Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దిక్కులేని వారి యెడల శ్రద్ధ

    వితంతువులకు, పితృ వినియోగము కలిగిన వారికి మన మెక్కువ సానుభూతి చూపవలెను. ప్రభుని ప్రత్యేక శ్రద్ధకు వీరు అర్హులు. క్రైస్తవులు వీరిని పరామర్శించవలెనని దేవుడు కోరుచున్నాడు. “తండ్రియై న దేవుని యెదుట పవిత్రమును, నిష్కళంకమును అయిన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి యిబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే”. యాకోబు 1:27. CChTel 184.2

    విశ్వాసముతో మరణించిన తండ్రులనేకులు దైవనిత్య వాగ్దత్తములపై నాధారపడి దేవుడు కాపాడునను పూర్ణ విశ్వాసముతో తమ ప్రియులను విడచి పోయిరి. ఈ అనాధులనెట్లు ప్రభువు పోషించును? పరలోకమునుండి మన్నా సంపుట ద్వారా ఆయన ఒక గొప్ప సూచక క్రియ చేయడు. కాకోలములతో వారికి ఆహారము పంపడు. ఆత్మలోనుండి స్వార్థ ప్రీతిని పారద్రోలి దాతృత్వపు ఊటలను బంధములను త్రెంచుటద్వారా మానవ హృదయములపైఆయన ఒక సూచక క్రియ చేయును. బాధితులను దిక్కు లేని వారిని తమ యొద్దకు పంపుట ద్వారా తన అనుచరులమని పిలుచుకొను వారి ప్రేమను ప్రభువు పరీక్షించును. CChTel 184.3

    దైవ ప్రేమ గలవారు ఈ బిడ్డలకు తమ హృదయములయందును గృహము యందును ప్రవేశమిత్తు రుగాక. విశాల సంస్థలయందు అనాధ బాలలను పోషించు ఏర్పాటు సంఘసభ్యులు ఈ పిల్లలను దత్తము చేసికొనుటయో లేక ఇతర గృహములలో వారికి స్థానము ఏర్పాటు చేయుటయో సంభవించవలెను. CChTel 184.4

    ప్రత్యేకముగా క్రీస్తు పిల్లలను ప్రేమించును. వీరికి అనాదరము చూపుట వలన ఆయనకు బాధకలుగును. యేసు నామమున వీరికిచేయు ప్రతి ఉపకారము ఆయనకు చేసినట్లే అంగీకరించ బడును. 116T 281 CChTel 185.1