Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విడుదల నపేక్షించు వారికి జయము

    నాకు దైవ ప్రజలు చూపబడిరి. వారు బలవత్తరముగా కదల్చబడుట నేను చూచి కొందరు బలవత్తర విశ్వాసముతో బాధాసంకలిత స్వరములతో దేవుని యెదుట విజ్ఞాపన చేయుచున్నారు. CChTel 501.4

    దు:ఖించి విజ్ఞాపనచేయు ఈ పనిలో కొందరు పాల్గొనకుండుట నేను చూచితిని. వారు అలక్ష్యస్వభావులై లెక్కలేనట్లున్నారు. తమ చుట్టు వున్న చీకటిని వారు ప్రతిఘంటించుటలేదు. అది వారిని దట్టమైన మేఘము వలె ఆవరించినది. దేవదూతలు వీరిని విడిచిపెట్టిరి. తమ శక్తి కొలది దుష్ట దూతలను ప్రతిఘటించుచు పట్టుదలతో దేవుని పిలచుట ద్వారా తమకు తాము సాయము చేసికొనుచున్న వారికి సహాయము చేయుటకు వీరు హుటాహుటిగా వెళ్ళుట నేను చూచితిని. తమకు తాము సాయము చేసికొన యత్నించని వారిని దేవదూతలు విడిచిపోయిరి. వారు నాకు కనబడలేదు. ప్రార్థించు ఈ ప్రజలు తమ విజ్ఞాపనలను కొనసాగించగా వారి హృదయములకు ప్రోత్సాహమిచ్చి వారికి ముఖప్రకాశము కలిగించుటకు గాను కొన్నిసార్లు క్రీస్తు కడ నుండి కాంతి కిరణము వారి యొద్దకు వచ్చుట చూచితిని. CChTel 502.1

    నేను చూచిన కదిలింపుకు భావమేమని అడిగితిని. లౌదొకియ సంఘస్థులకు సత్య సాక్షియొద్ద నుండి వచ్చు తిన్నని సాక్ష్యము వలన ఇది సంభవించునని నాకు చూపబడెను. పొందు వారి హృదయముపై ఇది తన ప్రభావమును చూపి పది యాజ్ఞలను ఘనపరచుట కా వ్యక్తులను నడిపి సూటియై న సత్యమును అనుగ్రహించును. కొందరీ సూటియై న సాక్ష్యమును సహించరు. దానిని వారు ప్రతికూలించెదరు. ఇది దైవ ప్రజలలో కదిలింపును కలుగజేయును. CChTel 502.2

    సత్యసాక్షియొక్క సాక్ష్యము సగము కూడా అనుసరించబడుట లేదు. సంఘ సంక్షేమమున కాధారమైన గంభీర సాక్ష్యము చులకన చేయబడినది లేక సంపూర్తిగా అలక్ష్యము చేయబడినది. ఈ సాక్ష్యము గాఢమైన పశ్చాతత్తాపమునకు దారితీయవలెను. దానిని అంగీకరించు వారందరు దానికి విధేయులై పవిత్రపరుచబడెదరు. CChTel 502.3

    దేవదూత యిట్లు నుడివెను. వినుము ఆ చిర కాలములో ఒక స్వరము వినబడెను. అనేక సంగీత వాద్యములు ఏకస్థమగుటచే ఉప్పతిల్లు మధుర శ్రావ్య సంగీతమువలె నున్నదా ధ్వని. నేను విన్న ఏ సంగీతముకన్నా ఆ సంగీతము మధురముగ నున్నది. అది, కృప, కారుణ్యముతో నిండి సమున్నతమైన పరిశుద్ధమైన ఆనందమును కలిగించు చున్నది. అది నా యావచ్ఛరీరమునకు పులకరింపు కలిగించునది. దేవదూత చూడము అనెను. బల ముగా కదిలించబడిన సమూహము పైకి నా దృష్టి మరల్చబడినది. ముందు ఏడ్చుచు బాధాసంకలిత స్వభావముతో ప్రార్థించుచున్నట్లు నేను చూచిన సమూహము నాకు చూపబడెను. వారి చుట్టునున్న రక్షక దూతల సమూహము ఇనుమడిరచినది. కవచముతో వారా పాదమస్తకము కప్పబడిరి. వారు ఒక సైనిక సముదాయమువలె క్రమబద్దముగా నడిచిరి. తాము పొల్గొన్న భయంకర యుద్ధమును గూర్చి తామనుభవించిన బాధలను గూర్చి వారి ముఖసీమలు వ్యక్తము చేసినవి. అంత:కరణమైన బాధల వ్యక్తము చేసిన ముఖసీమలు ఇప్పుడు పరలోక మహిమతో ప్రతిజ్వలించినవి. వారు జయమును సాధించిరి. అది వారికి ప్రగాఢమైన కృతజ్ఞత, పరిశుద్ధమైన పవిత్రమైన ఆనందము కలిగించినది. CChTel 502.4

    ఈ సమూహము తరిగినది. ఇందు కొందరు కదిలించబడి విడువబడిరి (ప్రకటన 3. 15`17) జయము, రక్షణ కొరకు పట్టుదలతో విజ్ఞాపన చేసి దాని కొరకు బాధపడిన వారితో కలియని యీ అశ్రద్ధాపరులు, అలక్ష్య స్వభావులు రక్షణను పొందలేదు. కనుక వారు చీకటి యందు విడువబడిరి. అయితే వారి స్థానములు సత్యము నంగీకరించి సంఘమునందు ప్రవేశించిన వారిచే వెంటనే ఆక్రమించిబడినవి. దుష్టదూతలు వీరి చుట్టు కూడ మూగిరి. కాని వీరిని లొంగదీయుటకు వారికి శక్తి లేకపోయెను. (ఎఫెసీ 6. 12`18). CChTel 503.1

    కవచము ధరించిన వారు గొప్ప శక్తితో సత్యమును బోధించుట నేను వింటిని. ఇది గొప్ప ఫలితములు కగిగించినది. బంధించబడిన వారిని నేను చూచితిని. కొందరు భార్యలు భర్తలచే బంధించబడిరి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులచే బంధించబడిరి. సత్యమును వినకుండ అడ్డగించబడిన యదార్థ హృదయులు ఇప్పుడు ఆత్రుతగా సత్యమునంగీకరించిరి. బంధువుల వలని భయమంతయు పోయినది. వారికి సత్యమే ఉన్నతమైనదయ్యెను. అది జీవితముకన్న ప్రియమును, ప్రశస్తమునై యున్నది. సత్యము కొరకు వారు ఆకలిదప్పులు గొని యున్నారు. ఇట్టి బ్రహ్మాండమైన మార్పుకు కారణమేమని నేను ఆడిగితిని. ఒక దూత ఇట్లు సమాధానమిచ్చెను. ప్రభుని సన్నిధానము నుండి తెప్పరిల్ల చేయుటకు వచ్చు కడవరి వర్షము, మూడవ దూత వర్తమానమే దీనికి కారణము. CChTel 503.2

    ఎన్నుకొనబడిన వీరికి గొప్ప శక్తి కలదు. చూడుము అని దూత పలికెను. అప్పుడు నా దృష్టి దుర్మార్గులు లేక అవిశ్వాసుల పైకి పోయినది. వారు కోపోద్రిక్తులై యున్నారు. దైవ ప్రజల ఆసక్తి, వారికి కోపము పుట్టించినవి. ఎక్కడ చూచినను గలిబిలియే. దేవుని శక్తి, వెలుగు గల ఈ సమూహమునకు కీడు చేయుటకు సన్నాహములు చేయబడుట నేను చూచితిని. వారి చుట్టునున్న చీకటి చిక్కబడినది. అయిన వారు దేవుని ఆమోదమును పొంది ఆయన యందు నమ్మిక యుంచి అచంచలముగా నిలచిరి. వారు తికమక పడుట నేను చూచితిని. ఈ మీదట వారు పట్టుదలతో దేవునికి మొర్రపెట్టుట నేను చూచితిని. ఆహోరాత్రములు వారి మొర ఆగలేదు. (లూకా 18. 7,8, ప్రకటన 14. 14,15 చూడుడి)CChTel 503.3

    ఈ మాటలు నాకు వినబడెను. ఓ దేవా నీ చిత్తము నెరవేరుగాక. నీ నామమునకు మహిమ కలుగుచో నీ ప్రజలకు తప్పించుకొను మార్గము చూపుము. మా చుట్టు వున్న అన్యుల నుండి మమ్మును విడిపించుము. వారు మాకు మరణము విధించిరి. అయితే నీ హస్తము మాకు రక్షణ నీయగలదు. ఈ మాటలే నాకు జ్ఞాపకము వచ్చుచున్నవి. అందరు తమ అయోగ్యతను గుర్తించినట్లుగ దైవ చిత్తమునకు పూర్తిగా లొంగినట్లు అగపడినది. అయినను మినాయింపు లేకుండా అందరు యాకోబు వలె విజ్ఞాపన చేయుచు విడుదల కొరకు పోరాడు చుండిరి. CChTel 504.1

    వారు దీనముగా మొరపెట్టగా సానుభూతితో దూతలు వారిని విడిపించుటకు వెళ్ళి యుండెడి వారే. ఒక పొడుగైన దూతాధిపతి వారిని అడ్డగించెను. ఆయనట్లు చెప్పెను. దైవ చిత్తమింకను నెరవేరలేదు. వారీ పాత్రలోనిది త్రాగవలెను. బాప్తీస్మముతో వారు బాప్తీస్మము పొందవలెను. CChTel 504.2

    అనతి కాలములో దేవుని స్వరమును వింటిని. అది భూమ్యాకాశములను వణికించెను. (యావేలు 3. 16, హెబ్రీ 12. 26, ప్రకటన 16. 7 చూడుడి) ఒక మహా భూకంపము జరిగెను. భవనములు కదిలి అటునిటు కూలినవి. అప్పుడు నేను విజయ ధ్యానము వింటిని అది గంభీరముగను, సంగీతము వలెను, స్పష్టముగను ఉండెను. స్వల్ప కాలము క్రిందట విచారగ్రస్తులై బెగడుచు చెరలో వున్న యీ సమూహమును నేను చూచితిని. వారి చెర అంతమయినది. వారిపై నొక మహిమాయుతమైన వెలుగు ప్రకాశించినది. అప్పుడు వారెంత సుందరముగా నున్నారు? బడలిక, విచారములు మటుమాయమైనవి. ప్రతి ముఖములో ఆరోగ్యము సురూపములు గోచరించుచున్నవి. తమ చుట్టు నున్న తమ అన్యులు శత్రువులు మృతులవలె పడియున్నారు. విముక్తులు చేయబడిన ఆ పరిశుద్ధులపై ప్రకాశించు వెలుగుకు వారు తాళజాలకుండిరి. CChTel 504.3

    ఈ వెలుగు, మహిమ యేసు మేఘములలో కనబడు వరకు వారిపై నుండెను. పరీక్షించబడిన యీ విశ్వాసుల సమూహము క్షణములో రెప్పపాటు కాలములో మహిమ నుండి అత్యధిక మహిమకు మార్చబడినది. సమాధులు తెరువబడినవి. పరిశుద్ధులు బయటికి వచ్చిరి. వారు అమర్త్యత్వము ధరించుకొని ఇట్లు కేకలు వేసిరి: “మరణముపై , సమాధిపై జలయము” మధ్యకాశములో ప్రభువును ఎదుర్కొనుటకు జీవించిన నీతిమంతులతో కలసి వారు ఎత్తబడిరి. ప్రతి అమర్త్యుని నోటి నుండి మహిమ, విజయము అను సంగీతపు కేకలు చెలరేగినవి. 3IT 179-184;CChTel 505.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents