Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సముచిత తీర్మానము చేయుటకు ప్రార్థన వేదపఠనము అవసరము

    వివాహము దైవ స్థాపితము. అది యొక పవిత్ర నిర్ణయము. స్వార్థ స్వభావముతో వివాహబంధమందు ప్రవేశించరాదు. వివాహమాడనభిలషించువారు దాని ప్రాముఖ్యతను ప్రార్థన పూర్వకముగా యోచించి దైవచిత్తానుసారము తాము సముచిత మార్గము నవలంబించుచున్నామో లేదో యని దేవుని ఉపదేశమును శ్రద్ధగా పఠించవలెను. లేఖనములలో నీయబడిన ఉపదేశముల ప్రకారం చేయబడిన వివాహ కార్యమునందు దేవుడానందించును. CChTel 256.4

    వివాహము ప్రశాంతముగను వివేకముగను ఆలోచించవలసిన అంశము. మనుష్యులకు బైబిలు యొక్క సలహా ఎన్నటికన్న వివాహమునకు ముందు ఎక్కువ అవసరం. కాని ఈ విషయమందు భావోద్రేకములే మార్గదర్శకులుగా ప్రబలి అనేక సందర్భములలో మన్మధావస్త స్మారకమైన అభిప్రాయ నాయకత్వము వహించి నాశనమునకు నడుపుచున్నది. ఈ విషయమున యువజనులు తమ ఆజ్ఞతను ప్రదర్శించుచున్నారు. వారిచ్చటనే కారణ సహిత సలహాలకు తావీయ నిరాకరించుచున్నారు. వివాహ సమస్య వారిని ముగ్దులను చేయుచున్నది. వారు తమ్మును తాము దేవుని కప్పగించుకొనుట లేదు. వారి మానసిక శక్తులు ఉద్రిక్త పరుచు బడుచున్నవి. అందుచే నితరులెవరైనా తమ యేర్పాటులను పాడుచేయుదురేమో యని భయపడినట్లు వారు గూఢముగా వ్యవహరించెదరు. CChTel 256.5

    అనేకులు అపాయకరములైన రేవులలో ప్రయాణించుచున్నారు. వారికి ఒక నావికుడు అవసరం. కాని వారికి అత్యవసరమైన సహాయమును వారు గైకొనక యెకసక్కెములాడు చున్నారు. తమ నావను నడిపించుటకు తామే సమర్థులమని వారి పరిభావన. మరుగున నున్న బండకు తమ నౌక కట్టుకొని పగిలిపోనున్నదనియు తమ విశ్వాసానందములు మటుమాయమగుననియు వారెరుగరు. CChTel 257.1

    వారు (వేద) వాక్యమును శ్రద్ధగా పఠించుకున్నచో గొప్ప తప్పిదములు చేయుట తధ్యము. ఈ తప్పిదములు తమ యొక్కయు ఇతరుల యొక్కయు ప్రస్తుత, భావి జీవితానందమును పాడుచేయును. వివాహమాడదలంచుటకు పూర్వము రెండు మారులు ప్రార్థించునలవాటు గల స్త్రీ పురుషులు వివాహకార్య యత్నములలో వున్నప్పుడు నాలుగుసార్లు ప్రార్థించవలెను. వివాహము ఈ ప్రపంచమందును భావి ప్రపంచమందును మీ జీవితమందు గొప్ప మార్పులు కలిగించు ఒక విషయము. CChTel 257.2

    నేడు జరుగుచున్న వివాహములలో నెక్కువ భాగము అవి జరుగుచున్న విధమును బట్టి చూడగా అంత్య దిన సూచనలలో వివాహమొకటిగా పరిణమించుచున్నట్లు అగపడుచున్నది. స్త్రీ పురుషుల మంకుతనము, గర్వము ఎంతగా నున్నదనగా అసలు ఈ విషయమందు దైవ ప్రసక్తియే లేనట్లుగా గనపడుచున్నది. ఈ గంభీరమైన, ప్రాముఖ్యమైన విషయ మందు మతము నిర్వహించవలసిన పాత్ర యేమియు లేదన్నట్లు మతమొక ప్రక్కకు నెట్టి వేయబడుచుననది. CChTel 257.3