Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దేవుని ఆలయమును పాడు చేయకుడి

    యువజనుల మనస్సులను స్వాధీనపరచుకొని తలంపులను చెరచి శరీరేచ్ఛలను రెచ్చగొట్టు ఈ కడవరి దినములలో సాతానుడి చేయు ప్రత్యేక కార్మడై యున్నది. ఇట్లు చేయుటద్వారా వారిని దుష్టకార్యము చేయుటకు నడుపవచ్చునని యాతనికి ఆకళింపే. ఇట్లు ఉదాత్తమయిన మానసిక శక్తులు నీచములగు చున్నవి. అప్పుడతడు తన కార్యమునకు అనువగు విధముగా ఆ శక్తులను అదుపు చేయగలడు. 5CG 440;CChTel 445.2

    క్షీణ దశకు వచ్చిన యీ యుగముందు శీలములను నిర్మించుకొనుచున్న యువజనుల నిమిత్తము నా యాత్మ ప్రలాపించుచున్నది. వారి తల్లిదండ్రుల నిమిత్తము కూడ నాకు కంపము పుట్టుచున్నది. కారణమేమనగా పిల్లలు పెరుగ వలసిన రీతిగా వారిని తర్బీతు చేయుట తమ విధియని వారు గ్రహించుటలేదు. వారు ఆచారము, ఫ్యాషనుల యందు నిమగ్నులై యున్నారు. అచిరకాలములో పిల్లలు వీని వలన ఆకర్షించబడి దుర్మార్గు లగుదురు. ఇది యిట్లుండగా లోక భోగాసక్తులైన తమ తల్లిదండ్రులు మత్తిఇ్ల తమ పిల్లల అపాయస్థితిని గుర్తించక యుందురు. దురభ్యాసములు లేని యువజనులు అరుదు. ఎక్కువ శ్రమ కలుగునను భీతి చొప్పున వారికి దేహ పరిశ్రమనీయరు. పిల్లలు మోయవలసిన భారములను తల్లిదండ్రులే మోసెదరు. CChTel 445.3

    మితిమీరి పని చేయుట మంచిది కాదు. కాని సోమరి తనపు ఫలితములు మరింత భయంకములు. సోమరి తనము చెడ్డ అలవాటులకు దారితీయును. హానికరమగు హస్తమై ధునాభ్యాసము వలన కలుగు బడలిక, ఆయాసముతో అయిదవ వంతు కూడ కాయ కష్టము వలన కలుగదు. తల్లిదండ్రులారా, సామాన్యమును క్రమబద్ధమయిన పని మీ పిల్లలకు ఆయాసమును పుట్టించుచున్నచో వారిని శక్తి హీనులను చేసి వారికి ఆయాసము పుట్టించునది కాయకష్టముకాక వేరోక కారణమున్నదని నిశ్చయించుకొనుడి, నరములకు కండరములకు, పని కలిగించు శారీరకమయిన పనిని మీ పిల్లలకీయుడి. అట్టి పని ఫలితముగా కలుగు అలసట వారికి దురభ్యాసాసక్తిని తగ్గించును. 62T 348, 349;CChTel 446.1

    చెడ్డ తలంపులు పుట్టించు పుస్తకములను పఠించకుడి; దృశ్యములను చూడకుడి నైతిక మానసిక శక్తులను వృద్ధిపరచు కొనుడి. 72T 410;CChTel 446.2

    తలంపులనేగాక శరీరేచ్ఛలను, మమకారములను కూడ మీరు స్వాధీనపరచుకొన వలెనని దేవుడు కోరుచున్నాడు. ఈ విషయములలో మీరు చూపు ఆత్మనిగ్రముపై మీ రక్షణ ఆధారపడి యున్నది. ప్రేమ, ఉద్రేకములు శక్తియుతములైన సాధనములు సరిగా ఉపయోగించకున్నచో దురుద్దేశముతో వానిని ఉపయోగించినచో, వానిని తప్పు స్థలములో నుంచినచో అవి మిమ్మును పాడుచేసి మీకు విచారము కలుగజేసి దేవుడును నిరీక్షణయును లేని వారిగ మిమ్మును చేయుటకు శక్తి కలిగి యున్నవి. CChTel 446.3

    దురాలోచనలలో నిమగ్నులై మా మనస్సులను అపవిత్రములైన విషయములపై నిలిపినచో మీరు దుష్కార్యములలో పాల్గొనినట్లే దేవుడెంచును. తరణము లేనంతననే క్రియ జరుగలేదు. దివారాత్రములు కలలు కనుట గాలి మేడలు కట్టుట అపాయకరములైన అలవాటులు. అట్టి అలవాట్లు ఏర్పడినచో వానిని విడిచి పవిత్రమైన, పరిశుద్ధమయిన, ఉన్నతమయిన. అంశములనుగూర్చి తలంచుట చాల కష్టము. మీ మనస్సును స్వాధీన పరచుకొని వ్యర్థమయిన నీచమయిన తలంపులు మీ యాత్మను కళంకపర్చకుండ చూచుకొనవలెనని కోరినచో మీరు మీ కండ్లను, చెవులను, నకల జ్ఞానేంద్రియములను జాగ్రత్తగా అదుపులో నుంచుకొనవలెను. అత్యంత వాంఛనీయమైన యీ కార్యమును కృపాశక్తి మాత్రమే సాధించగలదు. 82T 561;CChTel 446.4

    అధిక పఠనము వలన మెదడు లోనికి ఎక్కువ రక్తము ప్రసహించి ఉద్రిక్తత పుట్టించును. ఆ ఉద్రిక్తత ఆత్మ నిగ్రహ శక్తిని తగ్గించి తరచు గుబులు, భౌతిక శక్తులను దుర్వినియోగము చేయుట లేక అసలు వినియోగించకుండుట ఇవియే లోకవ్యాప్తముగా నున్న అవినీతికి ఎక్కువ భాగము కారణములు. “గర్వము, ఆహార సమృద్ది నిర్విచారమైన సుఖస్థితి” సాదొమా నాశనమునకు నడిపినట్లే యివి ఈ యుగమందు మానవ పురోగతికి ప్రాణాంతక శత్రువులగుచున్నవి. 9Ed 209;CChTel 447.1

    తుచ్చభోగ నిమగ్నత అనేకులను వెలుగును గుర్తించకుండునట్లు నడుపు చున్నది. ఏలయనగా వారు నిడువ నిష్టపడని పావములను చూడవలసి వచ్చునిని వారి భయము. ఇచ్చగించినచో నెల్లరును చూడ వచ్చును. వెలుగునకు ప్రతిగా వారు చీకటిని ఎన్నుకొన్నచో వారి నేరము గొప్పదగును. 102T 352;. CChTel 447.2

    దైవ ధర్మశాస్త్రమును అగౌరవ పరచుటకు లేక అతిక్రమించుటకు బదులు మరణించుటయే మేలనునది ప్రతి క్రైస్తవుని దీక్షయై యుండవలెను. అతి గంభీరమైన, శుద్ధమొనరించు దైవగ్రంథపు సత్యములను కలిగి మతోద్దారకులమని చెప్పుకొనుచున్న ప్రజలమగు మనము ప్రస్తుతమున్నదానికన్న ఎక్కువగా నైతిక ప్రమాణమును ఘనపరచ వలసి యున్నాము. ఇతరులు చెడిపోకుండునట్లు సంఘమందలి పాపమును, పాపులను గూర్చి వెంటనే చర్య పుచ్చుకొనవలెను. కోరుచున్నవి. నాయకులు ఒక సహోదరుని పాపమును కప్పి పుచ్చకుందురుగాక. అతడు తన పాపమును విడనాడ వలెను. లేదా సంఘమండి దూరపర్చబడునని వ్యక్తము చేయుడి. 115T 147;CChTel 447.3

    సాతానుని బలవత్లరమైన శోధనలు తమను తమ ప్రభుభక్తి కదిలింపజాల నంత పట్ఠిమైన నియమములను యువజనులు కలిగి యుండవచ్చును. అవినీతితో కూడిన పరిసరములలో బాలుడరు ున సమూయేలు నివసించెను. అతడు తన ఆత్మకు దు:ఖము కలిగించు దృశ్యములను చూచెను. మాటలను వినెను. పరిశుద్ద స్థానము నాక్రమించిన ఏవి కుమారులు సాతాను పశులైరి. వీరు తమ చుట్టునున్న వాతావరణము అపవిత్ర పరచిరి. స్త్రీ పురుషులు దినదినము పాపము, దుష్టత్వము లచే నాకర్షించబడుచుండిరి. అయినను సమూయేలు కళంకము లేకుండ జీవించెను. ఇశ్రాయేలు ప్రజలకు భయమును పుట్టించిన పాపములతో నతనికి పొత్తులేదు. లేక ఆ పాపములందతనికి ఆసక్తిలేదు. సమూయేలు దేవుని ప్రేమించెను. అతడు దేవునితో సన్నిహిత సంబంధమును నిలుపుకొనెను. కనుక ఇశ్రాయేలు ప్రజలను పాడుచేయుచున్న ఏవి కుమారుల పాపముల విషయము తనతో మాట లాడుటకొక దూత పంపవలెను. 123T 472-474;CChTel 447.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents