Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    బైబిలు అంతటిలో నున్న క్రీస్తు

    సిలువ వేయబడిన రక్షకుడగు క్రీస్తు నిత్యజీవము నిచ్చుటకు శక్తిగలవాడని మనప్రజలకు బోధించవలెను. క్రొత్త నిబంధన యేసుయొక్క నిజస్వరూపమును ఆవిష్కరించు గ్రంథమై యున్న రీతిగా పాత నిబంధనకూడ ఛాయారూపకమైన సువార్తయై యున్నదని వారికి మనము చూపించవలెను. క్రొత్త నిబందన ఒక క్రొత్త మతమును బోధించుట లేదు. పాత నిబంధన బోధించు మతము క్రొత్త నిబంధన వచ్చుటతో రద్దు పడవలసినది కాదు. క్రొత్త నిబంధన పాత నిబంధనను విపులపరచి అందలి భావములను వృద్ధిచేయుచున్నది. CChTel 220.1

    హేబేలు క్రీస్తను నమ్మినవాడే. పేతురు పౌలువలె నతడు కూడ ఆయన శక్తి వలన రక్షింపబడినవాడే. క్రీస్తు యొక్కువగా ప్రేమించిన శిష్యుడైన యోహానువలె హోనోకు కూడ క్రీస్తుకు ప్రతినిధియే. హోనోకు దేవునితో నడచెను. దేవుడతని తీసికొని పోయెను గనుక అతడు లేకపోయెను. క్రీస్తు రెండవ రాకడను గూర్చిన వర్తమానము అతనికీయబడెను. “ఆదాము మొదలుకొని యేడవ వాడైన హోనోకు కూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను. ఇదిగో అందరిని తీర్పుతీర్చుటకు.. .. ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను.” (యూదా ). హోనోకు బోధించిన వర్తమానము అతడు పరలోకమునకు ఎత్తబడుట ఇదియే తన కాలమందలి ప్రజలకు తన వార్తను గూర్చి బలమైన రుజువులై యున్నవి. నీతిమంతులు పరలోకమునకు ఎత్తబడెదరని, మతూషేల, నోవహులు సాధికారముగా బోధించ గలిగిరనుటకు నివి ఋజువులై యున్నవి. CChTel 220.2

    హోనోకుతో నడచిన ప్రభువు మన రక్షకుడగు క్రేస్తే. ఆయన నేటివలె నాడు కూడ లోకమునకు వెలుగై యుండెను. జీవమార్గము నుపదేశించు బోధకులు అప్పుడు నివసించిన ప్రజలకు లేకపోలేదు. ఏలయనగా హోనోకు, నోవహులు క్రైస్తవులే. లేవీయకాండ మందు సువార్త సూత్రప్రాయముగా నీయబడెను. అప్పటివలె నిప్పుడుకూడ జవదాటని విధేయత అవసరము. ఈ వాక్యముయొక్క ప్రాముఖ్యతను గ్రహింపవలసిన అవసరము ఎంతైన కలదు. CChTel 220.3

    సంఘమునందలి ఆధ్యాత్మిక క్షామమునకు కారణమేమి? అను ప్రశ్న వేయబడునున్నది. ప్రత్యుత్తరమిది. ”మనము మనసులను వాక్యమునుండి తొలగిపోనిచ్చుచున్నాము; ఆత్మ వాక్యమును భుజించుచో దాని యెడల మర్యాద ,భక్తి చూపినచో అసంఖ్యాకముగాను చర్విత చర్వణముగాను సాక్ష్యములు పంపవలసిన అవసరము ఉండెడిది కాదు. ప్రజలు సులభమైన లేఖన విధులను ఆచరించెడివారే. 156T 392, 393. CChTel 220.4