Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఎన్నుకొనబడిన వారిని మోసగించుటకొక యత్నము

    దేవుని గూర్చియు ప్రకృతిని గూర్చియు లోకమును అవిశ్వాసముతో ముంచుచున్న దుర్భోధలు పతితుడగు సాతాను ప్రోద్బలము వలన కలిగినవి. అతడు గొప్ప విద్యార్థి. ప్రజల మనస్సులు త్రిప్పుటయే యాతని సంకల్పము. CChTel 481.2

    1844 కడచిన పిమ్మట మేము వివిధ మూఢాభిమానము నెదుర్కొనవలసి వచ్చెను. భూత సిద్ధాంతములను నమ్ము కొందరికిచ్చు నిమత్తము నాకు కొన్ని గద్దింపు సాక్ష్యము లీయబడినవి. CChTel 481.3

    భక్తి హీనములైన బోధలు, దురాచారములకు నడుపుచున్నవి. అది మోసగించుటకు అబద్ధములకు జనకుడగు సాతానుడు పెట్టు ఎరjైు యున్నది. పశ్చాత్తాప శూన్యమైన స్వనీతియే దీని పర్యవసానము. CChTel 481.4

    పూర్వము జరిగినదే మరల జరుగును. ముందు కాలమందు సాతానుని మూఢ నమ్మకములు క్రొత్త రూపము ధరించును. తప్పిదములు ఆకర్షణీయమైన, వ్యర్థస్తుతితో కూడిన విధముగ ప్రచారము చేయబడును. వెలుగు వస్త్రములతో కప్పబడిన తప్పుడు సిద్ధాంతములు దైవ ప్రజల కందింప బడును. ఇట్లు సాతానుడు సాధ్యమైనచో ఎన్నుకొనబడిన వారిని సైతము మోసగించతలపడును. మిక్కిలి దుర్మార్గ ప్రభావము ప్రదర్శించబడును. మానవ మనస్సులు సాతానుని మోసములకు గురియగును. CChTel 481.5

    మానవుల మనస్సులను చెదరగొట్టుటకు జల ప్రళయకాలపు ప్రజల మధ్యనున్న పాపముల వంటి ప్రతివిధమైన పాపము సంకల్పించబడును. ప్రకృతిని దేవుడని ఘనపరచుట, నిర్భంధము లేక విడువబడు మానవ మనస్సు దుష్టుల ఆలోచన ` వీనిని కొన్ని కార్యములను సాధించుటకు సాధనముగా సాతానుడుపయోగించును. తన ఏర్పాటులను కొనసాగించుటకు మనోభక్తి మరియొక మనస్సుపై నుపయోగించును. అన్నింటి కన్న విషాదకరమైన విషయమేమనగా అతని వంచనాత్మకమైన పలుకుబడికి గురియగు మానవలు దేవునితో వాస్తవమైన సంబంధము లేకుండ ఆచారముతో కూడిన దైవ భక్తి కలిగి యుందురు. మేలుకీడులు తెలుపు వృక్షఫలములను భుజించిన ఆదామవ్వలవలె ఇప్పుడు కూడ అనేకులు మోసముతో నిండిన దోషపు ముద్దలను భుజించు చున్నారు. CChTel 481.6

    ఏదేను వనమందు సాతనడు తన సైన్యముల మన మొదటి తల్లిదండ్రులకు ఎరుక పడకుడ సర్పము వేషములో మాటలాడినట్లు సాతాను అనుచరులు తప్పుడు సిద్ధాతములను ఆకర్షముగా బోధించు చున్నారు. ప్రాణాంతకమైన దుర్భోధలను సాతాను ప్రతినిధుల ప్రజల మనస్సులలోనికి ఎక్కించుచున్నారు. దేవని తేట మాటలను వీడి మధురమైన కట్ట కథలతట్టకు తిరుగు వారు సాతానుయొక్క మంత్ర ప్రభావమునకు లోనగుదురు. CChTel 482.1

    ఎక్కువ వెలుగుచున్న వారిని మోసగించగలిగినచో తన పలుకుబడికి లొంగిన వారు పాపమునకు నీతి వస్త్రము తొడిగి అనేకులను అపమార్గమున నడిపించకలరని వానికి అవగతమే. CChTel 482.2

    అందరికి నేన చెప్పునది యిది: జాగ్రత్తగా నుండుడి. ఏలయనగా తన ప్రక్క చేర్చుకొనుటకుగాను ప్రతి క్రైస్తవ సేవక సమూహమునందును, ప్రతి సంఘమందును, వెలుగు దూతవలె సంచరించు చున్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించ బడదు. అను హెచ్చరికను దైవ ప్రజలకీయవలసినదిగా నేను ఆదేశించబడితిని. గలతీ. 6. 7. 38T 292-294;span>CChTel 482.3