Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అక్రమాధికారము

    ఇప్పుడు పరిష్కరించవలసిన విషయమిది. పరిశుద్ధముగాను గౌరవముగాను తన శరీరమును ఉంచుకొనవలెనని దేవుడాసించగా తన భర్త కేవలము తుచ్ఛకామేచ్ఛకు వశుడై తనను బలవంతముగా చేయుచున్నాడనియు ఆ క్రియ ద్వారా తన శరీరమునకు హాని కలుగుననియు భార్య గ్రహించినను తన భర్తకు ఎదురు మాట చెప్పకుండ వశమగుట తన విధ్యుక్త ధర్మమని భార్య తలంచ వచ్చునా?CChTel 285.3

    భార్య తన ఆరోగ్యమును జీవవమును తన భర్త యొక్క మృగవాంఛలకు బలిపెట్టుట నిష్కళంకమైన, పరిశుద్దమయిన ప్రేమకాదు. యధార్థ ప్రేమను వివేకమును ఆమె కలిగి యున్నచో అతని మనస్సును శరీరేచ్ఛల నుండి త్రిప్పి అశాజనకమైన ఆధ్యాత్మికాంశములను ప్రస్తావించుట ద్వారా అతని ధ్యానము ఆధ్యాత్మిక విషయముల పైకి మరల్చుటకు యత్నించును. అధిక దాంపత్య క్రియకు అంగీకరించుట ద్వారా తన శరీరమును పాడుచేసికొనుట కన్న అతని కోపమునకు గురి కావలసి వచ్చినను ఆమె వినయముగను ఆప్యాయముగను అతనిని బ్రతిమాలుట మేలు. ఆమె మృదువుగ, దయాపూర్వముగ తన సర్వ శరీరముపై దేవునికి ప్రథమ హక్కు కలదనియు దేవుని మహా దినమున ఆమెను ఆయనన ఆరా అడుగును గాన ఈ హక్కును తాను అలక్ష్యము చేయజాలననియు సూచించవలెను. CChTel 286.1

    ఆమె తన ప్రేమలను ఉన్నత పరచుకొని పరిశుద్ధతతోను గౌరవముతోను తన స్త్రీ మర్యాదను సంస్కృతిని కాపాడుకొన్నచో స్త్రీలు తమ పలుకుబడి ద్వారా తమ భర్తలను పరిశుద్ధపరచి తద్వారా తమ కర్తవ్యమును తుదముట్టించగలరు. ఇట్లు చేయుటద్వారా ఆమె తన్ను తాను, తన భర్తను కపాడుకొన గలదు. అతి సున్నితమైన, కష్టములతో నిండిన ఈ విషయమందు అధిక వివేకము, ఓర్పు, నైతిక ధైర్యము బలము అవసరము. ప్రార్థన యందు కృప బలములున్నవి. యధార్థ ప్రేమ హృదయమును పాలించు నియమమై యుండవలెను. దేవుని యెడల ప్రేమ, భర్త పట్ట ప్రేమ`ఇదియే సరిjైున కార్యరంగముగ నుండవలెను. CChTel 286.2

    భార్య తన శరీరమును, మనస్సును తన భర్త ఆధీనమునకు అప్పగించుకొని అన్ని విషయములలోను లొంగియుండి తన మనస్సాక్షిని, గౌరవమును, తుదకు అగౌరవమును కూడా లెక్కచేయకున్నచో తన భర్తను అభివృద్ధి పథమునుబెట్టుటకు తనకున్న పలుకుబడిని వినియోగించుటకు గల అవకాశము నామె కోల్పోవును. అతని కఠిన స్వభావమునామె సరిచేయవచ్చును. అతనిని సంస్కరించిపవిత్రపరచి తన శరీరేచ్ఛలను స్వాధీనపరచుకొని ఆధ్యాత్మిక మనస్తత్వమును కలిగియుండటకు పట్టుదలతో ప్రయత్నించునట్లు అతనిని నడిపి, తద్వారా దైవ స్వభావమమందు వారు పాలివారై యుండి శరీరేచ్ఛలద్వారా లోకమందున్న దుర్ణీతిని తప్పించుకొనుటకు ఆమె తన పవిత్రమైన పలుకుబడిని వినియోగించవచ్చును. ఉన్నతమైన ,ఉత్తమైన విషయములవైపుకు మనస్సును మళ్లించి కృపచే మాత్నపర్చబడిన హృదయము స్వాభావికముగా కోరు ఇంద్రియేచ్చలను అదుపుచేయుటకు పలుకుబడికి విస్తారమగు శక్తి కలదు. భర్త ప్రేమకు మృగాతుల్యమైన కామేచ్చ పునదియై దాని చెప్పు చేతలలో నతడు మెలుగుచున్నపుడు తన భర్తను సంతోషపెట్టుటకుగాను భార్య ఆతని స్థాయికి రావలెనని తలంచుచో ఆమె దేవునిని దుఃఖపర్చుచున్నదగును. కారణమేమనగా తన భర్త పై ఆమె తన పవిత్ర ప్రభావమును వినియోగించకపోయినది. వ్యతిరేకముగా ఒకమాట కుడా చెప్పకునాడ ఆతని మృగ కామమునకు తావియవలేనని ఆమె తలంచుచో తన భర్త పట్ల ,తన దేవునిపట్ల తనకు గల ధర్మాము నామె గ్రహించినది కాదని వ్యక్తమగుచున్నది. CChTel 286.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents