Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 22 - లోకమందున్నను లోకపు వారము కాము

    క్రీస్తు ఆకారములోనికి మార్చబడుటకు ప్రతిగా మనము లోకముతో లీనమగునట్టి అపాయమందున్నట్లు నాకు కనపర్చబడెను. ఇప్పుడు మనము నిత్యలోకపు గవినియొద్దయున్నాము. కాని లోకాంతము చాల దూరముగానున్నదని తలంచుటకు అపవాది మనలను ప్రేరేపంచు చున్నాడు. ఆజ్ఞలను గైకొనుచు గొప్ప శక్తితోను మహిమతోను మేఘములలో రానైయున్న మన రక్షకుని రెండవ రాకడకొరకుకనిపెట్టు ప్రజలను సాతాను సర్వవిధముల ప్రతిఘటింప జూచును. ఆ భయంకరమగు రెండవ రాకడ చాలా దూరముగా నున్నదని అనేకులను ప్రేరేపించి లోకమునందును లోకాచారము ననుసరించు వారిగా చేయజూచు చున్నాడు. CChTel 222.1

    సత్యమును పట్టుదలతో గైకొను చున్నామని చెప్పుకొను చున్నవారిని లౌకిక స్వాభావము స్వాధీనము చేసికొనుట చూచినపుడు నాకు ఆందోళన కలిగినది. వారు స్వార్థమును, లోకభోగములను లక్షించి యథార్థమగు దైవభక్తిని, బలమైన పవిత్రతను అభ్యసింపకున్నారు. 14T 306;CChTel 222.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents