Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 23 - పరిశుద్ధాత్మ

    యేసు ప్రభుని రాకడ కొరకు నెదురు చూచుట మాత్రమే కాక ఆయన రాకను సత్వరపరచు ఆధిక్యత ప్రతి క్రైస్తవునికి గలదు. ఆయన నామము ధరించినవారందరు ఆయనకు మహిమ కలుగు ఫలములు ఫలించుచున్నచో సమస్త లోకమునందుసువార్త యను విత్తనములు స్వల్ప కాలములో విత్తబడి యుండును. ఆఖరి పంట త్వరలోనే పండును. ప్రశస్తమైన పంటను పోగుచేయుటకు క్రీస్తు యేతేంచును. CChTel 227.1

    సహోదర, సహోదరీలారా, పరిశుద్ధాత్మ కొరకు విజ్ఞాపన చేయుడి. తాను చేసిన ప్రతి వాగ్ధత్తమును దేవుడు నెరవేర్చుకొనును. బైబిలును హస్తమందు ధరించి “నీవు చెప్పిన విధముగా నేను చేసితిని. అడుగుడి మీ కియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తియ్యబడును అన నీ వాగ్దానము నీకు జ్ఞాపకము చేయుచున్నాను” అని విజ్ఞాపన చేఉడి. క్రీస్తు ఇట్లు వచించుచున్నాడు. “అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగును.” మీరు నా నామమును బట్టి దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపర్చబడుటకై దాని చేతును.” (మత్తయి 7:7; మార్కు 11:24; యోహాను 14:13)CChTel 227.2

    తన చిత్తమును తన సేవకులకు ఎరుకపరచు నిమిత్తము క్రీస్తు తన రాయబారులను తన రాజ్యములోని అన్ని ప్రాంతములకు పంపుచున్నాడు. తన సంఘముల మధ్య ఆయన సంచరించుచున్నాడు. తన అనుచరులను పరిశుద్ధ పరచిసమున్నతులు, ఉదాత్తులుగా జేయుటకు అభిలాష పడుచున్నాడు. ఆయనయందు విశ్వాసముంచువారి పలుకుబడి ప్రపంచమందు జీవార్థమైన జీవపు వాసనగా నుండును. క్రీస్తు తన కుడిచేత నక్షత్రములను పట్టుకొని యున్నాడు. వాని ద్వారా ప్రపంచమునకు తన వెలుగును ప్రకాశింపజేయవలెనని ఆయన సంకల్పము. ఈ విధముగా పరలోక సంఘమందు ఉన్నతమైన సేవ జేయుటకు తన ప్రజల నాయన సంసిద్ధము చేయుచున్నాడు. ఆ కార్యమును మనము నమ్మక ముగా నిర్వహింతుముగాక! మానవుల కొరకు దైవకృప ఏమిచేయగలదో మన జీవితముల ద్వారా కనపర్చుదుము. 18T 22, 23;CChTel 227.3