Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మానవులను బైబిలునకు నడుపుట

    వ్రాయబడిన సాక్ష్యముల కర్తవ్యము క్రొత్త వెలుగు నిచ్చుట కాదు గాని క్రితము బయలు పర్చబడిన ఆవేశపూరిత సత్యములను హృదయములలో పటిష్ఠము చేయుటయే. దేవునిపట్ల తనతోటి మానవులపట్ల మానవునికి గల ధర్మమునుగూర్చి దైవవాక్యము ప్రత్యేకముగా స్పష్ఠీకరించు చున్నది. ఆయినను మీలో అల్ప సంఖ్యాకులు మాత్రమే ఇవ్వబడిన వెలుగునకు బద్ధులై యున్నారు. అదనపు సత్యమిందు ఇవ్వబడలేదు. కాని సాక్ష్యముల ద్వారా దేవుడు తాను ముందిచ్నిన సత్యములను సరళీకరించి సాకులకు తావులేకుండ వానిని ప్రజల కందించుటకు గాను తన యిష్టాను సారముగ వానిని రూపొందించెను. దైవ వాక్యమును చులకన చేయుటకు సాక్ష్యములు రాలేదు. కాని సత్యము నందలి రమ్యత, సరళత, అందరి హృదయములను చూరగొనుటకుగాను వారి మనస్సులు సత్యముచే నాకర్షించబడి సత్యమును ఘనపరచుటకే సాక్ష్యములు వెలసినవి. 25T 665;CChTel 205.3

    బైబిలు యొక్క ప్రాముఖ్యతను చులకన చేయుటకు ఆత్మ ఇవ్వబడలేదు. ఆత్మ అందు కెన్నడును ఇవ్వబడదు. కారణమేమనగా సర్వఉపదేశములును, జీవితాశయములును పరీక్షించుటకు దైవవాక్యమే ప్రమాణమని లేఖనములు విస్పష్ఠముగా సూచించు చున్నవి.. .. యెషయా ఇట్లుద్ఘాటించెను.. ..”ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్యప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు.” (యెషయా 8:20). 3GC Introduction, p. VII; CChTel 205.4

    “సహోదరుడు.. . ఈ వాక్యముల ద్వారా దేవుడిచ్చిన వెలుగు దైవవాక్యమునకు అదనముగా చేర్చబడుటకేయని బోధించుటద్వారా అతడు సత్యమును అపార్థము చేయుచున్నాడు. ఈ విధముగా తన ప్రజల మనస్సులను తన వాక్యమునకు త్రిప్పి తద్వారా వారికి గ్రహింపు శక్తిని ప్రసాదించుట సమంజసమని దేవుడు తలంచెను.” గ్రహించుటకు ఆశయమున్న వారికి దైవవాక్యము గ్రహింపు శక్తి నొసగి అంధకార బంధురమైన మనస్సుకు వెలుగునిచ్చుటలో సమర్ధమైనది. ఇది యిట్లుండగా దైవవాక్యమును పఠించు చున్నామని చెప్పుకొను వారు కొందరు సుస్పష్ఠములగు ఉపదేశములకు విరుద్దముగా జీవించు చున్నట్లు తేలుచున్నది. మానవులు సాకులు చెప్పుటకు తావులేకుండ దేవుడు అసందిగ్ధమైన సూటియై న సాక్ష్యములనిచ్చి వారు నిర్లక్ష్యము చేసిన దైవవాక్యమునకు వారిని తిరిగి నడిపించును. మంచిఅలవాట్లు అలవరచుకొనుటకు మంచి జీవితము జీవించుటకు ఉపకరించు సూత్రములకు దైవ గ్రంథము ఆటపట్టు. ఈ సూత్రములపై వారి ధ్యానమును కేంద్రీకరించుటకే సార్వజనీనమైన, వ్యక్తిగతమైన ఈ సాక్ష్యములు యుద్దేశింపబడినవి. CChTel 206.1

    దేవుడు తన ప్రజల కిచ్చిన సంఘ సాక్ష్యములచే అమూల్యమైన బైబిలును పరివేష్ఠించి ఇట్లు వెదజల్లితిని. ఇక్కడ దాదాపు అందలి విషయములు చర్చించ బడినవని నేను తలంచితిని. ప్రజలు విడనాడవలసిన పాపములు చూపబడినవి. వారు వాంఛించు హితవు ఇందు లభించును. ఈ హితవు అట్టి పరిస్థితుల యందున్న ఇతరులకు ఇవ్వబడినది. వాక్యము వెంబడి వాక్యము ఉపదేశము వెంబడి ఉపదేశము మీకు దేవుడనుగ్రహించెను. CChTel 206.2

    సాక్ష్యములయందున్న విషయములను ఎరిగిన వారు మీలో ఎక్కువమంది లేరు. మీకు లేఖన పరిచయము లేదు. బైబిలు ప్రమాణము నందుకొని క్రైస్తవ సంపూర్ణతను సాధించవలెనను వాంఛ కలిగి మీరు దైవ వాక్యమును పఠించియున్నచో సాక్ష్యములు మీకు అవసరము లేకుండును. దైవావేశపూరిత గ్రంథపఠనమును మీరు నిర్లక్ష్యముచేసిన కారణముగా సులభమైన, సూటియై న సాక్ష్యముల ద్వారా మిమ్మును సంధించి మీరు నిర్లక్ష్యముచేసి గైకొనకున్న ఉపదేశములను మీకు ఎరుక పరచి వేదగ్రంథపు పవిత్రమైన, సమున్నతమైన బోధల ప్రకారము మీ జీవితములను తీర్చి దిద్దుకొన వలసినదిగా మిమ్మును అభ్యర్థించుట కాయన సమకట్టియున్నాడు. 45T 663-665;CChTel 206.3