Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    క్రీస్తును ఒప్పుకొనుట లేక ఉపేక్షించుట

    మానవ సమాజమందేగాని, కుటుంబములందేగాని, లేక మానవ సంబంధములుగల మరేయితర స్థలములందేగాని మనము మన రక్షకుని ఒప్పుకొనుటకు లేక ఉపేక్షించుటకు పెక్కు మార్గములున్నవి. ఇతరులనుగూర్చి చెడ్డగా మాటలాడుటద్వారాను, బుద్ధి హీన ప్రస్తావనలద్వారాను, పరిహాసముగా మాటలాడుటద్వారాను, నిర్దయతోకూడిన మాటలద్వారాను, లేక సత్య విరుద్దముగా మాటలాడుటద్వారాను మనము ఆయనను ఉపేక్షింపవచ్చను. సుఖమును ప్రేమించుటద్వారాను జీవితభావ బాధ్యతలను అలక్ష్యము చేయుటద్వారాను, పాపవినోదములు ప్రేమించుటద్వారాను మనమాయనను ఉపేక్షింపవచ్చును. దుస్తుల వలని గర్వము, లోకముననుకరించుట లేక అమర్యాదగా వర్తించుట వీనిద్వారా మనము క్రీస్తును ఉపేక్షింపవచ్చును. మన సొంత ఉద్దేశ్యములను ప్రేమించి స్వార్ధమును సమర్ధించుకొన జూచుట ద్వారా మనమాయనను ఉపేక్షింపవచ్చును. కామోద్రేక యోచనా పరంపరలో నిమగ్నులమగుటద్వారాను, కష్టములను గూర్చి సర్వదా తలంచుటద్వారాను, మనము ఆయనను ఉపేక్షింప వచ్చును. CChTel 203.1

    తమయందు క్రీస్తు మనస్సు, స్వభావము ఉంటేనేతప్ప, ఎవరును క్రీస్తునుగూర్చి లోకము నెదుట ఒప్పుకొనజాలరు. మనయందు లేని దానిని ఇతరులకియ్యజాలము. మన యందున్న కృపను, సత్యమును మనము మన మాటయందు ను వర్తనయందును కనుపర్చవలెను. హృదయము పరిశుద్ధమైనది, లొంగునది, వినయమైనది యగుచో దాని ఫలములు బయటికి కనబడును. ఇదేయే క్రీస్తునుగూర్చి ప్రజల సాక్ష్యమగును. 103T 331; 332. CChTel 203.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents