Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    చదువరికి దైవజ్ఞానము వాగ్దానము చేయబడెను.

    దైవ వాక్యమునందు దాని కర్తయగు దేవుని శీలమునందువలె పరిమితజ్ఞానముగల మానవుల కర్థముగాని మర్మములనేకములున్నవి. దైవవాక్యము “దురవగాహమైన తేజస్సులో” నివసించ సృష్టికర్తవైపునకు మనస్సులను త్రిప్పుడు. (1తిమోతి 6:16) సర్వయుగముల మానవ చరిత్రకు సబంధించిన ఆయన సంకల్పములను అది మనకు ఎరుకపరచును. ఈ సంకల్పముల నెరవేర్పు అనంతకాలమందు సంభవించును. దైవ ప్రభుత్వమునకును, మానవుని గమ్యస్థానమునకు సంబంధించిన గంభీర, ప్రాముఖ్యాంశములకును, మన ధ్యానమునకది మరల్చును. CChTel 217.1

    లోకములో పాపము ప్రవేశించుట, క్రీస్తు నరావతార మెత్తుట, నూతన జన్మము, పునరుత్థానము బైబిలులో వ్రాయబడిన అనేక యితర అంశములు మానవులు విశదీకరింప లేని లేక పూర్తిగా గ్రహింపలేని మర్మములు. కాని వారి దైవికస్థితినిగూర్చి లేఖనములలో దేవుడు మనకు చాలినంత నిదర్శనము నిచ్చెను. ఆయన సంకల్పమునకు సంబంధించిన మర్మములన్నింటిని మనము అవగాహన చేసికొనలేని కారణముగా ఆయన వాక్యమును మనము శంకింపరాదు. CChTel 217.2

    దేవుని గూర్చియు ఆయన కార్యములను గూర్చియు సృజింపబడిన మానవులకు పూర్తిగా గ్రహించుట సాధ్యమైనచో ఇది సాధించిన మీదట వారు పరిశోధించవలసిన సత్యముండదు. వారికి జ్ఞానసంబంధమైన పెరుగుదల ఉండదు. మానసికాభ్యుదయ ముండదు. ఇక దేవుడు సర్వోత్కృష్టుడు కానేరడు. హద్దుగా నియమింపబడిన జ్ఞానమును సంపాదించిన మీదట మానవులిక ప్రగతిజెందరు. ఇది ఇట్లు జరుగనందుకు మనము దేవునికి వందనస్థులము. దేవుడు అపారమైనవాడు. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆనయందే గుప్తమై యున్నవి” యుగయుగముల పర్యంతము మానవులు పరిశోధించ వచ్చును. నేర్చు కొనవచ్చును. అయినను ఆయన వివేకము, సౌజన్యము, శక్తిసంపదలు తరుగనే తరుగవు. CChTel 217.3

    పరిశుద్దాత్మ నడుపుదల లేనిచో మనము నిత్యము లేఖనములను మలిపి వానికి అపార్థములు చెప్పుటకు వీలున్నది. ఉపయోగములేని వేధపఠనము అనేక సందర్భములలో హానికరమైన పఠనముకూడ చాల జరుగుచున్నవి. అమార్యదగ ను, ప్రార్థించకుండగను దైవ గ్రంథము విప్పబడినచో హృదయ ధ్యానములు, మమకారములు దేవునిపై కేంద్రీకృతములుకానున్నచో లేక ఆన చ్తితముతో ఏకస్థుము కాకున్నచో మనసును సంశయము ఆవహించును. అట్లు వేదపఠనము చేయుట ద్వారా సందేహతత్వము పెచ్చు పెరుగును. ఆలోచనలను అపవాది కైవసము చేసికొని అపార్థములను ప్రతిపాదించును. 95T 699-705;CChTel 218.1