Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నేను యేసునొద్ద నుండి వచ్చు ప్రశస్త వరము

    ప్రేమ ఒక ప్రశస్తమైన వరము. దానిని మనకు యేసు అనుగ్రహించును. అది యొక నియమము. యదార్ధమైన ప్రేమ కలవారు అన్యాముగా గాని, గ్రుడ్డితనముగా గాని యుండదు. యదార్ధమైన, భక్తియుతమైన, పవిత్రమైన ప్రేమ లోకములో చాలా కొంచెముగా నున్నది. ప్రశస్తమైన యీ గుణము అరుదుగా నున్నది. CChTel 255.3

    యదార్ధ ప్రేమ సమున్నతమైన పరిశుద్ధమైన నియమము. ఉద్రేకము వలన రెచ్చగొట్టబడి నిశితముగా పరీక్షించబడినపుడు హఠాత్తుగా చల్లబడు ప్రేమకును దీనికి మహత్తర వ్యత్యాసము కలదు. CChTel 255.4

    ప్రేమ ఒక మొక్క. దానికి పెరుగుదల పొర లైకికమైనది. దానికి దోహదము చేసి పెంచవలెను. ప్రేమ పూరిత హృదయములు, వాస్తవిక ప్రేమా వాక్కులు ఆనందకరమైన కుటుంబములను స్థాపించి తమ ఆధీనమునకు వచ్చు వారిపై సమున్నత ప్రభావము కనపరుచును. CChTel 255.5

    పవిత్రమైన ప్రేమ తన ఏర్పాట్లన్నింటి యందును దేవునితో సంప్రదించి దేవుని యాత్మతో సంపూర్ణ సమైక్యత కలిగి యుండును. అయితే కామమట్లు కాక దఅవిధేయము గాను, అనాలోచితముగాను, అక్రమముగాను వర్తించి నిర్భందములను అలక్ష్యము చేయుచు తానెన్నుకొన్న వస్తువును విగ్రహముగా చేసికొనును. నిజమైన ప్రేమ గల వ్యక్తి ప్రవర్తన యంతటిలో దైవకృప ప్రత్యక్షపరచబడును. అణకువ, సరళత, యదార్థత, నీతి, మతము వివాహ సంబంధము ప్రతి ఘట్టమందును గోచరించును. ఇట్లు అదుపు చేయబడువారు ఒకరి సఖ్యమునందు ఒకరు నిమగ్నులై యుందురు. ప్రార్థన కూటములను, మత విషయక కార్యకలాపములను ఉపేక్ష చేయరు. దేవుడు వారికిచ్చిన తరుణములు, ఆధిక్యతలు, అలక్ష్యము చేయబడిన కారణముగా వారి సత్యాసక్తి సన్నగిల్లదు. CChTel 255.6

    కేవలము ఇంద్రియ తృప్తి పునాదిగా గల ప్రేమ అవిధేయముగను, గ్రుడ్డితనముగను, దుర్వారముగను రూపొందును. గౌరవము, సత్యము, వివిధ ఉదాత్త మానసిక శక్తులు కామముచే బంధింపబడును. ఈ మమకార బంధములతో బంధింపబడు మానవుడు తరచు మనస్సాక్షి సహేతుకతల స్వరమును ఆలకించడు. వాదముగాని విజ్ఞాపన గాని తప్పిదమును అతనికి చూపజాలవు. CChTel 256.1

    యదార్ధ ప్రేమ బలీయమైన, భయానకమైన ఉద్వేగము గల కామము వంటిది కాదు. అట్లుగాక అది శాంతముగను గాఢముగను ఉండును. బాహ్య విషయములనది లెక్కచేయదు. అది కేవలము సలక్షణముచే నాకర్షించబడును. అది వివేకము, వివేచనలు కలది. దాని యనురాగము యదార్ధమైనది, నిలకడగా నుండునది. CChTel 256.2

    కామోద్రేకములు లేని ప్రేమ ఆధ్యాత్మికత కలిగి మాటలలోను క్రియలయందును ప్రదర్శితమగును. క్రైస్తవుడు అసహనము ఆక్రోశము లేని పావన ప్రేమ, దయాళుత్వము లను కలిగి యుండవలెను. కఠిన స్వభావము క్రీస్తు కృపచే మృదులము చేయబడవలెను. CChTel 256.3