Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అవివేకపు ప్రధానమును త్రెంచుకొనుట మంచిది

    క్రీస్తు నందు మాత్రమే వైవాహిక సంబంధము క్షేమకరముగా ఏర్పడగలదు. దైవ ప్రేమనుండి మానవ ప్రేమ బలమును పొందవలెను. క్రీస్తు నివసించు హృదయమందు మాత్రమే ప్రగాఢమైన, వాస్తవికమైన నిస్వార్థమైన ప్రేమ ఉండగలదు. నీవు వివాహమాడ దలచిన వ్యక్తి నడతను పూర్తిగ తెలిసికొన కుండగనే మీకు ప్రధానమయినచో నీవా వ్యక్తిని ప్రేమించి గౌరవించలేకున్నను ప్రధానము జరిగినందు వలన వివాహము చేసికొనక తప్పదని తలంచరాదు. షరతులపై నాధారపడియుండు ప్రధానముల విషయము చేసికొనకు తప్పదని తలంచరాదు. షరతులపై నాధారపడియుండు ప్రధానముల విషయము జాగ్రత్తగా నుండుడి. కాని వివాహమునకు ముందు ప్రధానమును ఉపసంహరించుకొనుట వివాహనంతరము విడిపోవుటకన్న చాల మంచిది. అనేకులు వివాహము అయిన పిదప విడిపోవుట సంభవించుచున్నది. CChTel 267.2

    నేను వాగ్దానము చేసితిని, దానిని మీరుట సమంజసమా? యని మీరడుగవచ్చును. నా సమాధానమేమనగా లేఖన విరుద్ధముగా మీరు వాగ్దాత్తము చేసియున్నచో సత్వరముగా దానిని భగ్నము చేయుడి. అప్పుడు దీన మనస్సు కలిగి అట్టి అనాలోచిత వాగ్దానమును నిలుపుకొని మీ సృష్టికర్తను అగౌరపరుచుటకన్న దైవ భీతి యందు దానిని ఉపసంహరించుకొనుట చాలా మంచిది. CChTel 268.1

    వివాహ సంబంధమును గూర్చిన ప్రతి చర్య, మర్యాద, సరళత యదార్థత కలిగి దేవుని సంతోషపరచి గౌరవించుటకు ఉద్దేశించ బడవలెను. వివాహము ఈ ప్రపంచమందును, రానైయున్న ప్రపంచమందును భావి జీవితమునకు సంబంధించినది. యదార్ధ క్రైస్తవుడు దైవ చిత్తానుకూలముకాని ప్రయత్నములను సల్పడు. CChTel 268.2

    మానవ ప్రేమకొరకు హృదయము తహతహలాడును. కాని క్రీస్తు ప్రేమాస్థానమును సరఫరా చేయుటకు ఈ ప్రేమ చాలినంత బలమైనది, పరిశుద్ధమైనదది. ప్రశస్తమైనది కాదు. జీవిత విచారములను కష్ట నిష్టూరములను బాధ్యతలను ఎదుర్కొనుటకు జ్ఞానమును బలమును కృపను భార్య తన రక్షకుని యందు మాత్రమే కనుగొనగలదు. ఆయనను తన బలమును కృపను భార్య తన రక్షకునియందు మాత్రమే కనుగొనగలదు. ఆయనను తన బలముగను మార్గదర్శకునిగను ఆమె ఎన్నుకొనవలెను. ప్రాపంచికమైన యే స్నేహితునికి వశము కాకమునుపు స్త్రీ తన్ను తాను క్రీస్తుకు అప్పగించుకొనవలెను. దీనికి విరుద్ధముగా ఆమె ఏ సంబంధమును ఏర్పరచుకొనరాదు. వాస్తవికానందమును పొందగోరువారు తమ సర్వస్వముపైని దైవాశీస్సులను పడయవలెను. అనేక హృదయములు గృహకులు విచారముతో నిండి యుండుటకు కారణము దేవునిపట్ల అవిధేయత చూపుటయే. ఆ సహోదరీ, కలకాలము కష్టములుండు గృహము కావలెనని కోరిన తప్ప దైవ విరోధియగు వ్యక్తిని వివాహమాడకుము. CChTel 268.3