Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పిల్లల యెడల కచ్చితముగాను యధార్థముగాను ఉండుట ప్రాముఖ్యము

    తల్లిదండ్రులు యధార్ధతకు మాదిరిగా నుండవలెను. ఏలయనగా ఈ పాఠమునే వారు పిల్లల మనస్సున అనుదినము ముద్రించవలెను. జీవిత కార్యములన్నింటియందును అచంచలమయిన నియము తల్లిదండ్రులను అదుపు చేయవలెను. ముఖ్యముగా పిల్లలను తరిబీతు చేయుటలోను విద్యయందును నియమబద్ధత అవసరము. “బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యధార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును”. CChTel 375.3

    దేవుని నడుపుదలను అనుసరించని వివేచనలేని తల్లి తన పిల్లలు మోసగాండ్రు, వేషధారులు అగునట్లు తర్ఫీదు చేయవచ్చును. ఇట్లు అలవరచుకొనబడిన గుణ గణములు స్థిరపడి తద్వారా అబద్ధములాడుట గాలి పీల్చుకొనవలె వారికి స్వాభావికమగును. కపటము యధార్థమనియు సత్యమనియు నమ్మబడును. CChTel 375.4

    తల్లిదండ్రులారా, సత్యమును దాచకుడి, మాటలయందుగాని క్రియలయందుగాని అసత్యమును కనపర్చకుడి. మీ బిడ్డడు సత్యవర్తనుడై యుండవలెనని మీరు కోరినచో ముందు మీరు సత్యవర్తనులై యుండుడి. కించత్తు అసత్యమునకు కూడ తావీయకుడి. తల్లులు సత్యమును దాచి అసత్యమాడుట పరిపాటి కనుక బిడ్డడు కూడ ఆమె మదిరిని అవలంభించుట తథ్యము. CChTel 375.5

    తల్లి అన్ని విషయములయందును యధార్థత కలిగి యుండుట ప్రాముఖ్యము. పిల్లలను తర్ఫీదు చేయుటలో నిది ప్రాముఖ్యము. యువతులకు బాలురకు అసత్యమాడరాదనియు మోసపుచ్చరాదనియు నేర్పించుటకిది అత్యవసరము. 25CG 151, 152;CChTel 375.6