Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    చెప్పవల్లగాని దర్శనము

    1890 నవంబరులో న్యూయార్కు రాష్ట్రమునందలి సాలమన్నా నగరములో జరగుతున్న కూటములలో శ్రీమతి వైటమ్మగారు ఉపన్యసించుచుండగా చాల బలహీనత ఏర్పడినది. ఏలయనగా ప్రయాణమునందు ఆమెకు పడిశము పట్టెను. ఒక కూటము అయిన పిమ్మట అధైర్యముతోను జబ్బుతోను ఆమె తన గదికి వెళ్ళెను. కృప, ఆరోగ్యము, బలము కొరకు దేవుని ముందు తన హృదయభారమును వెలిబుచ్చవలెనని యామె తలపోయుచుండెను. ఆమె తన కుర్చీప్రక్క మోకరిల్లెను. పిదప ఏమి జరిగినదో ఆమె తన సొంత మాటలోనిట్లు చెప్పుచున్నది:CChTel 41.3

    “నేను ఒక మాటకూడ ఉచ్చరించకముందే ఆ గదియంతయు వెండి వంటి తెల్లని వెలుగుతో నిండెను. నిరాశ నిస్పృహలవలన కలిగిన నా బాధ మటుమాయమయ్యెను. నాలో క్రీస్తు సమాధానమగు ఆదరణ, నిరీక్షణలు నెలకొన్నవి.”CChTel 41.4

    అప్పుడామెకొక దర్శనముల కలిగెను. దర్శనము ముగిసినపిదప ఆమె నిద్రించనిష్టపడలేదు. విశ్రాంతి తీసికొనగోరలేదు. ఆమె స్వస్థత పొందినది. అప్పుడు ఆమెకు విశ్రాంతి లభించినది. CChTel 41.5

    తరువాత కూటములు జరుగనై యున్న స్థలమునకు వెళ్లుటయా లేక తిరిగి బేటిల్‌ క్రీక్‌కు వెళ్లిపోవుటయా అను విషయమపై మరుసటి ఉదయము ఏదో ఒక నిర్ణయము తెలియపర్చబడవలసియుండెను. పర్యవేక్షకుడు ఎల్డరు ఎ. టి. రాబినసన్‌గారు, వైటమ్మగారి కుమారుడు ఎల్డరు విల్యము వైటుగారు ఆమె నిర్ణయమును తెలిసికొనుటకు ఆమె గదికి వెళ్లిరి. ఆమె సిద్ధపడియున్నట్లు, ఆరోగ్యముగానున్నట్టు వారికి అవగతమైనది. వెళ్లుటకామె సిద్ధముగానున్నది. తనకు కలిగిన దర్శనమును గూర్చి కూడ వారికి ఎరుకపర్చెను. “గత రాత్రి నాకు ప్రత్యక్షపర్చబడిన సంగతులను గూర్చి మీకు చెప్పనాసించుచున్నాను. దర్శనములో నేను బేటిల్‌ క్రీక్‌లో నున్నట్లు అగపడెను. దేవదూత ‘నన్ను వెంబడిరచుము’ అనెను” అని చెప్పి పిదప తడబడినది. అది ఆమెకు స్ఫురించలేదు. దానిని చెప్పుటకామె రెండు సార్లు ప్రయత్నించెను. కాని తనకు చూపడిన సంగతులామె జ్ఞప్తికి రాలేదు. కొన్ని దినములైన పిదప తనకు ప్రత్యక్షపర్చబడిన సంగతులను ఆమె రచించినది. అప్పటిలో “అమెరికన్‌ సెంటినల్‌” అని పిలువబడిన మన మత స్వాతంత్య్ర పత్రికా నిర్వహణ కొరకు ఏర్పాటులనుగూర్చి ఆ దర్శనమీయబడినది. CChTel 41.6

    “రాత్రివేల జరిగిన అనేక చర్చలకు నేను హాజరైతిని. ”అమెరికన్‌ సెంటినల్‌” లో ‘సెవెంతు`డే ఎడ్వెంటిస్టు’ అను పదములను ముద్రించకుండ విడిచి, సబ్బాతునుగూర్చి ప్రస్తావించకున్నచో ప్రపంచ ప్రముఖులకది అభిమాన పత్రిక కాగలదు; అది ప్రఖ్యాత పత్రికయై గొప్ప సేవ చేయగలదు అని ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు ఉపన్యసించుట నేను వింటిని. ఇది చాల ఆనందకముగ నున్నట్లు కాన్పించినది.”CChTel 42.1

    “వారి ముఖములు కళకళలాడుట నేను చూచితిని. “సెంటినల్‌” పత్రికను జయప్రదము చేయుటకు వారొక ప్రణాళికను రూపొందించ సమకట్టిరి. తమ హృదయములలో నిత్యము ఆవశ్యము కావలసిన వ్యక్తులీ ఉద్యమము లేవదీసిరి.”CChTel 42.2

    ఈ పత్రికా నిర్వహణమందలి సాధక బాధకములను చర్చించుచున్న ఒక వర్గము నామె చూచినట్లు ఇది విశదము చేయుచున్నది. 1891లో జనరల్‌ కాన్ఫరెన్సు ప్రారంభమైనప్పుడు ప్రతి ఉదయము 5 1/2 గం॥లకు పనివారలకు ప్రసంగించి సబ్బాతు దినమున నాలుగు వేల మంది సభికులకు ప్రసంగము చేయవలసిందిగా శ్రీమతి వైటమ్మగారు కోరబడిరి. సబ్బాతు దినమున ఆమె మూలవాక్యము “మనుష్యులు మీ సత్కియలు చూచి పరలోకమందున్న మీతండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి” అనునది. ఆ ప్రసంగమంతయు తమ విశ్వాసము యొక్క విశిష్టతను నిలుపుకొనవలెనని ఎడ్వెంటిస్టులకు చేయబడిన ఒక హెచ్చరికయై యున్నది. ఆ కూటములో మూడు సార్లు సాలమన్కా దర్శనమును గూర్చి వైటమ్మగారు ప్రయత్నించిరి. కాని ప్రతి పర్యాయము ఆమె అడ్డగించబడెను. దర్శన వృత్తాంతము ఆమె జ్ఞప్తికి రాకుండ పోయెను. అప్పుడు దీనిని గూర్చి తరువాత వివరములు చెప్పెదను” అని పలికిరి. దాదాపు ఒక గంటసేపు ప్రసంగించి చక్కగా ఆ ప్రసంగమును ముగించిరి. పిదప కూటము సమాప్తమయినది. ఆమెకు దర్శనము జ్ఞాపకము రాలేదని యందరును గుర్తించిరి. CChTel 42.3

    జనరల్‌ కాన్ఫరెన్సు అధ్యక్షుడు వైటమ్మగారి వద్దకు వెళ్లి ఉదయారాధన కూటమందు ప్రసంగించవలెనని కోరెను. CChTel 43.1

    “ఆహాఁ, నేను అలసితిని; నేనీయ వలసిన సాక్ష్యమును ఇచ్చితిని. ఉదయకాల కూటమును వేరొకరికి ఏర్పాటు చేయుడి” అని వైటమ్మగారు సమాధానమిచ్చిరి. ఏర్పాట్లు చేయబడినవి. CChTel 43.2

    శ్రీమతి వైటమ్మగారు ఇంటికి తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యులతో ఉదయారాధన కూటమునకు తాను హాజరు కానని చెప్పినది. ఆమె చాలా అలసినది గనుక విశ్రమించవలెనని తలంచినది. ఆ ప్రకారము ఏర్పాట్లు కావింపబడినవి. CChTel 43.3

    రాత్రి కాన్ఫరెన్స్‌ కూటానంతరము రివ్యూ అండ్‌ హెరాళ్డు భవనములో కొందరు వ్యక్తులు సమావేశమైరి. ఆ సభకు “అమెరికన్‌ సెంటినల్‌” పత్రికను ప్రచురించు ప్రచురణాలయ ప్రతినిధులు హాజరైరి. మత స్వాతంత్య్ర సమితి ప్రతినిధులు కూడా హాజరైరి. “అమెరికన్‌ సెంటినల్‌” సంపాదకీయ విధానమును గూర్చి తమ మనస్సులను కలవరపర్చచున్న సమస్యను పరిష్కరించుటకు వారు సమావేశమైరి. గదికి తాళము వేయబడినది. ఆ సమస్య పరిష్కరించబడువరకు తాళము తీయరాదని అందరు ఒడంబడిరి. CChTel 43.4

    ఆదివారం తెల్లవారు జామున మూడు గంటకు కొన్ని నిమిషములముందు ఆ కూటము ముగిసినది. మత స్వాతంత్య్ర సమితి ప్రతినిధులు పసిఫిక్‌ ముద్రాక్షరశాల తమ కోరికకు అనుగుణ్యంగా ఆ పత్రిక నుండి “సెవెంతుడే ఎడ్వెంటిస్టు”, “సబ్బాతు” అను మాటలు విడుచు వరకు దానిని మత స్వాతంత్య్ర సమితి పత్రికగా ఉపయోగించజాలమని అభిలషించుటలో తీర్మానమునకు ప్రతిష్టంభన ఏర్పడినది. ఇక ఈ పత్రిక ఉండదని దీని భావము. అప్పుడు వారు తాళము తీసి తమ గదులకు వెళ్ళి నిద్రించిరి. CChTel 43.5

    ఎన్నడును కునుకుని నిద్రించని దేవుడు తన దూతను ఎలెన్‌ వైటమ్మగారి గదికి ఆ వేకువ మూడు గంటలకు పంపెను. ఆమె నిద్ర నుండి లేపబడి 5 ½ గం॥ల పనివారి కూటమునకు వెళ్ళవలెనని యుపదేశించబడెను. సాలమన్కాదర్శనములో ఆమెకు ప్రత్యక్షపర్చబడిన సంగతులు ఆ కూటమందామె చెప్పవలసియుండెను. దుస్తులు ధరించుకొని తన పుస్తక భాంఢాగారమునకు వెళ్ళి సాలమన్కా దర్శనములో తనకు ప్రత్యక్షపర్చబడిన సంగతులను వ్రాసియుంచిన పుస్తకమును తీసికొనెను. ఆ దృశ్యము తన మనస్సుకు స్పష్టముగా గోరించగా దానినామె విస్తృతముగా వ్రాసెను. CChTel 43.6

    గుడారములో బోధకులు ప్రార్థించి లేచుచుండగా శ్రీమతి వైటమ్మగారు కొన్ని వ్రాత ప్రతులను పట్టుకొని గుమ్మము దాటి లోనికి వచ్చుట వారు చూచిరి. జనరల్‌ కాన్ఫరెన్సు అధ్యక్షుడే ఉపన్యాసకుడు. ఆయన వైటమ్మగారిని పిలిచి:CChTel 44.1

    “వైటమ్మగారు, మిమ్మును చూచుట మాకు చాల సంతసము. మాకేదైన వర్తమానమును తెచ్చితిరా” అని యడిగెను. “నిశ్చయముగా తెచ్చితిని” అని వైటమ్మగారు ముందుకు వెళ్ళిరి. క్రిందటి దినమున ఎక్కడ ఆపినదో అక్కడ నుండి ప్రారంభించినది. ఆ ఉదయము మూడు గంటలకు తాను నిద్ర నుండి లేపబడి 5 ½ పనివారి కూటమునకు వెళ్ళి అందు సాలమన్కా దర్శనములో తనకు ప్రత్యక్షపర్చబడిన సంగతులను వివరిచవలసినదని ఆదేశించబడినట్లు చెప్పెను. CChTel 44.2

    “దర్శనమందు నేను బేటిక్‌ క్రీక్‌లో నున్నట్లు అగపడెను. రివ్యూ అండ్‌ హెరాల్డు కార్యాలయమునకు కొనిపోబడితిని. దేవదూత ‘నన్ను వెంబడిరచుము’ అని ఆదేశించెను. కొందరు వ్యక్తులు ఒక విషయముపై ఆసక్తితో తర్జన భర్జన చేయుచున్న గదికి నేను కొనిపోబడితిని. వారు ఆసక్తితో నిండియున్నారు. ఇది వివేకముతో కూడినది కాదు”. “అమెరికన్‌ సెంటినల్‌” సంపాదకీయ విధానమును వారు ఎట్లు చర్చించిరో ఆమె వ్యక్తము చేసినది. “ఒక వ్యక్తి ‘సెంటినల్‌’ పత్రికను పైకెత్తి ‘సబ్బాతును, ద్వితీయాగమనమును గూర్చిన యీ వ్యాసములు ఈ పత్రికలో ప్రచురించుట మానితే తప్ప మత స్వాతంత్య్ర సమితి పత్రికగా దీనిని మనము ఉపయోగించజాలము’ అని చెప్పుట నేను చూచితినని” చెప్పెను. ఎలెన్‌ జి వైటు కొన్ని మాసముల క్రిందట తనకీయబడిన దర్శనమును వివరించి దానినిCChTel 44.3

    పురస్కరించుకొని హితవు చేయుచు ఒక గంట సేపు మాటలాడెను. పిమ్మట ఆమె కూర్చుండెను. CChTel 44.4

    దానిని గూర్చి ఏమి తలంచవలెనో జనరల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షునికి బోధపడినది. కాదు. అట్టి కూటమును గూర్చి యతడెన్నడును వినియుండలేదు. దానిని గూర్చిన వివరణకు శ్రోతలెక్కువసేపు ఆగనక్కరలేక పోయెను. ఆ గది వెనుక భాగమున ఒక వ్యక్తి లేచి యిట్లు చెప్పనారంభించెను. CChTel 44.5

    “గత రాత్రి ఆ కూటమిలో నేనుంటి”
    “గతరాత్రా, గతరాత్రి” అని వైటమ్మగారు రెట్టించిరి.
    “అది దర్శనమందు నాకు చూపబడినప్పుడు చాల నెల క్రిందట జరిగినదని తలంచితిని” అని చెప్పెను.
    CChTel 45.1

    “గత రాత్రి ఆ సభలో నేను కూడ ఉంటిని. ఆ పత్రికను పైకెత్తి దానిలోని వ్యాసముల గూర్చి అట్లు ఆక్షేపించిన వ్యక్తిని నేనే. నేను పొరపాటున నుంటినని చెప్పుట నాకు చాల విచారము. కాని ఈ అవకాశమును పురస్కరించుకొని నేను మంచి మార్గమున నడెచెదను” అని యతడు అభిలాషించి కూర్చుండెను. CChTel 45.2

    మరియొక మనుజుడు మాటలాడుటకు లేచెను. అతడు మన స్వాతంత్య్ర సమితి అధ్యక్షుడు. ఆయన చెప్పిన మాటలను గమనించుడి: “నేను సభలో నుంటిని. గత రాత్రి కాన్ఫరెన్సు కూటము అయిన పిమ్మట మేము రివ్యూ అండ్‌ హెరాల్డు కార్యాలయమునందలి గదిలో కలిసికొని, ఆ గది తలుపుకు తాళము వేసి, ఈ ఉదయమున మనకు చెప్పబడిన విషయమును చర్చించితిమి. ఈ ఉదయము వేకువజామున మూడు గంటల వరకు మేమా గదిలోనే యుంటిమి. అక్కడ ఏమి జరిగినది. ఆ గదియందలి వ్యక్తుల వైఖరి ఎట్లున్నది`వీనిని గూర్చి నేను వివరింపదలచినచో సోదరి వైటమ్మగారు వివరించినంత నిర్ధుష్టముగా, సాకల్యముగా వివరింపజాలను. నేను తప్పులో నున్నాననియు, నేనవలంభించిన వైఖరి మంచిది కాదనియు ఇప్పుడు నేను గుర్తించుచున్నాను. ఈ ఉదయమందీయబడిన వెలుగునుబట్టి నేను చేసినది తప్పని ఒప్పుకొనుచున్నాను.”CChTel 45.3

    ఆ దినమున ఇతర వ్యక్తులుకూడ మాటలాడిరి. మొదటి రాత్రి ఆ కూటములోనున్న ప్రతి వ్యక్తి లేచి ఎలెన్‌ వైటమ్మగారు ఆ కూటమును అందలి వ్యక్తుల మనస్తత్వమును యథాతధముగా వివరించిరని సాక్షమిచ్చిరి. ఆ ఆదివార ఉదయ కూటము ముగియక ముందు మత స్వాతంత్య్ర సమితివారు ఒక చోటకు పిలువబడిరి. అయిదు గంటల క్రితము తాము చేసిన నిర్ణయమును వారు రద్దు చేసిరి. CChTel 45.4

    శ్రీమతి వైటమ్మగారు నిరాటంకముగా సబ్బాతు దినమున ఆ దర్శనమును వివరించియున్నచో దేవుడు ఉద్ధేశించిన కార్యమును ఆ వర్తమానము నెరవేర్చియుండక పోవును. ఏలయనగా ఆ కూటమప్పటి కింకను జరిగియుండలేదు. సబ్బాతు దినమున చేయబడిన హితవును ఆ వ్యక్తులు సరకుచేయలేదు. తమకే ఎక్కువ తెలియునని వారుతలంచిరి. ఈ దినములలోని కొందరివలె వారు బహుశా సోదరి వైటమ్మగారికి గ్రాహ్యమై యుండక పోవచ్చును” లేక”ఆ సలహా అనేక సంవత్సరముల క్రిందట నివశించినవారికి అన్వయించునదిగాని ఇప్పటి వారికిగాడు” అని తలంచియుండ వచ్చును. ఈ దినములలో సైతానుడు మనకు కలుగజేయు తలంపులు 1891లోని వారికాతడు కలిగించి శోధించిన తలంపువంటివే దేవుడు తన కిష్టము వచ్నిప్పుడు తన చిత్తము ప్రకారము అది తన పనియనియు దానిని తానే నడిపించుచున్నామనియు తానే కాపాడుచున్నాననియు, తన హస్తము కీలక స్థానముపై నున్నదనియు ఎరుక పరచెను. తాను పుచ్చుకొను చర్య సుప్రసిద్ధమగునట్లు తరచు గడ్డు పరిస్థితులేర్పడుటకు దేవుడు సమ్మతించును. ఇశ్రాయేలీయుల మధ్య దేవుడున్నాడని ఆయన బయలు పరచెను” అని ఎలెన్‌ జి. వైటమ్మ నుడువుచున్నారు. CChTel 45.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents