Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    “విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే”

    గృహమందును, సంఘమందును సేవా స్వభావమును ప్రదర్శించవలెను. లోక సంబంధమగు పనిపాట్లు చేసికొనుటకు ఆరు దినమలును మన కనుగ్రహించిన ప్రభువే ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచి తన కొరకు ప్రత్యేకపరచెను. ఆయన సేవార్థము తమ్మును తాము సమర్పించుకొను వారందరిని ప్రత్యేకపరచెను. ఆయన సేవార్థము తమ్మునుతాము సమర్పించుకొను వారందరిని ప్రత్యేక విధముగా ఆయన ఈ దినమున ఆశీర్వదించును. CChTel 76.4

    పరలోకమంతయు సబ్బాతు నాచరించు చున్నది; అజాగ్రత్తగాగాని ఏమియు పనిలేకుండగా గాని ఈ దినమున మన రక్షకుడగు క్రీస్తును, దేవుని మనము కలిసికొనవలసినవారము గనుక మనము మెళుకువగా నుండవలెను. విశ్వాసముద్వారా మనమాయనకు చూడవచ్చు. ప్రతి ఆత్మను ఉజ్జీవింపజేసి ఆశీర్వదించవలెనని ఆయన కోరిక. 116T 361,362;CChTel 77.1

    వ్యాధి బాధితులను ఆదుకొనవలెనని దైవకృపాదేశము; వారికి సుఖమునిచ్చుటకు చేయబడవలసినవని తప్పనిసరి కార్యమేగాని సబ్బాతు అతిక్రమణకాదు. అనవసరమగు పనులన్నియు నిలిపివేయబడవలెను. సిద్దబాటు దినమున చేయబడవలసిన చిన్న చిన్న పనులను అనేకులు అశ్రద్ద వలన సబ్బాతు ఆరంభము వరకు ఉంచెదరు. ఇది మంచిది కాదు. పరిశుద్ద సమయారంభము వరకు చేయబడక మిగిలియున్న ఏపని నైనను సబ్బాతు ముగియు వరకునిలిపివేయవలెను. 122TT 184,185;CChTel 77.2

    సబ్బాతునాడు వంటలు చేయుట ఆపబడవలసియున్నను చల్లని భోజనము తినవలసిన అగత్యము లేదు. చలికాలమందు ముందటి దినమున తయారుచేయబడిన ఆహారము వేడిచేయబడవచ్చును. భోజనము సామాన్యమైనను రుచికరముగను, ఆకర్షకముగను ఉండవలెను. అనుదినము ఉండని విధముగా కుటుంబమునకే దేనిఒక ప్రత్యేక వంటకమును తయారుచేయుడి. విధేయులకు వాగ్దానము చేయబడిన ఆశీస్సులను కోరినచో మనము సబ్బాతును కడు జాగృతితో కాపాడవలెను. నిలుపుచేయుటకు వీలున్నప్పటికిని తరుచు మనము ఈ దినమున ప్రయాణము చేయుచున్నామనినా భయము. సబ్బాతాచరణ విషయము దేవుడిచ్చిన వెలుగు ప్రకారము ఈ దినమున పడవలలోను కారులలోనుప్రయాణించుటను గూర్చి మనము కడు జాగరూకత కలిగి యుండవలెను. ఈ విషయములలో పిల్లలకును, యువజనులకును మనము మంచి ఆదర్శమును చూపవలెను. మన సహాయము అవసరమగు సంఘములకు వెళ్ళుటకు సబ్బాతు దినమున ప్రయాణము చేయుట అగత్యమై యుండవచ్చును; కాని సాధ్యమైనంత వరకుటెకెట్టును సంపాదించుకొనుట మున్నగు ఏర్పాట్లన్నింటిని ముందుగానే చేసికొనవలెను. ఒక చోటికి ప్రయాణమై పోవునపుడు సాధ్యమైనంతవరకు ఆ స్థలమును సబ్బాతు దినమున చేరకుండుటకు ప్రయత్నించవలెను. CChTel 77.3

    సబ్బాతు దినమున ప్రయాణము ఆగత్యమైనపుడు మన ధ్యానమును ప్రాపంచిక సంగతులవైపుకు త్రిప్పువారి పొత్తును తప్పించుటకు ప్రయత్నించవలెను. మనము మన ధ్యాన మును దేవునియందు నిలిపి ఆయనతో గోష్టి జరుపవలెను. అవకాశము దొరికినపుడెల్ల ఇతరులతో సత్యము విషయము ముచ్చటించవలెను. బాధితుల బాధ మాన్పుటకును, అవసరములోనున్న వారికి సహాయము చేయుటకును మనము సర్వదా సంసిద్ధముగా నుండవలెను. దేవుడు మనకిచ్చిన జ్ఞాన వివేకములను బట్టి సందర్భములతో నుపయోగింపవలెనని ఆయన అభిలాష. మనము వ్యాపార విషయములను గాని లోకవార్తలను గాని చర్చించరాదు. అన్ని కాలములోను స్థలములోను ఆయనకు సబ్బాతాచరణద్వారా నమ్మకముగా నున్నామని మనము నిరూపించవలసినదిగా దేవుడు ఆదేశించుచున్నాడు. 136T 357-360;CChTel 77.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents