Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ప్రయోగాత్మకమైన మతము

    ప్రభువుకు చురుకకైన, యథార్థమైన సేవ మనము చేయకున్నచో విశ్వసించుచున్నామని చెప్పుకొనుట అబద్ధమగును. పాపములలోను, అతిక్రమములలోను మృతులైన వారిని యధార్థమైన ప్రయోగాత్మకమైన చర్యల ద్వారా బయలు పరచబడు క్రైస్తవ మతము మాత్రమే ఉద్రేకపర్చగలదు. సకల ప్రజలకు పరీక్షయైన రక్షణ సత్యమును ప్రచురించుటయే తమ వాంఛయని తమ క్రియల ద్వారా తెలియజేయు ప్రార్థన ప్రియులు, సాత్వికులునగు క్రైస్తవ విశ్వాసులు ప్రభువుకు గొప్ప పంటను పోగుచేసెదరు. CChTel 91.2

    మన సంఘములు విశ్వాసమునందు ఇంత బలహీనముగా నుండుటకు హేతువు లేదు. “బంధకములలో పడియు నిరీక్షణగల వారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి.” జెకర్యా 9:12. క్రీస్తు నందు మనకు బలము గలదు. తండ్రి యెదుట ఆయన మన ఉత్తరవాది. తన చిత్తమును తన ప్రజలకు ఎరుకపరచు నిమిత్తము ఆయన తన రాయబారులను తన రాజ్యమందలి అన్ని భాగములకు పంపుచున్నాడు. ఆయన తన సంఘముల మధ్య సంచరించు చున్నాడు. తన అనుచరబృందమును పరిశుద్ధ పరచి, ఘనపరచి, గొప్ప చేయు నభిలషించు చున్నాడు. ఆయనయందు యథార్థ ముగా విశ్వాసముంచువారి పలుకుబడి ప్రపంచమందు జీవపు వాసనగా నుండును. ఆయన నక్షత్రములను తన కుడి చేత పట్టుకొనియున్నాడు. ప్రపంచమునకు వీని ద్వారా తన వెలుగును ప్రజ్వలింపజేయ వలెనని ఆయన సంకల్పము. ఇట్లు తన ప్రజలను పైనున్న సంఘములో ఉన్నత సేవ కొరకు సిద్ధముచేయవలెనని ఆయనఆకాంక్షించుచున్నాడు. ఒక గొప్ప కార్యమును ఆయన మనకప్పగించె ను. పట్టుదల గలిగి యీ కార్యమును మనము నిర్దుష్టముగా నిర్వహించుదము. సత్యము మనకొనరించిన లాభమును మన జీవితముల ద్వారా ప్రదర్శించుదము. CChTel 91.3

    ఆయా సువార్త సంస్థలను ఇప్పటి స్థితికి తెచ్చుటకు ఆత్మోపేక్ష, ఆత్మార్పణ, అప్రతిహతశక్తి, అధిక ప్రార్థన అవసరమయ్యెను. ఈ వర్తమానమునందలి నాయకులు చేసిన కఠోర దుస్సహాయకష్టము, ఆత్మోపేక్ష, చూపిన కార్యదీక్ష ఇప్పుడు మనము ప్రదర్శించనక్కరలేదని తలంచుచు అసర్థతను సమర్థించుచు హాయిగా విశ్రమించువారుఇప్పుడు కార్యరంగమున ప్రవేశించుచున్నారు. రోజులు మారినవనియు, దైవసేవయందిప్పుడు అధిక ధనమున్నది గనుక ఈ వర్తమానము ప్రారంభదశలో నున్నపుడు అనేకులనుభవించవలసి వచ్చిన కష్టములను ఇప్పుడు మనమనుభవించనక్కలేదనియు చెప్పు అపాయము మనల నావమించినది. CChTel 92.1

    ఈ పని యొక్క ప్రారంభదశలో ప్రదర్శించబడిన శ్రద్ధ, ఆత్మార్పణ, శీలము ప్రస్తుత దశయందు కూడ ప్రదర్శించబడినచో ఇప్పుడు సాధించబడిన దానికన్న వందరెట్లు అభివృద్ధిని మనము చూచియుందుము. 206T 417-419;CChTel 92.2

    మన విశ్వాసము ఉన్నతమైనది. సబ్బాతును గైకొను ఎడ్వెంటిస్టులమగు మనము దేవుని ఆజ్ఞ లన్నింటిని గైకొనుచు మన విమోచకుని రాకడ కొరకు ఎదురు చూచుచున్నామని చెప్పుకొందుము. మహా గంభీరమైన హెచ్చరికావర్తమానము దేవుని చిన్న మందకు అప్పగించబడినది. మనపై పెట్టబడిన గురుతర బాధ్యతను గుర్తించుచున్నామని మనము మన మాటల ద్వారాను క్రియల ద్వారాను చూపవలెను. మన అనుదిన జీవితములలో తండ్రిని మహిమ పరచుచున్నామనియు, పరలోకముతో మనకు సంబంధమున్నదనియు, యేసుక్రీస్తుతో మనము సమిష్టి వారసులమనియు, ఆయన శక్తితోను గొప్ప మహిమతోను వచ్చునపుడు మనమాయనవలె నుందుమనియు,ఇతరులు గ్రహించునట్లు మన జ్యోతి తేజోవంతముగా ప్రకాశించవలెను. 214T 16. CChTel 92.3