ వలన గాక బలవంతపర్చబడిననందున మీయాజ్ఞలకు వారు లొంగరాదు. వారి హృదయం ఆ పనియందుండదు. వారికది సంతోషముగా నుండుటకు బదులు భారముగా నుండును. మీ సలహాలను అవలబించుటలో మరచుటకు ఇది దారితీయును. ఇట్టి క్రియ మీ కోపమును రేపి పిల్లలకు ఇంక కష్టము కలిగించును. తల్లిదండ్రులు వారి తప్పులను అధికముగా చూపించుచు వానిని గూర్చియే మాటలాడు చుందురు. CChTel 373.3

    మీ పిల్లలకు కోపముఖము కనపర్చకుడి. వారు శోధనకు లొంగి పిదప దానిని గ్రహించి తమ తప్పిదము నిమిత్తము పశ్చాత్తాపపడినచో పరలోకమందున్న మీ తండ్రిచే క్షమించబడవలెనని మీరు నిరీక్షించురీతిగానే వారిని కూడ క్షమించుడి. శరీరాత్మల మాలిన్యమును కడుగుకొని దైవభీతియందు పరిశుద్దతా సంపూర్ణతకు పాటుపడవలసినదిగా మనము హెచ్చరించబడుచున్నాము. జరుగ వలసిన బ్రహ్మాండమైన పని నిక్కడ మనము చూచుచున్నము. క్రైస్తవునికిది నిత్యకృత్యము. ఫలములు ఫలించుటకుగాను ప్రతి తీగె తల్లి తీగె నుండి జీవమును బలమును పొందవలెను. దేవుడు తన కట్టడలలో నొక దానిని మానవుల కాళ్లతో త్రొక్కుచున్నను వారిని క్షమించి దీవించునను నమ్మకము మోసకరమైనది పరిశుద్దాత్మయొక్క సాక్ష్యస్వరమును మాటలాడకుండ చేసి ఆత్మను దేవుని నుండి CChTel 374.1

    వివదీయును. మూసి అపాయమును మీరు గురుతించక ముందే వారి పని హృదయములను ఇతరులు విష కలితములు చేయునట్లు,హానికరమయిన పలుకుబడికి తమ హృదయద్వారము తెరుచునట్లు చేయువారగుదురు 23IT 384—387;CChTel 374.2