Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఉదయ సాయంకాలారాధానలు

    తల్లి దండ్రులారా,ప్రతి ఉదయ సాయంకాలారాధనల య్నడును మీ చుట్టూ మీ బిడ్డలను పోగుచేసి సహాయముకొరకు వినయ మనసుతో దేవునికి పార్ధన చేయుడి. మీ ప్రియులు శోధనలతో చుట్టూ ముట్టబడి. పడుచు వారిని ముసలివారిని వుపద్రవములు దిన దినము చిక్కులు పెట్టుచున్నవి. ఓర్పు ,ప్రేమ ,సంతోషముతో జీవించదలచినవారు ప్రార్ధించవలెను. దేవుని యొద్దనుండి నిత్య సహాయము పొందుట ద్వారానే జయించగలము. CChTel 307.2

    ప్రతి గృహము ప్రార్ధన మందిరముగా నుండవలసిన సమయమిదే !అవిశ్వాసము,సంశయము ప్రబలినవి. అక్రమము విస్తరించు చున్నది. అతమ్యోక్క ప్రముఖ ప్రసరణ కేంద్రముల నుండి దుర్ణితి వెలువడుచున్నది. దేవునిపై తిరుగుబాటు అధికమగు చున్నది. పాపముచే చెరగొన్నబడిన నైతిక శక్తులు సాతాను నిరంకుశసాధికారము క్రింద మగ్గు చున్నవి. సాతానుని శోధనలకు ఆత్మ ఒక క్రీడా వస్తువు అయినది, పరిరక్షించుటకు బలవత్తరమైన హస్తము ఆదుకొనకున్నచొ సాతానుడు నడుపు స్తలమునకు మానవుడు పోవుట తధ్యము. CChTel 307.3

    అయినాను భయంకరమైన అపాయములు గల ఈ కాలములో క్రైస్తవులమని చెప్పు కొను కొందరు కుటుంబ ప్రార్ధనలు చేసికోనరు. వారు తమ గృహమందు గౌవరవించరు. ఆయనను ప్రేమించి ఆయనకు భయపడుడని వారు తమ బిడ్డలకు నేర్పించరు. అనేకులు అయన నుండి విడిపోయి తుదకు ఆయన చెంతకు తిరిగి వచ్చుట కయోగ్యులమని భావించు నంతవరకు పోయిరి. వారు“కోపమును సంశయమును లేనివారై పవిత్ర మైన చేతులెత్తి “ధైర్యముతో కృపాసనమును నొద్దకు చేర “లేరు (హెబ్రీ 4:16;CChTel 307.4

    1 తిమోతి 2:8) దేవునితో వారికి సజీవమైన సంబంధము లేదు. వారి భక్తీ శక్తి సూన్యమైనది. CChTel 308.1

    ప్రార్ధన ప్రాముఖ్యమై నదికాదను ఉద్దేశ్యము ఆత్మలను నాశనముచేయటకు సాతానుడు పన్నిన పన్నుగడలలో చాల జయప్రదమైనది. జ్ఞానపు టూట,,బలము, సమాధానము ,ఆనందములకు నిదియైన దేవునితో చేయు సహవాసమే ప్రార్ధన. “రోదనముతోను కన్నీళ్ళతోను “యేసు తండ్రికి ప్రార్ధన చేసెను. ”ఎడతెగక ప్రార్ధించుడి “అనియు ప్రతి విషయమందును ప్రార్ధనతోను విజ్ఞానముతోను కృతజ్ఞతార్పణతోను తమ మనవులను దేవునికి తెలియజేయుడనియూ పౌలు విశ్వాసులకు హితవుచేయుచున్నాడు. ”ఒకని కొరకు ఒకడు ప్రార్ధనచేయుడి “అని యాకోబు చెప్పుచున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనః పూర్వకమైనదై బహు బలముగలదై యుండెను. (హెబ్రీ 5:7; 1 దెస్స. 5:17 యాకోబు 5:16 ). CChTel 308.2

    యదార్ధత పట్టుదలగల ప్రార్ధనద్వారా తమ బిడ్డలచుట్టూ ఒక కంచెను వేయవలెను. దేవుడు వారితో నుండుననియు ,పరిశుద్ధ దూతలు తమమును కాపాడి తమ బిడ్డలను సాతానుని కౄరమైన శక్తి నుండి కాపాడెదరనియు వారు పూర్తిగ విశ్వసించి ప్రార్ధనచేయవలెను. CChTel 308.3

    ప్రతి కుటుంబ మందున ఉదయ సాయంతన ఆరాధనలకు నిర్ధిష్ట సమయముండవలెను. ఉదయ భోజనము కాక మునుపు కడచిన రాత్రి యందు ప్రభువుయొక్క కాపుదల నిమిత్తము వందనము చెల్లించుటకు ,తక్కిన దిన మంతయు సహాయము ,నడుపుదల ,కాపుదల అనుగ్రహించు మని అభ్యర్ధించుటకు ,తల్లిదండులు,పిల్లలు మరి యొకసారి ఆయన ముందు సమావేశమై గడచినా దింము తాము పొందిన దీవెనల నిమిత్తము ప్రభువుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యెంత సమంజసము !CChTel 308.4

    ప్రతి ఉదయమున మిమ్మును మీ బిడ్డలను దేవునికి సమర్పించుకొనిడి. నెలలను సంవత్సరములను గూర్చి ఆలోచించకుడి. అవి మీవికావు. మీకు ఒకదినము మాత్రమేయియ్యబడినది. అది భూమిపై మీ అంతిమ దినమో యన్నట్లు ప్రభువుకొరకు పాటుపడుడి. మీ సంకల్పములన్నింటిని దేవునిముందు పెట్టి ఆయన చిత్తానుసారము వానిని కొనసాగించుటయో విడిచిపెట్టుటయో చేయుడి. మీ ప్రియమైన సంకల్పములను త్యజించవలసి వచ్చినను మీ ఏర్పాటులకు బదులు ఆయన యేర్పాటులను అంగీకరించుడి. ఇట్లుCChTel 308.5

    మీ జీవితము దిన దిన ప్రవర్ధమానముగా దైవా దర్శానుసారము రూపొందును. “అప్పుడు సమస్త జ్ఞానమునకు దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావలి యుండును. ”ఫిలిప్పీయులకు 4:7. CChTel 309.1

    తండ్రి గాని అతడు లేనప్పుడు తల్లి గాని ఆశాజనకమైన సులభ గ్రహ్యమగు లేఖన భాగము నొకదానిని ఎన్ను కొని కుటుంబరాదన జరిపించ వలెను. ఆరాధన కూటము క్లుప్తముగా నుండ వలెను. ఒక పెద్ద అధ్యయము చదివి దీర్ఘ ప్రార్ధన చేయునపుడు ఆ కూటము విసుగు కలిగించును. అది ముగుసిన తదుపరి దీర్ఘ విశ్వాసము విడుచుట సంభవించును ,ప్రార్ధన కూటము నిరుత్సాహముగాను ,విసుగు కరముగాను ,ఆశసూన్యముగను ఉండుటచే పిల్లలకు భయము కలుగుచున్నది. అందుచే దేవుడు అగౌరవపరచబడుచున్నాడు. CChTel 309.2

    తల్లి దండ్రులారా ,ఆరాధన ముదావహముగ నుండునట్లు చేయుడి. దినక్రుత్యములన్నిoటిలో ఈ ఆరాధన ఆనంద దాయకముగా నుండుటకు హేతువులేదు. దానిపై కొంతసేపు ధ్యానించి సిద్ద పడినచో అది ఆశజనకముగాను ,లాభధాయకముగను ఉండును. అప్పుడప్పుడు ఆరాధన క్రమమునందు మార్పు వాంఛనీయము. చదివిన లేఖనమునందు ప్రశ్నలువేయవచ్చును. స్తుతి గీతములు పొడవచ్చును. ప్రార్ధన క్లుప్తముగా నుండ వలెను. ప్రార్ధించు వ్యక్తి సామాన్యమైన పట్టుదలతో కూడిన మాటలతో దేవుని సౌజన్యము నిమిత్తము ,సాయము నిమిత్తము ఆయనకు స్తోత్రము చెల్లించవలెను. పరిస్థితులననుసరించి బైబిలు చదువుటకు ప్రార్ధన చేయుటకు పిల్లలకు అవకాశమీయుడి. అట్టి ఆరధనలతో గర్బతమై యున్న మేలు భవితవ్యమె పర్చును. 37T 42-44. CChTel 309.3