Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    బాప్తిస్మము కొరకు బిడ్డల సిద్ధబాటు

    బాప్తిస్మము పొంద నిచ్ఛగించు బిడ్డలు గల తల్లిదండ్రులు చేయవలసిన పనియొకటి యున్నది. వారు ఆత్మ పరీక్ష చేసికొని తమ బిడ్డలను నమ్మకముగా ఉపదేశమీయవలసియున్నారు. బాప్తిస్మము అతిపవిత్రమైన, ప్రాముఖ్యమైన ఆచారము. దీని భావమును పూర్తిగా గ్రహించవలెను. పాపము విషయము పశ్చాత్తాపపడి క్రీస్తుయేసునందు నూత్న జీవితము జీవించుటయని దీని భావము. ఈ యాచారమును అనుష్టించుటలో తొందర పనికిరాదు. తల్లిదండ్రులు, బిడ్డలు ఉభయులును దాని పర్యవసానములను గూర్చి యోజింపవలెను. బిడ్డల బాప్తిస్మము నంగీకరించుటలో ఈ బిడ్డల విషయము నమ్మకమైన గృహనిర్వహకులుగా నుండి ప్రవర్తనా నిర్మాణములో వారికి మార్గదర్శనమిత్తుమని తల్లిదండ్రులు పవిత్ర వాగ్దానము చేయుచున్నారు. తామవలంభించు విశ్వాసమునకు కళంకము నాపాదించకుండునట్లు ఈ చిన్న మందను ప్రత్యేక శ్రద్ధతో కాపాడెదమని తల్లిదండ్రులు దేవునితో ఖరారు పడుచున్నారు. CChTel 241.1

    చిన్ననాటినుండియు బిడ్డలకు మత విషయకమైన ఉపదేశమునీయవలెను. కోపతాపములతో గాక ఆనందోత్సా హములతో నుపదేశమీయవలెను. తల్లులు గుర్తించలేని విధముగ పిల్లలకు శోధనలు వచ్చును. కనుక తల్లులు జాగ్రత్తగా నుండవలెను. తల్లిదండ్రులు వివేకముతోను ఉత్సాహపూరితముగాను బిడ్డలకు నుపదేశమీయవలెను. అనుభవశూన్యులగు వీరికి ఉత్తమ స్నేహితులై జయశీలురగుటకు సహాయము చేయవలెను. విజేతలగుట వారికి శ్రేయస్కరము. సత్యము నవలంభించ ప్రయత్నించు తమ బిడ్డలుదైవ కుటుంబమందు బాల సభికులని వారు పరిగణించవలెను. రారాజుని విధేయతా మార్గమందు తిన్నగా నడచునట్లు పిల్లలకు వారు ఆసక్తితో సహాయము చేయవలెను. ప్రేమాసక్తులతో దినదినము దేవుని పిల్లలననేమో నేర్పి ఆయన చిత్తమునకు లొంగునట్లు వారికి శిక్షణ నీయవలెను. దేవునికి విధేయులగుటలో తల్లిదండ్రులకు విదేయులగుటకూడ ఇమిడియున్నదని వారికి నేర్పించుడి. ఇది ప్రతిదినము ప్రతి ఘడియ జరుగవలసిన కార్యము. తల్లిదండ్రులారా జాగరూకులై మెళుకువగా నుండి ప్రార్థించుడి. మీ బిడ్డలతో మీరు స్నేహించుడి. CChTel 241.2

    తమ జీవితములలో నతి సంతోషకరమైన సమయము వచ్చినపుడు తమ హృదయములలో క్రీస్తును ప్రేమించి బాప్తిస్మము పొందవలెనను కాంక్ష జనించగా వారికి నమ్మకముగా సహాము చేయుడి. ఈ యాచారము ననుష్ఠించకముందు దేవుని కొరకు పని చేయుట తమ ప్రప్రధమ కర్తవ్యమో కాదో వారిని అడుగుడి. అప్పుడు ఎట్లు ప్రారంభించవలెనో వారికి నేర్పించుడి. ప్రారంభ పాఠములు అతి ప్రాముఖ్యమైనవి. దేవుని కొరకు తమ ప్రథమ సేవ నెట్లు నిర్వహించవలెనో సరళముగా వారికి నేర్పించుడి. ఆరోగ్యమును సులభగ్రాహ్యమొనర్చుడి. ప్రభువు నిమిత్తము స్వార్థమును వీడి ఆన వాక్యము ప్రకారము క్రైస్తవ తల్లిదండ్రుల సలహా ప్రకారము నడచుకొనుట యననేమో వారికి విశదపరచుడి. CChTel 242.1

    మీరు నమ్మకముగా పని చేసిన పిమ్మట బాప్తిస్మము, మారుమనస్సుల భావమును మీ బిడ్డలు గ్రహించిరనియు వారు మారుమనస్సు పొందిరనియు మీరు తృప్తి నొందినచో అప్పుడు వారిని బాప్తిస్మము పొందనీయుడి. విధేయతను సంకుచిత ఆర్గమందు అనుభవశూన్యులగు వారి పాదములను నడిపించు కాపరులుగా వర్తించుటకు ముందు మిమ్మును మీరు సిద్ధపరచుకొనవలెననని పునరుద్ఘాటించుచున్నాను. ప్రేమ, మర్యాద, క్రైస్తవ వినయము కలిగి పిల్లలకు సరియై న ఆదర్శము చూపించునట్లు తల్లిదండ్రుల యందు దేవుడు పని చేయవలెను. మీ పిల్లల బాప్తిస్మమునకనుమతించి యామీదట తాము తిన్నవి ఆర్గమందు నడువక యధేచ్చగా ప్రవర్తించును సత్యమునందు విశ్వాసమును, ధైర్యమును, ఆసక్తిని కోల్పోయినచో దానికి మీరే బాధ్యులు. CChTel 242.2

    బాప్తిస్మాచరణములో పాల్గొను బిడ్డలకన్న యుక్త వయస్సుకు వచ్చువారు తమ విధిని ఎక్కువగా గ్రహించవలెను. సంఘకాపరికి వీరి విషయమైన బాధ్యత కలదు. వారికి దుకభ్యాసములు, ఆచారములు కలవా? వారితో ప్రత్యేకముగా మాటలాడవలసిన బాధ్యత సంఘ పాదిరిపై గలదు. వారికి వేదపాఠముల నీయుడి. వారితో ముచ్చటించి ప్రార్థించుడి. వారిపై దేవునికిగల హక్కులను విస్పష్టముగా చూపించుడి. మారు మనస్సు విషయము బైబిలు నందలి యుపదేశములను వారికి చదివి వినిపించుడి. ఫలము దేవుని ప్రేమించుట యని వారికి చుపించుడి. యధార్దమైన మారుమనస్సనగా హృదయము, తలంపులు,లక్ష్యములు మారుట యని చూపించండి. దురభ్యాసములను విసర్జించవలెను. దుర్భాషణము, అసూయ, అవిధేయత అను పాపములు వర్జించబడవలెను. ప్రతి దుర్గుణమునకు విరోధముగా పోరాడవలెను. అప్పుడు విశ్వాసి జ్ఞానయుతముగా “అడుగుడి మీకీయబడును ” వాగ్దత్త ఫలమును పొందవచ్చును. (మత్తయి 7:7). 16T 91—99. CChTel 242.3