Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తల్లిదండ్రులారా, బిడ్డల రక్షణ కొరకు సమిష్టిగా కృషి చేయండి

    అడ్డుతెర తొలగించబడి ప్రస్తుతము జరుగుచున్న కార్యమును దేవుడు చూచునట్లు తల్లిదండ్రులు చూడగలిగినచో, ఒకరి కార్యమును మరియొకరి కార్యమునకు పోల్చి చూడగల ఆయన అనంత నేత్రమును వారు కాంచగలిగినచో పరలోక ప్రత్యక్షతను గూర్చి వారు ఆశ్చర్యచకితులగుదురు. తండ్రి తన కార్యకలాపములను వినయ దృక్యధముతో చూచును. తల్లి తన కార్యకలాపములను నవశక్తి కలికి జ్ఞానముతోను, శాంతముగాను, ఓర్పుతోను నిర్వర్తించును. దాని విలువ నామె ఇప్పుడు గ్రహించును. ఆశాశ్వతమై గతించు విషయములపై తండ్రి శ్రద్ధ వహించగా తల్లి బుద్ధి శీలములను వృద్ధి చేయు కార్యమునందు నిమగ్నురాలై యుండును. ఇది ప్రస్తుతమునకేగాక నిత్యజీవమునకు సంబంధించిన కార్యము. 4AH 233;CChTel 299.3

    తన బిడ్డల పట్ల తండ్రికి గల బాధ్యతను అతడు తన భార్యకు మార్పిడి చేయరాదు. తన బాధ్యతనామె నిర్వర్తించుచున్నచో ఆమెకు చాలినంత భారమున్నట్లే తమకనుగ్రహించబడిన కార్యమును భార్య భర్తలిద్దరును ఏకీభవించి పని చేయుట ద్వారానే సాధించగలరు. CChTel 300.1

    తన బిడ్డలను ప్రస్తుత జీవితమునకును నిత్య జీవితమునకును తర్బీదు చేయు కార్యము నుండి తండ్రి తప్పించుకొనరాదుఈ బాధ్యతయందతడు తన భాగమును నిర్వహించవలెను. తల్లిదండ్రిలిద్దరికిని నిందు బృహత్తర బాధ్యత కలదు. తమ బిడ్డలలో ప్రేమ మర్యాదలు వర్థిల్లవలెనని ఆశించనచో తల్లిదండ్రుల మధ్య ఈ గుణములు పెంపొందించవలెను. CChTel 300.2

    తండ్రి కుమారులతో స్నేహించి తన విశాలనుభవమును గూర్చి వారికి చెప్పి వారితో సరళముగాను, దయగాను మాటలాడి వారిని ఆకర్షించవలెను. నిత్యము వారి ఆసక్తి ఆనందములను తాను లక్షించుచున్నట్లు వారికి ఎరుకపర్చవలెను. CChTel 300.3

    మగపిల్లలుగల గృహస్తుడు ఏ పనియందున్నను తన ఆధీనమందుంచబడిన ఆత్మలను అలక్ష్యము చేయరాదు. ఈ పిల్లల పుట్టువుకు కారకుడతడే. అవాంఛనీయమైన దుస్సాంగత్యము నుండి వారిని కాపాడుటకు తన శక్తి కొలది కృషి చేతునని అతడు దేవునితో ఖరారుపడినాడు. అల్లరి బాలురను తల్లికే విడువరాదు. ఇది ఆమె మోయలేని భారము. తల్లి బిడ్డలకు అనువగునట్లు విషయములను అతడు చక్కజేయవలెను. ఆత్మనిగ్రహము కలిగి తల్లి తన పిల్లలను సుశిక్షితులను చేయుట కష్టముగా నుండవచ్చును. ఇట్టి పరిస్థితులలో తండ్రి యెక్కువ భారము వహించవలసి యుండును. తన బిడ్డల పరిరక్షణకై యాతడు పట్టుదలతో కృషి సల్పవలెను5AH 216-221;CChTel 300.4