Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఇతర సంఘ బోధకులతోను ఇతర సంఘ సమూహములలోను మాటలాడుట

    ఇతర సంఘములలో మాటలాడుటకు మీకు తరుణములు లభించును. ఈ యవకాశములను సద్వినియోగపరచుకొనుటలో రక్షకుడు పలికిన యీ మాటలను జ్ఞాపకముంచుకొనుడి, “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.” విమర్శి కోపన్యాసములు చేయుట ద్వారా సత్యము ప్రవేశించకుండ ద్వారములను మూసెదరు. సుస్పష్ట వర్తమానములనీయుడి. వైరుధ్యము రెచ్చగొట్టకుండ జాగ్రత్తగా నుండుడి. రక్షించబడవలసిన ఆత్మలనేకములున్నవి. పరుష పదజాలమను ప్రయోగించకుడి. మీరెవరిని సధించినను క్రీస్తును ప్రదర్శించుచు మాటలయందును క్రియలయందును రక్షణ సాధనలుగాను వివేకవంతముగాను వ్యవహరించుడి. మానవాళికి శాంతిని సుహృద్భావమును కలిగించు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సును జోడ తొడుగుకొని యున్నట్లు సర్వ ప్రజలకు వ్యక్తపరచుడి. క్రీస్తు ఆత్మతో నిండి పనియదు ప్రవేశించినచో మనము మహత్తర ఫలితమలను కాచగలము. మనము నీతి యందును, కృప యందును, ప్రేమయందును పనిని ముందుకు సాగించినచో మనక అవసరమైనపుడు సహాయము వచ్చును. సత్యము జయించును, విజయము లభించును. 4Ev 563, 564;CChTel 465.4

    ఇతర సంఘ బోధకుల నిమిత్తము మనము చేయవలసిన సేవ యొకటి కలదు. వారు రక్షించబడవలెనని దేవుడు కోరుచున్నాడు. మనవలెనే వారు కూడ విశ్వాసము, విధేయతల ద్వారా అమర్త్యత్వమును పొందవచ్చును. వారది పొందునట్లు మనము వారికొరకు పట్టుదలతో కృషి చేయవలెను. నేడు జరుగుచున్న ఆయన ప్రత్యేక సేవలో వారు కూడ పాల్గొనవలెనని దేవడు కోరుచున్నాడు. తన యింటి వారికి సకాలమందు ఆహారమిచ్చువారిలో వారు కూడ నుండవలెనని ఆయన కోరిక. ఈ సేవలో వారెందుకు పాల్గొనరాదు? ఇతర సంఘ బోధకులను మన సువార్తికులు సంధించి వారి కొరకు కృషి సల్పవలెన. ఈ మనుష్యుల కొరకు వారితో ప్రార్థించుడి. క్రీస్తు వారి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. వారిపై గురుతర బాధ్యత యున్నది. మందను మేపు ఈ కాపరుల యెడల క్రీస్తు రాయబారులమగ మనము గాఢమయిన యాథార్థ్యమయిన ఆసక్తి చూపవలెను. 56T 77, 78;CChTel 466.1

    ఇతర సువార్తికుల కొరకు కృషి చేయుట తమ ప్రత్యేక కర్తవ్యమని మన సువార్తికులు భావించవలెను. వారితో వివాదము పెట్టుకొనక బైబిలు గ్రంథమును హస్తమున నిడుకొని దైవవాక్యము పఠించుడని వారిని ఆర్థించుడి. ఇది చేసినచో ప్రస్తుతము దుర్బోధలు చేయు బోధకులు ఆ బోధలు విడిచి వర్తమాన సత్యమును ప్రకటించెదరు. 6Ev 562. CChTel 466.2