Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దాసులకు దాసుడు

    మేడగదిలో ప్రవేశించు తరి శిష్యుల హృదయములు ద్వేషభావముతో నిండియుండెను. తక్కిన శిష్యులను ఒత్తిగించి యూదా క్రీస్తుని ఎడమ ప్రక్కన కూర్చుండెను. కుడి ప్రక్క యోహాను కూర్చుండెను. ఏదైన అత్యున్నత స్థానమున్నచో దాని నాక్రమించవలెనని యూదా నిశ్చయించెను. ఆ స్థానము క్రీస్తు ప్రక్కనే యని అతడు అనుకొనెను. యూదా విశ్వాస ఘాతకుడు. CChTel 245.3

    మరియొక భేదాభిప్రాయ కారణము రేకెత్తెను. విందుకు వచ్చిన అతిథుల పాదములను ఒక సేవకుడు కడుగుట పరిపాటి. ఈ సమయమందు ఈ ఆచరణకు సన్నాహములు కావించబడినవి. పాదములు కడుగుటకు గంగాళము, పళ్లెము, తువాలు, సిద్ధముగానున్నవి. కాని సేవకుడు లేడు. దానిని నిర్వహించ వలసిన భారము శిష్యుల పాలబడినది. కాని శిష్యులలో ప్రతి వ్యక్తి సేవకుని పని చేఉను అను స్వాభిమాన గర్వముతో తిష్టవేసికొని కూర్చుండెను. మాదికాదులే యన్నట్లు అందరును అలక్ష్యముచూపిరి. తాము వహించిన మౌనము వలన అణకువను ప్రదర్శించుటకు వీరు నిరాకరించిరి. ఒకరి కొకరు పరిచర్యచేసికొనుటకు శిష్యులు ప్రయత్నించలేదు. వారేమి చేతురో చూడవలెనని క్రీస్తుకొంతసేపు ఊరకుండెను. అప్పుడు తన బల్లయొద్ద నుండి ఆయన లేచెను. తన పైవస్త్రములను దూరముగా పెట్టి ఒక తువాలు తీసికొని నడుము చిగించుకొనెను. శిష్యులు ఆశ్చర్యచకితులై చూడనారంభించిరి. ఏమి జరుగునాయని నిశ్శబ్దముగా కనిపెట్టుచుండిరి. “అంతట పళ్లెములో నీళ్లుపోసి శిష్యుల పాదుములు కడగుటకును తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను”. ఈ చర్య శిష్యులకు కనువిప్పు కలిగించినది. అవమానము, సిగ్గు వారి హృదయములను పెనవేసికొనెను. లోలోన గద్దించనడినట్లు వారు గ్రహించిరి. తాము క్రొత్త వెలుగులో నున్నట్లు వారు గుర్తించిరి. CChTel 246.1

    తన శిష్యులపట్ల క్రీస్తిట్లు తన ప్రేమను వెలువరించెను. స్వార్థముతో నిండిన వారి స్వభావము ఆనను విచారముతోనింపెను. అయితే ఆ బెడదను గూర్చి ఆయన వారితో వివాదము పెట్టుకొనలేదు. దీనికి ప్రతిగా వారెన్నడును మరువరాని మాదిరిని వారికిచ్చెను. వారి పట్ల ఆయనకున్న ప్రేమ అంత తొందరగా చలించి అంతరించదు. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెనని ఆయనకు ఎరుకయే. తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు ఆయన యొద్దకు వెళ్లెదననియు ఆయనకు అవగతమే. తన దైవత్వమును ఆయన సంపూర్ణముగా గుర్తించెను. అఇనను తన రాజకిరీటమును వస్త్రములను ఒక ప్రక్క పెట్టి సేవకుని రూపము ధరించెను. సేవకునివలె నడుము బిగించుకొని సేవకుని పాత్ర నిర్వహించుట భూమి పై ఆయన చేసిన తుది కార్యములలో నొకటి. CChTel 246.2

    ఆయన వారి పాదములను కడిగినను ఈ చర్య తన ప్రతిష్ఠకు కించతై నను భంగము కలిగించలేదను విషయమును తన శిష్యులు గుర్తించవలెనని క్రీస్తు అభిలషించెను. “బోధకుడనియు, ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారుÑ నేను మీకు బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే”. ఆయన యింత నిరవధికముగా అధికుడు గనుక ఆయాచారమునకు పవిత్రతను ప్రాముఖ్యతను ఆరోపించ గలిగెను. ఎవరును క్రీస్తు పొంది నందటి ఔన్నత్యమును పొందలేదు. అయినను ఆన తన్నుతాను తగ్గించుకొని సేవకుడు చేయవలసిన కార్యమును నిర్వహించెను. స్వాభావికమై హృదయములో పీఠము వేసికొని స్వప్రయోజనమును బలపరచు స్వార్థప్రియత్వము వలన తన రపజలు అపమార్గము నవలంభించకుండునట్లు వినయాచారమునదు క్రీస్తు వారికి మాదిరి చూపెను. ఈ మహత్తరాంశమును మానవ హస్తములందుంచుట కాయనకు మనస్సు ఒప్పలేదు. అది యంత ప్రాముఖ్యమైనదిగా ఆయన భావించెను! కనుక దేవునితో సమానుడైన ఆయనే తన శిష్యులకు సేవకునివలె ఉపచర్యచేసెను. అత్యున్నత స్థానము కొరకు వారు పోటీపడుచుండగా, ప్రతి మోకాలు ఎవరి ముందు వంగవలెనో, మహిమ ప్రభావములుగల దేవదూతలు ఎవనికి సేవ చేయుట ఘనముగా నెంతురో ఆయన తన్ను ప్రభువాయని పిలచిన వారి పాదములను కడుగుటకు వంగెను. తన్ను పట్టియియ్యనున్నవాని పాదములను కూడ ఆన కడిగెను. CChTel 246.3

    శిష్యుల పాదములు కడిగినమీదట “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” అని ఆన వచించెను. (యోహాను 13:15). ఈ మాటలలో ఆతిథ్యము కలిగి యుండవలసినదని మాత్రమే క్రీస్తు వారిని ఆదేశించుట లేదు. ప్రయాణము వలన ఏర్పడిన ధూళిని పోగొట్టుటకు అతిథుల పాదములను కడగవలెననుటకన్న ఒక మతాచారమును స్థాపించుచున్నాడు. మన ప్రభువాచరించుటద్వారా ఈ వినయాచారము ఒక ప్రతిష్ఠితాచారమాయెను. ఆయన నేర్పించిన వినయ పరిచర్య పాఠములను వారు జ్ఞాపకముంచుకొనుటకుగాను శిష్యులు దీనిని ఆచరించవలసి యుండిరి. CChTel 247.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents