Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 12 - భూమిపై సంఘము

    దేవునికి లోకమందొక సంఘము కలదు. వారాయన వలన ఎన్నుకోబడిన ప్రజలు. ఆయన ఆజ్ఞలను వారు గైకొనెదరు. మార్గము విడిచి యిటునటు సంచరించు వారిని కాదు గాని యొక జనాంగమును ఆయన నడుపుచున్నాడు. సత్యము ప్రతిష్ఠించు శక్తికై యున్నది. పోరాడుచున్న సంఘము జయము నాపాదించును. గోధుమలలో గురుగులు కలిసియున్నవి. “మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా” యని దాసుడు ప్రశ్నించెను. యజమానుడు “వద్దు గురుగులను పెల్లగించుచుండగా వాటితో కూడ ఒక వేళ గోధుమలను పెల్లగింతురు.” (మత్తయి 13:28, 29) అని ప్రత్యుత్తరమిచ్చెను. సువార్తయను వల మంచి చేపలను,చెడ్డ చేపలను కూడా పట్టును. తనవారెవరో ప్రభువుకు మాత్రమే తెలియును. CChTel 149.1

    దేవునితో వినయముగా నడుచుట మన వ్యక్తిగతమగు విధియైయున్నది. విపరీతమైన నూతన వర్తమానమును మనము వెదకరాదు. వెలుగులో నడుచుటకు ప్రయత్నించుచున్న దైవ ప్రజలు బబులోనీయులని మనము తలంచరాదు. 12TT 362;CChTel 149.2

    సంఘమందు దుర్ణీతి యున్నను, ఆ చెడుగు లోకాంతము వరకు ఉండి తీరును. పాపము వలన నీతి తప్పి మలిన భూయిష్టమైన ప్రపంచమునకు ఈ అంత్యదినములలోని సంఘమువెలగై యుండవలెను. నీరసించి లోపభూయిష్టమైన గద్దింపు హెచ్చరిక, హితవు అవసరమై యున్న భూలోక సంఘముపైనే క్రీస్తు తన ఉత్తమ గౌరవమును క్రుమ్మరించును. మానవ, దైవ ప్రతినిధుల సహకారము ద్వారా యేసు తన కృపాకనికరములతో మానవ హృదయములపైపరిశోధనలు జరుపు ఒక కర్మాగారమై యున్నది. 22TT 355;CChTel 149.3

    దేవునికి ఒక ప్రత్యేక జనాంగమున్నది. అదియే లోకమునందు ఆయనకు గల సంఘము. అది అద్వితీయ సంఘము. దేవుని ధర్మశాస్త్రమును స్థిరపరచుటలోను గల సదుపాయములలో నిది యన్నింటికన్న అగ్రగణ్యమైనది. దేవునికి తానేర్పరుచుకొన్న ప్రతినిధులు కలరు. వీరే పగటి ఎర్రని ఎండను సహించి, భారము వహించి ప్రపంచమందుక్రీస్తు రాజ్యమును వృద్ధి చేయుటలో పరలోక కార్యకర్తలతో సహకరించుచు దేవునిచో నడపబడుచున్నారు. CChTel 149.4

    ఎన్నుకొనబడిన ఈ ప్రతినిధులతో మనము ఐక్యము కలిగి తుదకుఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చిన విశ్వాసమును, పరిశుద్ధుల ఓర్పును కలిగి యుండు పరిశుద్ధుల మధ్య నుందుము గాక!32TT 361, 362;CChTel 150.1