Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    “సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి”

    ఆహారము విషయములో ఈ విధానమును అవలంభించవలెనని మనము ఖరాఖండిగా చెప్పజాలము. కాని పండ్లు, గింజలు, కాయలు సమృద్ధిగా నుండు దేశములో దైవ ప్రజలకు మాంసాహారము మంచిది కాదని మనము చెప్పగలము. మాంసాహారము మృగ స్వభావము కలిగించి ప్రతి వ్యక్తికి చూపవలసిన ప్రేమను స్త్రీ పురుషులలో నుండి తీసివేసి శరీర ఉన్నత శక్తులను తుచ్ఛ శరీరేచ్చలు స్వాధీనపరచుకొనునట్లు చేయునని నేనుపదేశించ బడితిని. మాంసాహారమెప్పుడైన ఆరోగ్యదాయకముగా నుండియున్నను ఇప్పుడు మాత్రము అది క్షేమకరము కాదు. మాంసాహారము వలన క్యాన్సరు, కంతులు, ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుచున్నవి. CChTel 429.2

    మాంసాహారము సంఘ సభ్యత్వమునకొక పరీక్షగా పరిగణించరాదు. కాని మాంసమును భుజించు సంఘస్తులు ఇతరులపై ప్రదర్శించు పలుకుబడిని మనము పరిగణించవలెను. దేవుని రాయబారులమగు మనము “కాబట్టి మీరు భోజనము చేసినను, పాపము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” (1 కొరింథీ. 10:3) అని చెప్పవలదా? ఆహారదురేచ్ఛకు విరోధముగా మనము సాక్ష్యమీయవలదా? మానవులకీయబడిన గంభీర సత్యములను ప్రకటించుచున్న ఏ సువార్త సేవకులయినను ఐగుప్తు మాంసపాత్రలకు తిరిగి వచ్చుట ద్వారా ఆ దర్శనమును చూపుదురా? దేవుని ధననిధిలోని దశమ బాగము ద్వారా పోషించబడు వారు తిండిబోతుతనము వలన తమ రక్త నాళముల గుండ ప్రవహించు జీవదాయక విద్యుత్తును విషపూరితము చేయుటకు పూనుకొందురా? దేవుడు తమ కిచ్చిన వెలుగును, హెచ్చరికలను వారు అలక్ష్యము చేతురా? కృపయందు పెరుగుటకు సత్స్వభావ సాధనకు శరీరారోగ్యము అవసరమని పరిగణించవలెను. అన్నకోశమును గూర్చి శ్రద్ధ వహించక పోయినచో నైతిక శీల నిర్మాణమునకు ఆటంకము కలుగును. మస్తిష్కము, నరములు, అన్నకోశముపై సహవేదన చూపును. లోపభూయిష్టమైన భోజన సానమలు దురాలోచనలకు దుష్క్రియలకు దారితీయును. CChTel 429.3

    ఇప్పుడెల్లరు పరీక్షించబడుచున్నారు. మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందితిమి. మనలను క్రుంగదీసి మనముండకూడని విధముగా మనలను తయారుచేయు సమస్త నుండి విడిపించుకొనుటలో మన భాగమును మనము నిర్వహించినచో మన కర్తయగు క్రీస్తులోనికి పెరుకుటను మనకు శక్తి అనుగ్రహించబడును. మనము దేవుని రక్షణను చూతుము. CChTel 430.1

    ఆరోగ్య జీవిత సూత్రములను గ్రహించినపుడే అపసవ్య ఆహారము యొక్క ఫలితములను మనము పూర్తిగా గుర్తించగలము. తమ తప్పిదములను గ్రహించిన పిదప తమ అలవాటులను మార్చుకొను ధైర్యము కల కొందరు ఈ సంస్కరణ ప్రక్రియకు పోరాటము, ఓపిక, అవసరమని గుర్తింతురు. కాని సరిjైున అభిరుచి ఒక సారి ఏర్పడినపుడు కొంత కాలము క్రిందట తాము హానికరము కాదని తలంచిన ఆహారము క్రమ క్రమముగా అజీర్తి తదితర వ్యాధులకు పునాది వేయునని వారు గుర్తింతురు. CChTel 430.2

    తల్లిదండ్రులారా, మెలకువగా నుండి ప్రార్థించుడి. ప్రతి విధమయిన అమితత్వము విషయము జాగ్రత్తగా నుండుడి. వాస్తవిక ఆరోగ్య సంస్కరణ సూత్రములను మీ పిల్లలకు నేర్పుడి. ఆరోగ్యమును కాపాడు కొనుటకు ఏమి విడిచిపెట్టవలెనో వారికి నేర్పించుడి. అవిధేయులపై దేవుని కోపము రేగియున్నది. ఎక్కడ చూచినను నేరములు, పాపములు దురాచారములే గోచరించుచున్నవి. దుష్టుల స్నేహము పట్టకుండ మనము మన పిల్లలను కాపాడవలెను. CChTel 430.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents