Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 28 - అవిశ్వాసిని వివాహమాడకుడి

    క్రైస్తవులు అవిశ్వాసులను వివాహమాడుటను గూర్చి దైవ వాక్యము చేయు ఉపదేశముపట్ల ఆందోళనకరమైన నిర్లక్ష్య స్వభావము క్రైస్తవ ప్రపంచములో పరివ్యాప్తమై యున్నది. దేవుని ప్రేమించి ఆయనకు భయపడుచున్నామని చెప్పుకొనువారు అనేకులు అపార జ్ఞాననిధియగు దేవుని యొక్క ఉపదేశమునకు ప్రతిగా తమ తలంపులనే అవలంబించు చున్నారు. ఈ ప్రపంచము నందున్న ఉభయపక్షముల ఆనంద సుక్షేమములకు సంబంధించిన ప్రధాన విషయమునందు సహేతుకత, వివేచనము దైవభీతి విసర్జించబడుచున్నవి. అంధాభిప్రాయములు , మూర్ఖపు పట్టుదల తమ్మును అదుపుచేయుటకు వారు అంగీకరించుచున్నారు. CChTel 263.1

    ఇతరత్రా బుద్ధి మనస్సాక్షులు గల స్త్రీ పురుషులు ఉపదేశమును విననోల్లకున్నారు. స్నేహితులు, బంధువర్గము దైవసేవకులు చేయు విజ్ఞాపనలను వారు పెడచెవిని పెట్టుచున్నారు. హెచ్చరిక చేసినచో దానిని అనవసర జోక్యముగా పరిగణించు చున్నారు. ఒక నమ్మకమైన స్నేహితుడు తమ విధానమునకు విరుద్ధముగా హెచ్చరిక చేసినచో అతడు శత్రువుగా పరిగణించబడుచున్నాడు. ఆత్మ చుట్టును సాతానుడు తన సంబంధమైన వృత్తమును తయారు చేయును. అప్పుడది మంత్రబద్దమగును మోహపూర్ణముగను తయారగును. ఆత్మ నిగ్రహము మెహమునకు లొంగుచున్నది. దురేచ్ఛలకు లోనైన ఆ వ్యక్తి తన జీవితము బాధకరమైన దాస్యము నందు చిక్కుకొని యున్నది ఆలస్యముగా గ్రహించును. ఇది ఊహాజనితమైన చిత్రపటము కాదు ` వాస్తవిక విషయముల నివేదనయే. దేవుడు నిషేదించిన వైవాహిక సంబంధమును ఆయన అంగీకరించడు. CChTel 263.2

    తమ చుట్టుపట్ల గల విగ్రహారాధికులను వివాహమాడరాదని ప్రాచీన ఇశ్రాయేలీయులకు ప్రభువు ఆజ్ఞాపించెను. నీవు వారితో వియ్యమందకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. కారణమీయబడినది. అట్టి వివాహ సంబంధము ఫలితములను ముందే గ్రహించి దేవుడిట్లు సెలవిచ్చెను. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్ళించెదరు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని నిన్ను త్వరగా నశింపజేయును. నీవు నీ దేవుడైన యోహోవాకు ప్రతిష్టత జనము నీ దేవుడైన యెహోవా భూమిమీద నిన్ను సమస్త జనములకంటే ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. CChTel 263.3

    క్రొత్త నిబంధనయందు కూడా భక్తిహీనులతో క్రైస్తవుల వివాహ నిషేధములు పేర్కొనబడినవి. కొరింధీయులకు వ్రాసిన మొదటి ఉత్తరము నందు అపోస్తులుడైన పౌలిట్లు వ్యక్తము చేయుచున్నాడు. భార్య తన భర్త బ్రతికి యున్నంతకాలము బద్దురాలై యుండును. గాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసుకొనవలెను. మరల రెండవ పత్రిక యందు ఆయన యిట్లు వ్రాయుచున్నాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సందర్భము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై యున్నాము. అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలై యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా నుండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకొందును మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. CChTel 264.1

    దేవుడు కూడదనిన కార్యమును తన ప్రజలెప్పుడును తలపెట్టరాదు. అవిశ్వాసులతో విశ్వాసుల వివాహమును దేవుడు నిషేదించుచున్నాడు. కాని తరచు పరివర్తత చెందని హృదయము స్వకీయేచ్ఛలను అవలంబించును. ఆ కారణముగా దేవుడంగీకరించని వివాహములు జరుగుచున్నవి. దీని వలన అనేక స్త్రీ పురుషులు ప్రపంచములో నిరీక్షణయు దేవుడును లేని వారిగనున్నారు. వారి ఉదాత్తాశయములు అంతరించినవి. వారు పరిస్థితులనే గొలుసుతో బంధించబడి సైతాను వలయందు ఉంచబడి యున్నారు. కామోద్రేకములకు వశులైనవారు ఈ జీవితమందు విచారమను పంటను కోసెదరు. తమ దుశ్చర్యల పర్యవసానముగా వారు నశించెదరు. CChTel 264.2

    సత్యము నవలంబించుచున్నామని చెప్పుకొను వారు అవిశ్వాసులను పరిణయమాడుట ద్వారా దైవచిత్తమును కాళ్ళతో నలగద్రొక్కు చున్నారు. వారాయన దయను కోల్పోవుదురు. అప్పుడు పశ్చాత్తాపపడుట బాధకరమైన విషయముగా పరిణమించును. అవిశ్వాసి సద్వర్తన కలిగియుండవచ్చును. అతడు లేక ఆమె దైవ విధులను నెరవేర్చక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన హేతువు ఆ వివాహము జరుగగూడదనుటకు చాలును. అవిశ్వాసి శీలము, నీ కింక ఒకటి కొదువుగా నున్నది. అని క్రీస్తు చెప్పిన యువకుని శీలము వంటిదై యుండవచ్చును. అవసరమైనది ఆ ఒక్కటియే. CChTel 264.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents