Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 55 - వైద్య సేవ

    సువార్త సేవకు వైద్య సేవ నాంది. వైద్య సేవా ద్వారముగుండ వర్తమాన సత్యము అనేక గృహములలో ప్రవేశించవలసి యున్నది. దైవజనులు యధార్థమైన వైద్య సేవకులు కావలెను. ఏలయనగా వారు ఆత్మ యొక్కయు శరీరము యొక్కయు అక్కరలను తీర్చవలెను. ప్రాయోగికమయిన పనిద్వారా సంపాదించిన జ్ఞానము, అనుభవముతో వారు రోగులకు చికిత్స చేయుటకు వెళ్లినపుడు మన పనివారు స్వార్థరాహిత్యమును ప్రదర్శించవలెను. గృహములను సందర్శించు చుండగా వారు అనేక హృదయములను చేరు నవకాశము లభించును. వేరేవిధముగా సువార్తమానము నాలించుటకు వీలులేని అనేకులను ఈ సేవ ద్వారా రక్షించవచ్చును. ఆరోగ్య సంస్కరణ సూత్రములను ప్రదర్శించుటద్వారా మన సువార్త సేవ పట్ల కనపర్చబడుచున్న విద్వేషమును తొలగించుటకు సాయపడును. పరమవైద్యుడు, వైద్యసేవారంభకుడునగు దేవుడు వర్తమాన సత్యమును ఇట్లు ప్రచురించ నెంచిన వారందరిని దీవించును. CChTel 458.1

    భౌతిక స్వస్థత సువార్త సేవాజ్ఞతతో ముడివడియున్నది. క్రీస్తు తన శిష్యులను మొదటి సువార్త సేవా పర్యటనకు పంపినపుడు వారికిట్లాదేశించెను: “పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. చచ్చిపోయిన వారిని లేపుడి. కుష్ఠురోగులను శుద్ధలనుగా చేయుడి. దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” మత్తయి 19:7,8. CChTel 458.2

    దైనానతికి తిరుగులేదు. సత్యము నందించుటలో దైవ విధానమునకు మెరుగులు దిద్దజాలము. ఆత్మలు సత్యమునందు ఆనందించునట్లు చేయుట యెట్లో నేర్పుచు రక్షకుడు తన శిష్యులకు ప్రాయోగిక పాఠములనిచ్చెను. అలసిన వారిని, భారము మోయువారిని, బాధితులను చూచి ఆయన జాలిగొనెను. ఆగలిగొన్న వారి కాహారమిచ్చి రోగులను స్వస్థపరచెను. ఆయన మేలు చేయుచు సంచరించెను. తన ప్రేమాయుతములగు మాటల ద్వారాను దయా కార్యముల ద్వారాను ఆయన సాధించిన మేలు ద్వారా మానవుల కాయన సువార్తను విప్పి చెప్పెను. CChTel 458.3

    మానవుని పక్షము క్రీస్తారంభించిన పని ముగియలేదు. అది ఇంకను సాగుచునే యున్నది. ఆ విధముగనే ఆయన రాయబారులు కూడా సువార్తను ప్రకటించి, నశించుచున్న ఆత్మలకు ఆయన దయాపూర్వక ప్రేమను ఎరుకపర్చవలెను. సహాయ మగత్యమయిన వారి యద నిస్స్వార్ధమయిన ఆసక్తి చూపుట ద్వారా సువార్త సత్యమును క్రియలయదు ప్రదర్శించవలెను. ప్రసంగములు ఏయుటయే గాక అంతకన్న ఎక్కువ ఈ పనియదవసరము. తన నామమందు బయలదేరి వెళ్లు వారికి లోకమందుసువార్త చాటపనినిచ్చి యున్నాడు. వారు క్రీస్తుతో జతపనివారై, నశించ సిద్ధమగా నున్న వారికి ఆయన దయాయుత మయిన ప్రేమను కనపర్చవలెను. తన సేవను వేవేల ప్రజలు నిర్వహించవలెనని దేవుని యాకాంక్ష, వర్తమాన సత్యము నెరిగిన వారికే బోధించక, అంతిమ కృపా సదేశమ నెన్నడును వినని వారికి హెచ్చరిక నీయవలెనని ఆయన కోరిక. ఆత్మల కొరకు యథార్థమైన ఆసక్తితో నిండిన హృదయముతో పనిచేయుడి. వైదసేవ చేయుడి. ఇంతకన్న బలవత్తరముగా సత్యము ప్రకటింపబడుటకు మార్గము సిద్ధమ చేయబడును. 1CH 497-499; CChTel 459.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents