Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    శేషించిన సంఘము

    యెహోషువాను గూర్చియు దేవదూతను గూర్చియు జెకర్యాకు కలిగిన దర్శనము మహా ప్రాయశ్చిత్త దినాంతమందు నివసించుచున్న దైవ ప్రజల అనుభవమునకు బలముగా అన్వయించు చున్నది. శేషించిన సంఘమునకు మహా శ్రమ దు:ఖము సంప్రాప్తమగును. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనువారు ఘట సర్పముయొక్కయు వాని అనుచర బృందము యొక్కయు ఆవేశకావేషములకు గురి యగుదురు. లోకస్థులు తన జ్రలని సాతాను పరిగణించుచున్నాడు. CChTel 522.2

    భ్రష్ట సంఘముల నతడు స్వాధీన పరచు కొనుచున్నాడు. కాని యాతని ఆధిపత్యము ప్రతిఘటించు సమూహము కలదు. వీరిని లోకములో నంఉడి తుడిచివేయ గల్గినచో అతనికి సంపూర్ణ జయము కలగును. ఇశ్రాయేలీయులను నాశనము చేయుటకు పర రాజులను ప్రోత్సహించిన రీతిగానే అచిర కాలములో దైవ ప్రజలను నావనము చేయుటకు అతడు లోక మందలి దుర్మార్గులను ప్రోత్సహించును. దైవ ధర్మశాస్త్రమునకు ప్రతికూలముగా రూపొందిన మానవశాసనములను అందరు కాపాడవలెనని ఆజ్ఞాపించబడెదరు. దేవునికి నమ్మకముగా నుండి తమ విధిని నెరవేర్చువారు భయపెట్టుబడెదరు. ఆక్షేపించబడెదరు. దేశము నుండి బహిష్కరించబడెదరు. వారు “తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బందువుల చేతను, స్నేహితుల చేతను.. అప్పగించబడెదరు.”CChTel 522.3

    దైవ కృపయే వారి ఏకైక నిరీక్షణ. ప్రార్థనయే వారి ఏకైక రక్షణాయుధము యెహోషువా దేవదూత ముందు విజ్ఞాపన చేసిన రీతిగా శేషించిన సంఘమున కూడ విరిగిన హృదయముతోను విశ్వాసముతోను క్షమాపణ కొరకు విముక్తి కొరకు తమ ఉత్తర వాదియగు యేసు ద్వారా విజ్ఞాపన చేసెదరు. తాము పాపులమని వారు సంపూర్ణముగా గ్రహించెదరు. తమ బలహీనతను, అయోగ్యతను వారు గుర్తించెదరు. తమ్మును గూర్చి తాము ఆలోచించి ప్రలాపించుటకు సిద్ధముగా నుందురు. యెహోషువాను ప్రతికూలించుటకాయన ప్రక్క ఉన్న రీతిగా వారిపై ఫిర్యాదు చేయుటకు వోధకుడు వారి ప్రక్కనే యుండును. తమ మలిన వస్త్రములను శీలదౌర్భల్యమును వారికి అతడు చూపును. తమ బలహీనతను, దోషమును, తమ కృతఘ్నతా దోషములను, తాము క్రీస్తును పోలియుండక పోవుటకు, వారికి చూపి యవి తమ రక్షకుని అగౌరవపరచినవని చెప్పును. తమ స్థితి అతి ఘోరమైన దనియు తమ అపవిత్ర వలన ఏర్పడిన మరక ఎన్నడును పోదనియు మానవుల నతడు భయపెట్టును. వారు తన శోధనలకు లొంగి దైవభక్తి నీడి మృగము ముద్ర వేసికొను నంతగా వారి విశ్వాసమును పోగొట్టుటకతడు యత్నించును. CChTel 523.1

    దేవుని ముందు సాతానుడు వారపై నేరము మోపును. తమ పాపముల వలన వారు దేవుని కాపుదలను కోల్పోయిరనియు పాపులగు వారిని నాశనము చేయుటకు తనకు శక్తి గలదనియు వాదించును. తన వలె వారు కూడ దైవాదరమునకు అపాత్రులని యతడు వాదించును. “నా స్థలము, నాతో ఏకీభవించిన దూతల స్థలము ఆక్రమించు జ్రల వీరేనా? దైవ ధర్మశాస్త్రమును గైకొనుచున్నామని చెప్పుచున్నను దాని సూత్రములను వారు గైకొనిరా? దేవుని కన్న వారు తమ్మును తామెక్కువ ప్రేమించుకొనలేదా? ఆయన సేవకన్న తమ స్వకీయాశలను వారెక్కువ లక్ష్యము చేయలేదా? వారు లోక విషయములనెక్కువ ప్రేమించలేదా? వారు ఒకరి యెడల ఒకరు కనపర్చు స్వార్థము, అసూయ, ద్వేషము చూడుడి” అని యతడు పలుకును. CChTel 523.2

    దైవ ప్రజలు అనేక విషయములలో లోపములు కదిగి యున్నారు. వారిని శోధించి వారిచే చేయించిన పాపముల విషయము సాతాను బాగుగ ఎరుగును. వీనిని హెచ్చించి యీ విధముగా చెప్పుచు బహిర్గతము చేయును: “నన్నును నా దూతలను తన సముఖములో నుండి బహిష్కరించి ఆ పాపములను చేసిన వారికి దేవుడు బహుమానము లీయునా? ప్రభువా ఇట్లు చేయుట న్యాయము కాదు. నీ సింహాసనము నీతి న్యాయములలో నిలవనేరవు. వారికి శిక్ష విధించుటయే న్యాయము.”CChTel 523.3

    క్రీస్తుని అనుచరులు పాపము చేసినను దుర్మార్గతకు తమ్మును తాము అప్పగించు కొనలేదు. వారు తమ పాపములను విడచి వినయముతోను పశ్చాత్తపముతోను ప్రభువునాశ్రయించిరి. కనుక వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. వారి కృతఘ్నత వలన అమర్యాద పర్చబడిన ఆయన తమ పాపములను, పశ్చాత్తాపమును ఎరిగిన ఆయన ఇట్లు సెలవిచ్చుచున్నాడు: “సాతానూ, యెహోవా నిన్ను గద్దించునా’ ఈ యాత్మల నిమిత్తము నేను నా ప్రాణము నర్పించితిని. వారు నా యర చేతిలో చెక్కబడిన వారు.”CChTel 524.1