Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మన సుస్థలను నైతికముగా బలపరచుట

    తమ బిడ్డల మారు మనస్సు కొరకు చిత్త శుద్దితో పాటుపడుచున్న ఉపాధ్యాయులతో తల్లి దండ్రులు సహకరించవలెను. గృహమందు స్వచ్చమైన, వాంఛనీయమైన ఆధ్యాత్మికాసక్తిని పెంపు చేసి దైవాదేశ ప్రకారము తమ బిడ్డలను పెంచుటకు వారు కృషిచేయవలెను. అనుదినము కొంత సమయమును వినియోగించి తమ బిడ్డలతో కలిసి వారు పటించి నెర్చుకొనవలెను. ఇట్లు వారు విద్యాభ్యాసమును ఆనంద దాయకమగును, లాభాదాయకమగును చేయగలరు. తమ బిడ్డల రక్షణకు ఉపయోగించబడు ఈ పద్దతి యందు వారి నమ్మిక అధికరించుచును. 126T 199;CChTel 385.3

    కొంత మంది పిల్లలు సణుగు కొనుచు కొన్ని ఫిర్యాదులతో ఇంటికి వచ్చెదరు తల్లి దండ్రులు సంఘ సభ్యులు వారు గోరంతలు కొండతలు చేసి చెప్పు వారలను శ్రద్దగా అలకించెదరు. ఆ గాధకు రెండు భాగములున్నవి వారు తలంచుట మంచిది. అట్లు తలంచక వారు ఈ వార్తలను నమ్మి తమకును కలాశాలకును మధ్య ద్వేషమను అడ్డు గోడను నిర్మింతురు. ఆ కళాశాల కార్య నిర్వహణమును గూర్చి ఆందోళన ,అపోహ ,అనుమానములను వెలిబుచ్చేదారు. అట్టి పలుకుబడి చాల హాని కలిగించును. అయిష్టము వలన జనించిన మాట అంటు వ్యాధి వలె వ్యాప్తి చెందును. దీని ఫలితముగా ప్రజలలో కలుగు దురభిప్రాయములను తీసివేయుట చాలా కష్టము. ఒక నోటి నుండి మరియొక చోటికి వెళ్ళుటతో ఆ కథ పెరుగును. తుదకది చాలా పెద్ద కథగా పరిణమించును. పరిశీలన జరుపబడగా ఉపాధ్యాయులు గాని అధికారులుగాని నేరస్థులు కారని తేలును. పాఠశాల నిబంధనలను ఆరు ఆచరణలో పెట్టుటద్వారా వారు తమ ధర్మమును నెరవేర్చుచున్నారు. ఈ నిబంధనలు ఆచరణలో పెట్టబడవలెను. అట్లు కానిచో పాఠశాల చెడిపోవుట తథ్యము. CChTel 385.4

    తల్లిదండ్రులు తమ్మును తాము ఉపాధ్యాయుల స్థానమందుంచుకొని ఆయా తరగతులకు ఆయా చిత్త వృత్తులకు చెందు వందలాది విద్యార్థులు గల పాఠశాలను నడిపించి క్రమపరుచుట యెంత కష్టమో గ్రహించ గలిగినచో దీర్ఘాలోచన చేసిన మీదట వారు విషయములను నేరుగా చూచుట సంభవించును. కొందరు పిల్లలు ఇంటి వద్ద ఎన్నడును క్రమపర్చబడినవారు కారని వారు గుర్తించవలెను. అపనమ్మకము, ఉపేక్ష చూసిన తల్లిదండ్రులకు చెందు ఈ పిల్లలు క్రమపర్చబడకున్నచో వారిని యేసు అంగీకరించడు. వారిని ఏదోవిధముగ అదుపులోనికి తేకున్నచో వారు ఈ జీవితమందు ఆప్రయోజకులగుదురు. అంతియకాక భావి జీవితములో వారికి ఏమియును పాలుండదు. 134T 428, 429;CChTel 386.1

    నమ్మకమయిన ఉపాధ్యాయుల కృషిని కొందరు తల్లిదండ్రులభినందించరు. అసమగ్రమయిన అవగాహన, యోజనలు గల యువజనులు, పిల్లలు ఉపాధ్యాయుల సంకల్పములను, పద్దతులను పూర్తిగా గ్రహించలేరు. అయినను పాఠశాలలోని మాటలు, కార్యములను గూర్చి వీరు వార్తలు తేగానే కుటుంబములో వీనిని తల్లిదండ్రులు చర్చించెదరు. ఉపాధ్యాయుని విధానమును నిశితముగా విమరర్శించెదరు. ఇక్కడ పిల్లలు సులభముగా మరువరాని అవాంఛనీయ పాఠములను నేర్చుకొనెదరు. అపూర్వ నిర్భంధనకు లోనైనపుడు లేక మరింత ఎక్కువగా చదువవలసి వచ్చినపుడు సానుభూతి కొరకు తమ పట్టు నెరవేరుట కొరకు పిల్లలు వివేచన లేని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసెదరు. ఇట్లు అశాంతి అసంతృప్తికరమగు మనస్తత్వము ఉదయించును. దాని దుష్టఫలితములకు పాఠశాల అంతయు గురియగును. ఉపాధ్యాయుని బాధ మరింత హెచ్చును. తల్లిదండ్రులు గారాము పెట్టిన ఈ పిల్లలకు కలుగు నష్టము చాలా పెద్దది. సరియై న తర్బీతు వలన చక్కబడియుండగల గుణదోష ములు సంవత్సరములు గడుచుకొలది బలపడి అట్టి శీలము కలవారికి కళంకము నాపాదించి వారి ప్రయొజకత్వమును శూన్యము చేయును. 14FE 64, 65; CChTel 386.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents