Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అంతము సమీపము

    మన ప్రపంచమునకు క్రీస్తునిరాక ఎక్కువ ఆలశ్యము చేయబడదు, ఇది ప్రతి వర్తమానము యొక్క సారాంశమై యుండవలెను. CChTel 509.3

    పాపముచేయుట కడ్డగించు దైవాత్మ లోకములో నుండి తీసివేయబడు సమయము ఆరంభమాయెను. వాయు గుండములు, తుఫానులు, గాలివానలు, అగ్ని ప్రమాదములు, భూసముద్రములందలి ప్రమాదములు, ఒకదాని వెంట ఒకటిగ సంభవించుచున్నవి, వీటన్నింటిని విశదము చేయుటకు విజ్ఞాన శాస్త్రము పూనుకొను చున్నది. దైవ కుమారుని రాకడ సమీపముగనున్నదని యేకరువు పెట్టుచు మన చుట్టు అధికమగుచున్న యీ గురుతుల నిజ భావమును గ్రహించలేక యున్నారు. దేవుని సేవకులు ముద్రించబడు వరకు నాలుగు గాలులను ఆపుచేయుచున్న దేవదూతలను మానవులు గ్రహించలేకున్నారు. అయితే గాలులను విడువుడని దేవుడు తన దూతల కానతి ఇచ్చినపుడు వర్ణనా తీతమైన యుద్ధ దృశ్యము కాన్పించును. CChTel 509.4

    అడ్డుతెర పైకి లాగబడగల్గి, దైవ ఉద్దేశమును, పాప ప్రపంచముపై పడ సిద్ధముగ నున్న తీర్పులను మీరు గ్రహించ గలిగినచో, మీ వైఖరిని మీరు చూడగలిగిచో మీ యాత్మల విషయము మీరు భీతిల్లి వణకెదరు. CChTel 509.5

    హృదయ విదారకమైన బాధతో కూడిన ప్రార్థనలు పరలోకమును, మీరు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలుపబడి కన్నీరు విడుచుచు మీ ఆధ్యాత్మిక అంధత్వము. విశ్వాస ఘాతుకత్వమును గూర్చి ఒప్పుకొనెదరు. 66T 406, 408;CChTel 510.1