Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆధ్యాయము 64 - క్రీస్తు మన ప్రధాన యాజకుడు

    పరలోక గుడారములోని సేవను నిర్ధుష్టముగా గ్రహించుటయే మన వివ్వాసమునకుపునాది. 1Evangelism 221;CChTel 515.1

    పర్వతముపై తనకు చూపబడిన మాదిరి ననుసరించి మోషే భూలోక గుడారమును నిర్మించెను. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి. .. అర్పణలు, బలులు అర్పించబడుచున్నవి.” ఆ గుడారపు రెండు పరిశుద్ధ స్థలములు “పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు.” మన ప్రధాన యాజకుడగు క్రీస్తు “పరిశుద్దాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువేస్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై” యుండెనుÑ పరలోకమందలి దైవ మందిరము యోహానుకు దర్శనమందు చూపబడినపుడు అక్కడ ఆయన “సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుట” చూచెను. CChTel 515.2

    పరలోక గుడారమందలి మొదటి భాగమును చూచుటకు ప్రవక్తకు అనుమతి ఇయ్యబడెను. అక్కడ “ఏడు దీపములను” “సువర్ణ ధూపార్తి”ని చూచెను. ఇహలోక గుడారమందలి బంగారు దీప వృక్షము ధూపవేదిక వీనిని సూచించు చున్నవి. మరల “పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా” తెరవెనుక నున్న అతి పరిశుద్ధ స్థలమును చూచెను. ఇక్కడ “దేవుని నిబంధన మందరసము” ను ప్రవక్త వీక్షించెను. దైవ ధర్మ శాస్త్రము నుంచుటకు మోషే నిర్మించిన పవిత్రమగు మందసము దీనిని సూచించుచున్నది. పరలోకమందొక ఆలయమును చూచితినని యోహాను వచించుచున్నాడు. మన పక్షమున క్రీస్తు సేవ చేయుచున్న ఆలయము ప్రధానమయినది. మోషే కట్టిన గుడారము దీని యొక్క పోలిక మాత్రమే. CChTel 515.3

    రారాజు నివాస స్థానమయిన పరలోక మందిరమున “వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది వ్యక్తులు ఆయన యెదుట నిలచిరి”. ఈ మందిరము నిత్య సింహాసన మహిమతో నిండియున్నది. ఈ సింహాసనముకడ ధగధగ మెరయు దూతగణము, భక్తి భావముతో తమ ముఖముల కప్పుకొనెను. ఈ మందిర విస్తృతిని, వైభవమును లౌకికమైన ఏ భవంతియు చూపించజాలదు. అయినను పరలోక గుడారమును మానవుని రక్షణ కొరకు నిర్వహించబడు మహత్తర కార్యమును గూర్చిన ప్రముఖ సత్యములు భూలోక గుడారము అందలి సేవ ద్వారా బోధపర్చబడినవి. CChTel 515.4

    తన ఆరోహణానంతరము రక్షకుడు మన ప్రధాన యాజకునివలె తన పనిని ప్రారంభింపవలసి యుండెను. పౌలిట్లు చెప్పుచున్నాడు; “నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిహస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని యిప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించును. పరలోకాలయందు క్రీస్తు సేవలో రెండు భాగాలున్నవి. ఈ భాగములు కొంతకాలం పరిమితి కలిగి ప్రత్యేక స్థానము నాక్రమించినవి. అట్లే ఛాయారూపకమయిన సేవయందు కూడ అనుదిన సేవ, సాంవత్సరిక సేవ యను రెండు భాగములున్నవి. ఈ రెంటిలో నొక్కొక్క దానికి గుడారమందు ప్రత్యేక స్థలము ఏర్పాటుచేయబడినది. CChTel 516.1

    ఆరోహణమయిన పిమ్మట క్రీస్తు పశ్చాత్తాప పడిన పాపుల సమక్షమున తన రక్తమును పురస్కరించుకొని విజ్ఞాపన చేయుటకు దైవ సన్నిధానమున ప్రవేశించిన రీతిగా యాజకుడు కూడా అనుదినము పరిశుద్ధ స్థలమందు పాపి పక్షములన అర్పించబడిన జంతువు యొక్క రక్తమును ప్రోక్షించెను. CChTel 516.2

    క్రీస్తు రక్తము, పశ్చాత్తాపపడిన పాపిని ధర్మశాస్త్ర శిక్షనిధి నుండి తప్పింంచినను పాపమునది రూపుమాపజాలదు. తుది ప్రాయశ్చిత దినము వరకు గ్రంథమందుండును. కనుక ఛాయలో పాప పరిహారార్థపు బలి పశ్చాత్తాప పడిన వ్యక్తి పాపమును పరిహరించినది. కాని పాపము ప్రాయశ్చిత్తదినము వరకు గుడారమందుంచబడెను. CChTel 516.3

    ప్రతిఫలమిచ్చు ఆ మహాంతిమ దినమున “ఆగ్రంథములయందు వ్రాయబడియున్నవాటిని బట్టి తమ క్రియలు చొప్పున తీర్పు పొంద” వలసియున్నారు. అప్పుడు పాప ప్రాయశ్చిత్తము చెల్లించు క్రీస్తు రక్తముద్వారా పశ్చాత్తాపము పొందితే వారందరి పాపములు పరలోక గ్రంథములలో నుండి తుడిచివేయబడును. ఇట్లు ఆలయము పాపపు రికార్డు నుండి శుభ్రపర్చబడును. ఛాయారూపకమైన సేవలో ప్రాయశ్చిత్తమును నీ మహత్తర పాపములు తుడిచివేయబడుటయును సేవ ఇహ ముందు ప్రాయశ్చిత దిన సేవ ద్వారా సూచించబడినది. ప్రాయశ్చిత దినమనగా ఇహలోకాలయ పవిత్రీకరణ దినము. ఆలయమును అపవిత్రపరచిన పాపముల నిమిత్తము ప్రోక్షింపబడిన పాప పరిహారార్థ బలి రక్తముద్వారా ఆలయము పవిత్రపర్చబడెడిది. 2P P 356-358;CChTel 516.4

    మనము బాగుగా తెలిసికొనవలసిన విషయములను మనసు తెలసికొనకుండ చేయుటకు సాతానుడు అనుకమైన పన్నాగములు పన్నుచున్నాడు. ప్రాయశ్చిత్తార్థము చేయబడిన త్యాగమును గూర్చియు, సర్వశక్తి గల మధ్యవర్తిని గూర్చియు మనకు జ్ఞాపకము చేయు మహత్తర సత్యములను ప్రధాన వంచకుడు ఏవగించును. యేసును గూర్చియు ఆయన సత్యమును గూర్చియు మనుష్యులు తలంచకుండునట్లు చేయుటపయి తన జయము అనుకొని యున్నదని సాతానుకు విదితమే. CChTel 517.1

    గాయపర్చబడిన హస్తములను, శరీరమును చూపుచు క్రీస్తు వారి పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. తన అనుచర బృందమునకాయన ఇట్లు చెప్పుచున్నాడు. “నా కృప నీకు చాలును” “నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నాకాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సుళువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి.” కనుక ఎవరును తమ లోపములు అనివార్యములని భావించరాదు. వానిని జయించుటకు దేవుడు విశ్వాసము కృపను ఇచ్చును. CChTel 517.2

    ఇప్పుడు మనము మహా ప్రాయశ్చిత్త దినమందు నివసించు చున్నాము. ఛాయరూపకసేవయందు ఇశ్రాయేలీయుల పక్షమున ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తము చేయుచుండగా తన ప్రజల నుండి దూరపర్చబడ కుండునట్లు ప్రజలందరు పాప పశ్చాత్తాపము పొంది ప్రభువు సన్నిధిని తమ్మును తాము తగ్గించుకొనవలసి యుండిరి. ఇట్లు, వారు తమ ఆత్మలను నలగగొట్టు కొనిరి. అట్లే తమ నామములు జీవగ్రంథములయందుండవలెనని కాంక్షించు వారందరు కృపకాల స్వల్ప వ్యవధిలో పాపము నిమిత్తము దుఃఖించి నిజమైన పశ్చాత్తాపము పొందుట ద్వారా తమ ఆత్మలను దేవుని ముందు నలుగగొట్టుకొనవలెను, హృదయములను గాఢముగాను, నమ్మకముగాను పరీక్షించుకొనవలెను. అనేక క్రైస్తవులలో కాననగు నిర్లక్ష్యభావము వ్యర్థ విషయాసక్తమగు స్వభావమును విసర్జించుడి. ఆధిపత్యము కొరకు పోరాడుచున్న దుర్గుణమలును జయించవలెనని కోరు వారు బలముగా పోరవలసి యున్నారు. సిద్దపడుట యనునది వ్యక్తిగత కృషి. మనము సామూహికముగా రక్షించబడము. ఒకని పవిత్ర, భక్తి భావము మరియొకని అవగుణములను తీసివేయజాలవు. దేవుని ముందు అన్ని జాతుల ప్రజలు తీర్పుకు నిలువబడవలసి యున్నారు. ప్రతి వ్యక్తి విషయము ఇక భూమిపై మరియొకడు లేడో యన్నట్లు ప్రభువు అతి శ్రద్ధగా పరిశీలించును. ప్రతి వ్యక్తి పరీక్షించబడును. ప్రతి వ్యక్తి మచ్చయై నను, ముడతయై నను లేక యుండవలెను. CChTel 517.3

    ప్రాయశ్చిత్తముయొక్క తుది ఘట్టములు గంభీరములైనవి. అందలి విషయములు అతి ప్రాముఖ్యములు. పరలోక మందిరందిప్పుడు తీర్పు జరుగుచున్నది. ఈ పని అనేక సంవత్సరముల నుండి జరుగుచున్నది. త్వరలో జీవించియున్న వారిని గూర్చిన తీర్పు ఆరంభమగును. అది ఎంత త్వరలో వచ్చునో యెవనికిని తెలియదు. దేవుని భయంకర సన్నిధిని మన జీవితములు చర్చకు వచ్చును. ఈ సమయమందు అన్నింటికన్న ముఖ్యముగా “మెళుకువగా నుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు” అని రక్షకుడు చెప్పిన మాటలను అనుసరించ వలెను. CChTel 518.1

    పరిశీలనాతీర్పు ముగియునప్పుడు ప్రతివారును మరణముకో జీవమునకో నిర్ణయించ బడెదరు. మేఘములతో ప్రభువు రాకకు పూర్వము కృపకాలము ముగియును. ప్రకటనలో ఆ కాలము కొరకు చూచుచు, క్రీస్తిట్లు వచించుచున్నాడు.” అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును. అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండును. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండును. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండును. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను (సిద్దపరచిన) జీతము నాయొద్ద ఉన్నది.” నీతి మంతులును దుర్మార్గులును లోకమంందు నివసించుచునే యుందురు. మనుష్యులు, మొక్కలు నాటుకొనుచు, గృహములు కట్టుకొనుచు, తినచు, త్రాగుచు ఉందురు. పరలోకమందు తిరుగులేని తీర్పు తమ విషయమై చేయబడినదని వారు గుర్తించరు. CChTel 518.2

    మధ్యరాత్రి దొంగవలె నిశ్చబ్దముగను, తెలియని విధముగను ఏర్పర్చబడిన ఘడియ ఏతెంచును. ఈ ఘడియ ప్రతి మానవుని భావిని నిర్ణయించుచు పాప మానవుల కీయబడిన కృపను వారి యొద్ద నుండి తీసివేయును. 3GO 488-491. CChTel 518.3