Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఒకడు పరిశుద్ధాత్మకు సమర్పించుకొనుటపై నతని ప్రయోజకత్వము ఆధారపడును

    మనము ముందున్న పనిని మన స్వబలముతో చేయవలెనని దేవుడు మనలను కోరుట లేదు. మానవ బలమునకు అతీతమయిన అగత్యములను తీర్చుటకు దైవ సహాయము నాయనయేర్పాటు చేసి యున్నాడు. ప్రతి విధమయిన ఇబ్బందిలోను మనకు సహాయము చేయుటకు, మన నిరీక్షణ నిశ్చయమును బలపర్చుటకు, మనస్సులను ప్రజ్వలింపజేసి మన హృదయములను పవిత్రీకరించుటకు ఆయన పరిశుద్ధాత్మనిచ్చుచున్నాడు. CChTel 229.1

    తన సంఘము మార్పుచెందని సంఘమై పరలోక తేజస్సుతో ప్రకాశించుచు ఇమ్మానుయేలు మహిమను ధరించుకొనునట్లు క్రీస్తు యేర్పాటు చేసెను. ఆధ్యాత్మిక శాంతి తేజముల వాతావరణముతో ప్రతి క్రైస్తవుడు ఆవరిపబడవలెనని ఆయన సంకల్పము. తన హృదయములో పరిశుద్ధాత్ముడు పని చేయుటకుగాను స్వార్థమును విడిచి తన జీవితమును సంపూర్ణముగా దేవునికి సమర్పించి జీవించు వ్యక్తి యొక్క ప్రయోజకత్వము అపారమైనది. CChTel 229.2

    పెంతెకోస్తు దినమున జరిగిన పరిశుద్దాత్మ క్రుమ్మరింపు ఫలితమేమి? రక్షకుడు లేచెనను శుభవార్త మనుష/్యలు నివసించు ప్రపంచపు మారుమూలలకు కూడ కొనిపోబడెను. శిష్యుల హృదయములు సంపూర్ణమైన,ప్రగాఢమైన, చిరస్థాయిగ నుండు దాతృత్వముతో నింపబడెను. తత్పర్యవసానముగా వారు భూదిగంతములకు వెళ్లి ఇట్లు సాక్ష్యమిచ్చిరి. “అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగుగాక!” (గలతీ 6:14) క్రీస్తు యందున్నట్లుగా సత్యమును వారు ప్రకటించగా ఆ వర్తమానము యొక్క శక్తికి హృదయములు లొంగినవి. అన్ని దిక్కుల నుండి విశ్వాసులు తండోపతండములుగా సంఘమందు ప్రవేశించిరి. సురిగిపోయిన విశ్వాసులు తిరిగి సంఘటన జేరిరి. అమూల్యమైన ముత్యమును వెదకుటలో పాపులు క్రైస్తవులతో సంఫీుభవించిరి. సువార్తను బలవత్తరముగా ప్రతిఘటించిన వారే దానికి నాయకులైరి. బలహీనులు “దావీదు వలె” నుందురు. దావీదు వంశస్తులు “ప్రభువు దూతవలె” నుండును అను ప్రవచనము నెరవేరినది. ప్రతి క్రైస్తవుడు తన సహ విశ్వాసిలో దేవుని పోలిన ప్రేమా ధాతృత్వములు చూడగలిగెను. వారదరి ఆస్తి ఒక్కటే. వారందరికి ఒకే ఆశ్చర్యము వెలసెను. క్రీస్తు శీలము వంటి శీలమును కనుపర్చి ఆయన రాజ్య విసృతికి పాటుపడవలెనని ప్రతి విశ్వాసి ఆ కాంక్షించెను. CChTel 229.3

    ప్రధమ శిష్యులకువలె నేడు మనకు కూడ పరిశుద్ధాత్మ వాగ్ధత్తము చెందును. పెంతుకోస్తు దినమున రక్షణ వర్తమానము నాలకించిన స్త్రీ పురుషుల కనుగ్రహించిన రీతిగా నేడు కూడ స్త్రీ పురుషులకు దేవుడు పరలోకశక్తి ననుగ్రహించు ను. ఆయన వాక్యమును విశ్వసించిన వారందరికి అవసరమైన ఆయన ఆత్మీయ కృపయు, ఈ ఘడియయందే అనుగ్రహింపబడును. 3’ 8T 19, 20;CChTel 230.1