Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ప్రయోజనకరమయిన పనులను నేర్పుట ప్రాముఖ్యము

    ఇశ్రాయేలీయుల దినములందువలె ఇప్పుడు కూడ ప్రతి యౌవనుడు ప్రయోజనకర మయిన పనులలో శిక్షణ నొందవలెను. ప్రతి వ్యక్తి ఏదో ఒక చేతి పనిని నేర్చుకొని అవసరమగుచో దాని ద్వారా జీవనోపాధి సంపాదించుకొనగలిగి యుండవలెను. పరిస్థితులు మారినపుడు సహాయముగ నుండుటయే గాక భౌతిక, మానసిక, నైతిక అభివృద్ధికి కూడ తోడ్పడును. అందుకు ఇది చాలా ప్రాముఖ్యము. CChTel 391.5

    మన పాఠశాలలో వివిధ పరిశ్రమలను నిర్వహించవలెను. పారిశ్రామిక శిక్షణలో ఆదాయస్వయగణనము, వడ్రంగము, వ్యవసాయము ఇమిడియుండవలెను. కమ్మరము, తాపీపని, పాద రక్షలు తయారు చేయుట, వంటచేయుట, రొట్టెలు చేయుట, బట్టలు ఉదుకుట, బాగుచేయుట, టైపు చేయుట, అచ్చువేయుట`వీనిని నేర్పుటకు సన్నాహములు చేయవలెను. విద్యార్థులు ప్రయోజనకరమైన చేతి పనులు చేయుటకు సమర్థులగునట్లు వారిని తర్పీదు చేయుటలో మీ యావచ్ఛక్తిని వినియోగించుడి. CChTel 392.1

    విద్యార్థినులకు ప్రయోజనకరమయిన వృత్తి విద్యను నేర్పుటకు చాల పనులు కలవు. దుస్తులు తయారుచేయుట, తోట పెంచుట నేర్పవలెను. పూల మొక్కలను పండ్ల చెట్లను వారు పెంచవలెను. ఇట్లు ప్రయోజనకరమైన చేతిపని నేర్చుకొనుటలో వారికి ఆరోగ్యదాయకమైన ఆరుబయటి వ్యాయామము లభించును. 31CT 307—312;CChTel 392.2

    శరీరము, మనస్సు, అన్యోన్య ప్రభావము కలిగి యుండునని నొక్కి వక్కాణించవలెను. మానసిక పరిశ్రమ వలన మెదడునందు ఉత్పత్తియగు విద్యుచ్ఛక్తి శరీరమంతటిని బలపరచి రోగమును ప్రతిఘటించుటకు అమూల్యమగు సహాయము చేయును. CChTel 392.3

    మనము పరిగణింపబవలసిన భౌతిక శాస్త్ర సంబంధమయిన సత్యమొకటి లేఖనములలో నున్నది. “సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము.” 32Ed. 197;CChTel 392.4

    పిల్లలు, యౌవనస్థులు, ఆరోగ్యము, ఆనందము, చురుకుదనము, మంచి కండరములు మంచి మేధస్సు కలిగి యుండవలెనన్నచో వారు ఎక్కువ సేపు సూర్యరశ్మిలో క్రమబద్ధమైనవని, క్రీడల యందు పాల్గొవలెను. పాఠశాలయందుంచబడి గ్రంథపఠనమందే నిమగ్నులగు పిల్లలు, యువజనులు ధృఢకాయములు కలిగియుండ జాలరు. చాలినంత శరీర వ్యాయామము లేకుండ కేవలము ఫఠించుటకే సాధకము చేయబడు మెదడు రక్తమును ఆకర్షించు స్వభావము కలిగి యుండును. అందుచే శరీరమందు రక్త ప్రసారము సమముగా నుండదు. మెదడులో నెక్కువ రక్తము కాలుసేతులలో చాల తక్కువ రక్తము ఉండుట తటస్థించును. CChTel 392.5

    బాల బాలికలు పఠించుటకు నియమిత కాలముండవలెను. వారు కొంత సమయమును కాయకష్టము చేయుటకుపయోగించవలెను. భుజించుటలోను, ధరించుటలోను నిద్రించుటలోను వారి యలవాట్లు భౌతిక శాస్త్రము ననుసరించి యున్నచో శారీరక మానసిక ఆరోగ్యమును కోల్పోకుండ వారు విద్యనభ్యసించగలరు. 33CT 83;CChTel 393.1